ఏమవుతాది ?

వంశీ కలుగోట్ల // ఏమవుతాది ? //
*****************************
సుబ్బిగాడు: ఒరేయ్ అప్పిగా, ఏందిరా అట్టా ఉన్నావు ఇయ్యాల? ఏమైనాదేటి?
అప్పిగాడు: అది గాదురా సుబ్బిగా. మన గడ్డం సామిని సూసి శానా రోజులైపోనాది. ఈ కాల్ మనీ స్కాం ఏందో తెగ మాట్టాడేసుకుంటున్నారు గందా, మా సామి ఏమన్నా జనాల్లోకి వస్తాడేమో సూద్దామని ఎదురు సూత్తన్నానురా.
సుబ్బిగాడు: ఒరే ... నువ్వు మీ సామి గురించి సెప్తే గుర్తొచ్చినాదిరా. మీ లెక్క అట్టా నిమ్మకుండ సల్లంగా ఎట్టా ఉండాలో నేర్సుకోవాలిరా. సన్యాసులైతే దాన్నేదో అంటారురా ఆ 'స్థితప్రజ్ఞత' అని మా నాయన సేప్పెవోడు సిన్నప్పుడు. ఏమైనా మీ సామి శానా గోప్పోడురా.
అప్పిగాడు: అదేందిరా అట్టా అంటావు?
సుబ్బిగాడు: అట్టా గాదురా ఫర్ ఎజ్జంపుల్ ఇప్పుడు ఆ అమరావతి కాడ భూముల ఇసయమే తీసుకో ఏం సేసినాడు. ఆడ జనాల కాడికి బోయినాడు ఆళ్ళ గోడు ఇని బాబు కాడికి బోయినాడు, బయటకొచ్చి 'బాబు మీద నమ్మకం ఉండాది, ఆయన అంతా మంచే సేత్తాడు' అనె. ఆ తరువాత ఆడ కొన్ని ఊర్ల పెజలు ఏడ్సినా కూడా పట్టించుకోకపాయే. ఆ తరువాత ఋషితేశ్వరి యవ్వారంలో అయితే నోరు కూడా మెదపకపాయే. మొన్నటికి మొన్న అదేందదీ ఆ బాక్సైట్ తవ్వకాలు, గిరిజనుల బతుకుల మీద ఏమాయే? యధావిధిగా బాబుగారిని కలిసే, ఆయన మీద నమ్మకం ఉందని సెప్పె అంతే గదరా.
అప్పిగాడు: అదేందిరా మా బాసు మీద నీకు వెతిరేకత ఉన్నట్టుంది, అంతేలే నువ్వు ఆ జగన్ పార్టీ వోడివేమో లేకపోతే ఆ పార్టీకి ముసుగు ఫ్యాన్ వేమో.
సుబ్బిగాడు: అరేయ్ అప్పిగా నీతో ఒచ్చిన సమస్యే ఇదిరా. అయినా నచ్చనిది మాట్టాడే పెటివోడు పెతిపచ్చమే అంటే నన్ను ఆ కోటాలోకే ఎసేస్కో.
అప్పిగాడు: అది గాదురా సుబ్బిగా ... ఇప్పుడు సూడు ఈ కాల్ మనీ లో అంతా నష్టపోయింది సామాన్యులే అంట గదా. మా బాసు సామాన్యులకు ఏమి జరిగినా ఊరుకోడురోయ్.
సుబ్బిగాడు: ఏం జెస్తాడురా. నే సెప్పనా. పెజల్లోకి రావాలంటే మల్లా గెడ్డం బెంచుకోవాలే, టైం పడతాది అందునా షూటింగ్ గిట్లా మొదలైపాయే కాబట్టి పంచె కట్టుకుని బాబు గారి ఇంటికి ఎల్తారు. బయటకొచ్చి 'బాబు గారి మీద నమ్మకం ఉంది, బాబుగారు చెప్పారు ఈ స్కాంలో ఉన్నది ఎంత పెద్దవారైనా వదిలేది లేదు అట. అంతేకాదు బాబుగారు చెప్పారు ఈ స్కాం వైఎస్ హయాంలోనే జగన్ ద్వారా మొదలైంది అని, ఆ మూలాల విచారణకు ఒక కమిటీ వేస్తానని చెప్పారు కాబట్టి నేను నమ్మాను' అంటాడు అంతకు మించి ఇంకేమవుతాదిరా.
అప్పిగాడు: అరే మా బాసు అట్టా అంటాడో లేదో తెల్వదు కాని నువ్వు మాత్రం బోడిగుండుకి మొకాలుకి బలే లింక్ బెట్టినావు గదరా ...
సుబ్బిగాడు: నేను కాదురో మీ వొల్లే బెడుతన్నారు. కావాలంటే సూస్కో రేపు అసెంబ్లీ సమావేశాలల్ల ఈ కాల్ మనీ స్కాం గురించి ఎవడు పెస్నిన్చినా ఆడు వై.ఎస్.అర్.సి.పి వాడే సమాధానం జగన్ లచ్చ కోట్ల లెక్క యెందనే, అంతకు మించి వేరేగా జరిగినప్పటి కథ సూద్దాంలే.

Comments

Popular posts from this blog

... మూడో కూటమి

... కరోనా కంటే ఎక్కువగా భయపెడుతున్న అంశం?

... 2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు - జనసేన