... మూర్ఖులను శిక్షించాలి

వంశీ కలుగోట్ల // ... మూర్ఖులను శిక్షించాలి //
**************************************
గత కొద్ది రోజులుగా ప్రతి రోజూ కనీసం ఒక రేప్ ఘటన గురించి వార్తల్లో వస్తోంది, ఆవును ప్రతిరోజూ. అది కూడా తల్లి, చెల్లి తో సహా వావి వరసలు చూడకుండా; పిల్లా పెద్దా తేడా లేకుండా ఎవరిని పడితే వారిని రేప్ చేస్తున్నారు.
-> జమ్ము - కాశ్మీర్ లోని కథువా గ్రామంలో అసిఫా ఘటన (విచారణ కొనసాగుతోంది, మైనర్ బాలుడు కూడా నిందితుడు)
-> ఉత్తర ప్రదేశ్ లోని ఉన్నావ్ లో పక్కింటి యువతిపై ఉద్యోగమిప్పిస్తానని పిలిపించి ఎమ్మెల్యే అత్యాచారం (విచారణ కొనసాగుతోంది)
-> పోర్న్ వీడియోలు చూసిన ప్రభావంతో కని పెంచిన తల్లిని చెరిచాడు ఒకడు (గుజరాత్)
-> ఇద్దరు అన్నదమ్ములు కలిసి తమ బాబాయి కూతురు (చెల్లి వరుస) అయిన అయిదేళ్ళ అమ్మాయిని కొన్ని రోజుల పాటు రేప్ చేశారు (వరంగల్)
-> తాగిన మైకంలో చెల్లిని రేప్ చేసిన వ్యక్తి (తమిళనాడు)
-> ట్యూషన్ వెళ్లిన 8 ఏళ్ల పాపను, ట్యూషన్ టీచర్ కొడుకు (మైనర్ బాలుడు) రేప్ చేశాడు (గుంటూరు)
-> నాలుగు నెలల పసిపాపను 60 పై వయసున్న వాచ్మన్ రేప్ చేశాడు (మధ్యప్రదేశ్ అనుకుంటా, గుర్తు లేదు)
-> పెళ్ళికి వెళ్లిన 8 ఏళ్ల అమ్మాయిని రేప్ చేసి చంపేసిన వంట బృందంలోని వ్యక్తి (ఉత్తరప్రదేశ్, నిందితుడు మైనర్ అని వార్త - ఇంకా నిర్ధారింపబడలేదు)
-> కొన్ని నెలలుగా మిస్సింగ్ అయిన ఆంధ్రాకు చెందిన 8 ఏళ్ళ అమ్మాయి రేప్ మరియు హత్యకు గురై గుజరాత్ లో గుర్తింపబడింది (నిందితులెవరో ఇంకా తెలీదు)
-> తమిళనాడులో రైల్లో బాలికపై లైంగిక దాడికి పాల్పడిన భాజపా నాయకుడు అరెస్ట్
...
...
పై ఘటనలలో కొన్నింటిలో రేప్ చేసిన వారిలో మైనర్ బాలురు కూడా ఉన్నారు.

రేపటి దిన పత్రికలో ఏం చూడాల్సొస్తుందో అని భయమేస్తుంది. నెలల వయసున్న పసిపాప నుండి రేపో మాపో చనిపోయే ముదుసలి, తల్లి, చెల్లి ... వావివరుసలూ లేదు. అసలేం జరుగుతోంది. ప్రశ్నిస్తే వెంటనే ఇంతకుముందు జరగటం లేదా, కాంగ్రెస్ ప్రభుత్వంలో జరగటం లేదా అంటూ వెక్కిరింపులు. అప్పుడప్పుడూ కాదు, గత కొద్ది కాలంగా క్రమం తప్పకుండా జరుగుతూనే ఉన్నాయి ఇటువంటి ఘటనలు. కారణాలు అన్వేషించకుండా, గతంలో జరగలేదా అంటూ పలాయనమేమిటి? కాంగ్రెస్ కాకపోతే భాజపా, భాజపా కాకపొతే కాంగ్రెస్ - ఇలా ఇద్దరూ అధికారం చెలాయిస్తూ ఉండటమేనా? 

- మహిళలకు భద్రత లేదు
- రైతులకు భరోసా లేదు
- నిరుద్యోగులకు ఆశ లేదు

- ప్రజలకు నమ్మకం లేదు

అసలేమనాలో కూడా అర్తం కావటం లేదు. అందునా మత ప్రాతిపదికన, పార్టీల ప్రాతిపదికన విమర్శలు చేసుకుంటున్నవారిని చూస్తే వారికంటే ఆ మృగాలే నయమేమో ఒక్కసారి రేప్ చేసి, చంపేస్తున్నారు - ఈ మూర్ఖులు బతికున్నవాళ్ళను రెచ్చగొట్టుకుంటూ, మరింత అశాంతికి కారణమవుతున్నారు. మృగాల కంటే ముందు మూర్ఖులను తరిమెయ్యాలి. ఈ మూర్ఖుల వాదనలతో మృగాలకు నమ్మకం కలుగుతోంది - మతం వల్లనో, పార్టీ వల్లనో మనం రక్షించబడతాం అని. అందుకే, మృగత్వాన్ని ప్రేరేపిస్తున్న ఈ మూర్ఖులను ముందుగా శిక్షించాలి.

Comments

Popular posts from this blog

... మూడో కూటమి

... కరోనా కంటే ఎక్కువగా భయపెడుతున్న అంశం?

... 2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు - జనసేన