ద్యావుడా ... ఇదేనా సహనం అంటే

వంశీ కలుగోట్ల // ద్యావుడా ... ఇదేనా సహనం అంటే? //
**********************************************************
     మనం మీడియాని ఎప్పుడూ తిడుతుంటాం - ఎందుకంటే వారు ఒక వర్గానికి మాత్రమే కొమ్ము కాస్తూ, రెండో వర్గానికి చెందిన విషయాలలో 'కోడి గుడ్డు మీద ఈకలు వెతికే' తరహాలో వ్యవహరిస్తుంటారు కాబట్టి. వారికి సహనం లేదు అంటుంటాంఎందుకంటే కాంగ్రెస్ లేదా యుపియే పదేళ్ళ కాలంలో సాధించలేనిది మోడీ పద్దెనిమిది నెలల కాలంలోనే సాధించలేదని విమర్శిస్తున్నారని. గత పాలనలో వారు వారు వేసిన ముళ్ళను, చెత్తను ఏరుకుంటూ వస్తున్నాడు. కొత్తగా ఏదైనా చేయాలంటే ముందు ఈ చెత్తను ఏరేయ్యాలి కదా అంటూ సహనంగా ఉండాలని మంచిని, నీతిని బోధిస్తాం. (ఆయనేం చేస్తున్నాడో అన్నది ఎవరికెరుక. భజనబృందం స్తోత్రపాఠాలలో మన గొంతుకలు వినబడే అవకాశం ఉందంటారా? అది పక్కన పెడదాం - ఇక్కడ విషయం అది కాదు కాబట్టి.) కానీ, అదే వేరే వాళ్ళ విషయంలో అయితే వారు ఇంకా కార్యాలయంలో అడుగు కూడా పెట్టకుండానే విమర్శలు మొదలెడతాం. తండ్రిని చూపి వీళ్ళను పని కూడా మొదలెట్టక ముందే విమర్శించడం ఎందుకూ అంటే వెంటనే వాళ్ళ సమర్థకుడివంటూ ఆ గాటన కట్టేస్తారు. ఆ తండ్రి పరమ అవినీతిపరుడు కాబట్టి వీళ్ళు కూడా అదే చేస్తారు అంటూ వాదన - ఎక్కువ అవకాశం దానికే ఉంది కాదనట్లేదు, కానీ ఖచ్చితంగా అదే జరుగుతుందని కూడా లేదు కదా. అలా అంటే లాలూ తండ్రి ఏమి చేసేవాడు? అంతెందుకు తండ్రులు చేసిందే తనయులు చేసి తీరతారు అంటే మనమందరమూ ఇలా సాఫ్ట్ వేర్ ఇంజనీర్స్ అయ్యేవారమా? మోడీ కూడా తన తండ్రి చేసిన పనులు అదే తీరున చేస్తూ పోయుంటే ఈనాడు అవతార పురుషుడిగా కీర్తించబడేవాడా? మళ్ళీ నేను మోడీని, మనల్ని వారితో పోల్చానంటూ అస్త్రాలు నా మీద ఎక్కు పెట్టకండి. ఉదాహరణకు అని చెప్పాను కదా. వస్తువు పరంగా పోలికే కాని వ్యక్తుల పరంగా కాదు, వారు చేసే పనుల పరంగా కాదు. 'నేను వారి సమర్థకుడిని కాదురా నాయనా బాబూ మీరూ మీడియా లానే విమర్శలు చేస్తూ మీ స్థాయిని దిగజార్చుకోవద్దండి అంటూ వేడుకుంటున్నాను అంటే వినే ఓపిక ఎక్కడిది' అంటారా? ద్యావుడా ... ఇదేనా సహనం అంటే?

Comments

Popular posts from this blog

... మూడో కూటమి

... కరోనా కంటే ఎక్కువగా భయపెడుతున్న అంశం?

... 2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు - జనసేన