... కాసింత గట్టిపడాల్సిందే
వంశీ కలుగోట్ల // ... కాసింత గట్టిపడాల్సిందే //
**********************************************
మహాసభ జరుగుతోందని తెలిసి, మావాడు వెళ్ళాడు
నాయకుడు ఆవేశంతో ఊగిపోతూ ప్రసంగిస్తున్నారు
నేను రెండువేలమందిని ఒక కర్రతో వెంటాడి తరిమాను అన్నాడు నాయకుడు, అభిమానులు వెర్రెత్తి కేరింతలు కొట్టారు
రాష్ట్ర విభజన జరిగినపుడు నేను పదకొండు రోజులు అన్నం మానేసాను అన్నాడు నాయకుడు, ఆడపడుచుల కన్నీటితో వరద వచ్చేలా ఉందని, సహాయక చర్యలు చేపట్టారు
అవసరమైతే రోడ్డుమీదకీడ్చి కొట్టగలను గుర్తుంచుకో అంటూ నాయకుడు హెచ్చరించాడు, కార్యకర్తలు ఆవేశంతో ఊగిపోయారు
...
...
...
అర్ధరాత్రి చాయ్ తాగుతున్న మావాడిని పలకరించి, 'ఈ టైం లో చాయ్ తాగుతున్నావు, ఏమైందిరా' అని అడిగా
'ఏం లేదురా, సినిమా బాలేదు. సినిమా దెబ్బకు బాగా తలనెప్పిగా ఉంది' అన్నాడు
అదేందిరా, నువ్వేళ్లింది మహాసభకు కదా అని అడిగాను
ఏ ఊకో మామా, వాళ్ళు మస్తు సెప్తారు వినేటోళ్ళకు దిమాక్ ఉండొద్దా! కావాలంటే నువ్వూ వెళ్ళి చూడు. సాంగ్స్ హీరోయిన్స్ లేకపోయినా హీరో ఆ ఆ అదే నాయకుడి మాటలు సినిమాలో డవిలాగుల లాగానే ఉన్నాయి అంటూ ఇంకో చాయ్ కి ఆర్డర్ ఇచ్చాడు.
బహుశా తలనెప్పి బాగా ఎక్కువగా ఉందనుకుంటా ... ఏమైనా మనది గట్టి కాయ అప్పా ఆ ఆ అదే తలకాయ, మనం ఇట్టాటివి ఎన్ని సూడలేదు సెప్పు? మనకేనాడైనా కాయనెప్పి ... ఓరి దొంగనాబట్టల్లారా బూతు కాదురా నేను అంటన్నది తలకాయనెప్పి రాలేదు అని. మావోడికి కాయ (మళ్ళీ తలకాయ అనే సదువుకోండి) కాసింత గట్టిపడాల్సిందే ...
Comments
Post a Comment