వంశీ వ్యూ పాయింట్ - 'టాక్సీవాలా'
వంశీ వ్యూ పాయింట్ - 'టాక్సీవాలా' ************************************ విజయ్ దేవరకొండ తాజా చిత్రం 'టాక్సీవాలా' - అర్జున్ రెడ్డి, గీత గోవిందం లాంటి సంచలనాలు; నోటా వంటి పరాజయం తక్కువకాలంలోనే చవిచూసిన విజయ్ తాజా చిత్రమైన 'టాక్సీవాలా' పై ఆసక్తి నెలకొంది. ఈ చిత్రానికి ఏకైక ఆకర్షక అంశం 'విజయ్ దేవరకొండ' ఇమేజ్. కొత్త దర్శకుడు, కొత్త హీరోయిన్. లో బడ్జెట్ ... ఈ చిత్రం మీద అనుమానాలు కలిగించాయి. అంచనాలను అందుకుందా లేక అనుమానాలను నిజం చేసిందా - చూద్దాం. కథ పరంగా చెప్పాలంటే హారర్ కామెడీ కి కాస్త సైన్స్ టచ్ ఇచ్చారు 'ఆస్ట్రల్ ప్రొజెక్షన్' పేరున. కాకపొతే, ఎక్కువగా దాని మీద దృష్టి పెట్టకుండా దానికి కాసింత కామెడీ, రివెంజ్ డ్రామా కలిపారు. ఆస్ట్రల్ ప్రొజెక్షన్ పాయింట్ కొత్తగా ఉన్నప్పటికీ, దాన్ని సరిగా ప్రాజెక్ట్ చేయలేదు, దానిమీద పెద్దగా దృష్టి పెట్టలేదు కూడా. అలాగని అదేమీ ఇబ్బంది పెట్టే అంశం కాలేదు కూడా. కుటుంబానికి భారం కాకూడదని, ఎదో పని చేసుకోవాలని నగరం వచ్చే సగటు మధ్యతరగతి అబ్బాయిగా విజయ్, మెడికోగా కొత...