ఏమవుతాది ?
వంశీ కలుగోట్ల // ఏమవుతాది ? // ***************************** సుబ్బిగాడు: ఒరేయ్ అప్పిగా, ఏందిరా అట్టా ఉన్నావు ఇయ్యాల? ఏమైనాదేటి? అప్పిగాడు: అది గాదురా సుబ్బిగా. మన గడ్డం సామిని సూసి శానా రోజులైపోనాది. ఈ కాల్ మనీ స్కాం ఏందో తెగ మాట్టాడేసుకుంటున్నారు గందా, మా సామి ఏమన్నా జనాల్లోకి వస్తాడేమో సూద్దామని ఎదురు సూత్తన్నానురా. సుబ్బిగాడు: ఒరే ... నువ్వు మీ సామి గురించి సెప్తే గుర్తొచ్చినాదిరా. మీ లెక్క అట్టా నిమ్మకుండ సల్లంగా ఎట్టా ఉండాలో నేర్సుకోవాలిరా. సన్యాసులైతే దాన్నేదో అంటారురా ఆ 'స్థితప్రజ్ఞత' అని మా నాయన సేప్పెవోడు సిన్నప్పుడు. ఏమైనా మీ సామి శానా గోప్పోడురా. అప్పిగాడు: అదేందిరా అట్టా అంటావు? సుబ్బిగాడు: అట్టా గాదురా ఫర్ ఎజ్జంపుల్ ఇప్పుడు ఆ అమరావతి కాడ భూముల ఇసయమే తీసుకో ఏం సేసినాడు. ఆడ జనాల కాడికి బోయినాడు ఆళ్ళ గోడు ఇని బాబు కాడికి బోయినాడు, బయటకొచ్చి 'బాబు మీద నమ్మకం ఉండాది, ఆయన అంతా మంచే సేత్తాడు' అనె. ఆ తరువాత ఆడ కొన్ని ఊర్ల పెజలు ఏడ్సినా కూడా పట్టించుకోకపాయే. ఆ తరువాత ఋషితేశ్వరి యవ్వారంలో అయితే నోరు కూడా మెదపకపాయే. మొన్నటికి మొన్న అదేందదీ ఆ...