మనలో ఒకడు - 2: కృష్ణ హర్ష
'మనలో ఒకడు' లో రెండవ భాగంగా నేను చూసిన వారిలో కృష్ణ హర్ష గురించి వివరిస్తాను ...
కృష్ణ హర్ష
*********
కృష్ణ హర్ష గురించి వివరించే ముందు ఒక చిన్న మాట - నేను వ్యక్తిగత సంభాషణల్లో కానీ, రాసే వాటిలో కానీ తరచుగా బాధ్యతల గురించి ప్రస్తావిస్తుంటాను. మనం రాజ్యాంగపరమైన, సామాజికపరమైన బాధ్యతలు స్వీకరించి, ఆచరించినపుడే హక్కుల గురించి మాట్లాడాలి, పోరాడాలి అని. కొంతమందికి నచ్చకపోవచ్చు. కానీ బాధ్యతలు స్వీకరించటానికి ఇష్టపడని ప్రతి ఒక్కరు హక్కుల గురించి మాట్లాడేవారే. పైగా 'ఏం నేనొక్కడినీ చేస్తే సమాజం మారిపోతుందా? ఈ జనాలు మారరు, వీళ్ళింతే. ఎవరో రావాలి, పరిస్థితులను మార్చాలి' లాంటి పలాయనవాదపు వాదనలు సిద్ధంగా ఉంచుకుని ఉంటారు. అలాంటి వారికి ఒక చిన్న సమాధానం/ఉదాహరణ కృష్ణ హర్ష.
హర్ష ఇంకా విద్యార్ధి దశలోనే ఉన్నాడు. కానీ మరొకరికి చేయూతనందివ్వటానికి తన చదువు, పనులు అడ్డంకి కాలేదు. చాలా మందిమి రకరకాల కారణాలు చెబుతాం - వీలవలేదు, కుదరలేదు, నేనే ఇంకా జీవితంలో స్థిరపడలేదు, ఉద్యోగం లేదు, పిల్లల చదువు పూర్తవ్వలేదు, ఇల్లు కొనాలి ఇలా మనకు కారణాలకు కొదువలేదు. కానీ హర్షలాంటి వారు కారణాలు చెప్పరు, ఉన్నదాంతోనే ఎలా చెయ్యొచ్చో చూపిస్తారు. ఉన్నత పాఠశాల (హై స్కూల్) చదువు కొనసాగుతున్న సమయంలో మిత్రుడు ఆర్థిక ఇబ్బందుల వాళ్ళ చదువు మానేయ్యవలసి వచ్చింది. మామూలుగా మనమైతే 'పాపం' అనో 'వాడిని మిస్సవుతున్నామురా' అనో లేక ఒక నిట్టూర్పు విడిచో ఊరుకునేవాల్లమేమో. కానీ హర్ష, మరికొందరు మిత్రులు అలా ఊరికే ఉండలేదు. ఆ కొందరికి వారి తల్లిదండ్రులు ప్రతి నెల కనీసం వంద రూపాయలు లేక అంతకంటే ఎక్కువగా పాకెట్ మనీ రూపేణా ఇస్తారు. ఈ మిత్రులందరు కలిసారు - ఏ ఒక్కరో తమ డబ్బు అంతా ఇచ్చెయ్యటం కాకుండా ఒక్కొక్కరు తమ పాకెట్ మనీ లోంచి ఇరవై రూపాయలు పక్కకు తీసి ఒక పెద్ద మొత్తంగా చేసి మిత్రునికి సహాయం చేసారు, చదువు కొనసాగించేలా చేసారు. అక్కడితో ఆగిపోతే ఇక్కడిదాకా వచ్చేది కాదు.
మిత్రుడికి సహాయం చెయ్యగలిగారు సంతోషమే కానీ, అదే ఒక ఆలోచనకి దారి తీసింది. ఆ కొద్దిమందికి మరి కొద్దిమంది కలిసారు - వారిలో కొందరు గ్రామీణ ప్రాంతాలనుంచి వచ్చినవారు. అలాంటివారు వారి ప్రాంతాల్లో ఆర్థిక కారణాలతో చదువు ఆపేసిన విద్యార్థుల గురించి వివరాలు సేకరించసాగారు. అలా చదువు ఆపేసిన వారికి తమకు వీలైనంత ఆర్థిక సహాయం అందించి చదువు కొనసాగించేలా చేసారు. ఈ మిత్రులంతా కలిసి 'స్ట్రెంగ్త్' అనే ఒక బృందంగా తయారయ్యారు. ఈ బృందంలోని చాలామంది ఇంకా విద్యార్థి దశలోనే ఉన్నారు - హర్ష ఇప్పుడు ఇంజనీరింగ్ పూర్తి చేసి ఐ.ఐ.టి. లో చేరబోతున్నాడు. వీరంతా కలిసి చదువిస్తున్న ఒక అమ్మాయి ఇంటర్మీడియట్ పూర్తీ చేసి (BiPC) ఫార్మసీ చదువుతోంది, ఇంకో అబ్బాయి ఇప్పుడు ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం చదువుతున్నాడు, మరో ముగ్గురు హై స్కూల్ లో చదువుతున్నారు. ఇప్పటికి కూడా వీరు ఒక్కొక్కరు తమ పాకెట్ మనీ లో నెలకు ఇరవై రూపాయలు ఆదా చేస్తూ ఆ డబ్బును ఇలాంటి వారి చదువుకోసం ఉపయోగిస్తున్నారు.
హర్షతో నేను వీలైనప్పుడల్లా మాట్లాడుతుంటాను. వారి తరువాతి లక్ష్యం ప్రజలలో పరిశుభ్రత గురించి, పర్యావరణ సంబంధిత సమస్యలపై అవగాహన కల్పించటం; వాటి పరిష్కారానికి తమవంతు కృషి చెయ్యటం. వీరందరూ ఒక్కచోట చదవట్లేదు, తరచూ కలుసుకోవటానికి వీలుండదు, పోటీ చదువుల ప్రపంచంలో భాగంగా బతుకుతున్న వాళ్ళే వీళ్ళందరూ - అయినా కూడా సంకల్పం ఉంటే మంచి చెయ్యటానికి ఏదీ అడ్డురాదు అనటానికి హర్ష, అతని మిత్ర బృందం చక్కని ఉదాహరణ. ఆలోచనలు ఎంత గోప్పవైనా అయ్యుండొచ్చు, కానీ అణా పైసా అంత కూడా ఆచరణలో లేనప్పుడు అది వృధాయే. గొప్ప మాటలేమీ మాట్లాడకపోయినా చేతల్లో ఆ గొప్ప మనసును చూపిస్తున్న వీరికి కృతజ్ఞతాభివందనాలు. వారి మాటల్లోనే చెప్పాలంటే "నువ్వొక్కడివి కాదు నేనొక్కడిని కాదు మనందరం కలిస్తేనే బలం/దృడత్వం " (Strenght is not ME, Strength is not YOU, Strenght is WE. They have created a Facebook group named 'STRENGTH' as well, interested people can join their group and join with them.). వీరి స్ఫూర్తి మరింతమందిని సంఘటితంగా సమస్యల పరిష్కారం దిశగా ఆచరనాత్మకత వైపు కృషి చేసేలా ప్రేరేపించాలన్నదే ఈ ఆక్షరాల/వాక్యాల వెనుక ఉన్న తపన.
తరువాతి భాగంలో మరొక మిత్రుడి గురించి అదే 'మనలో ఒకడు'ని పరిచయం చేస్తాను

Comments
Post a Comment