... ఎవరిగోల వారిది
వంశీ కలుగోట్ల // ... ఎవరిగోల వారిది // ********************************* వ్యాపారం చేయాలనుకునేవారికి ఉచిత సలహా ఒకటి ఇస్తాను - ఇది ఖచ్చితంగా వర్కౌట్ అయ్యే అవిడియా, నాకు ఫీస్ ఏమీ వద్దు. మీరు తక్కువ ఖర్చుతో ఎక్కువ మరియు నిరంతర ఆదాయం పొందాలనుకుంటే - రెండు వ్యాపారాలు ఉన్నాయి. ఒకటి సారా వ్యాపారం. దీనికి మొదట్లో ఖర్చు కాస్త ఎక్కువే అవ్వొచ్చు. ఆ తరువాత మాత్రం అంతా ఆదాయమే. బాధతోనో. దిగులుతోనో, సంతోషంతోనో, కోపంతోనో, ఆవేదనతోనో, మనసు బాలేదనో, ఇంట్లో గొడవ పడ్డారనో ... ఇలా కారణమేదైతేనేం తాగడానికి. అంతేకాదండోయ్ మీరు గమనించారో లేదో - మనదేశంలో నేరాలు చేసినవారిలో దాదాపు 70% దాకా నేరస్థులు మద్యం మత్తులో ఉండగా నేరం చేశారు లేదా నేరం చేయటానికి మద్యంతాగి ఉంటారు. (70% అన్నది కాస్త అటూ ఇటూగా ఉండవచ్చు) ఈ విషయం తెలిసినప్పటికీ ప్రభుత్వాలు మద్యనిషేధం లేదా మద్యం అమ్మకాలపై నియంత్రణ వంటి చర్యలు చేపట్టే ఆలోచన మాత్రంచేయడం కష్టం ఎందుకంటే దానిద్వారా వచ్చే ఆదాయం ఒకానొక ప్రధాన ఆదాయవనరు కాబట్టి. ...