వంశీ కలుగోట్ల // ... చదువది ఎంత గల్గినను //

వంశీ కలుగోట్ల // ... చదువది ఎంత గల్గినను // 
***************************************
            నేను మా ఊరికి వెళ్ళినప్పుడంతా చాలామందిని కలిసి మాట్లాడుతుంటాను - పెద్దవారు, నా వయసువారు, విద్యార్థులు ఇలా వివిధ వర్గాలవారితో. ముఖ్యంగా నేను వీలు చేసికునైనా సరే పాఠశాల దగ్గరకు వెళ్ళి - ఉపాధ్యాయులు, విద్యార్థులతో కలవటానికి ప్రయత్నిస్తాను. ఇక చదువు పూర్తి చేసినవారు మరియు ఉద్యోగార్థులతో ఇంటి దగ్గరే కలుస్తుంటాను. విద్యార్థులు, నాకంటే చిన్నవారిలో ప్రత్యేకించి నేను గమనించిన అంశం ఒకటి ఉంది. చదువుకుంటున్నవారిలో ఒకరకమైన భయం ఉండటం గమనించాను - ఏమవుతుందో, ఏం చెయ్యాలి/చదవాలి?, ఎలాంటి ఉద్యోగమొస్తుందో, ఎలా బతుకుతామో... ఇలా ఎన్నోప్రశ్నలు, భయాలు. అదే సమయంలో అరకొర చదువులతో ఆపేసినవారు, చదవని వారిలో అలాంటి భయం లేకపోవడం గమనించాను. ఎక్కడికెళ్ళినా, ఎలాగైనా బతకగలమనే ధీమా వారిలో కనబడింది. ఇక్కడ కాకపొతే మరోచోట, ఈ పని కాకపొతే మరోటి చేసుకుని బతకగలమనే నమ్మకం; ఎన్ని కష్టాలు, నష్టాలు ఎదురైనా తిరిగి నిలబడగలమనే ధైర్యం అలాంటివారిలో (చాలామందిలో) గమనించాను. మన చదువులు ధైర్యాన్నిస్తున్నాయా లేక భయాన్నా? ఏమో, నా పరిశీలనలో ఇది నేను గమనించింది - మన విద్యావ్యవస్థకు సంబంధించి పరిశీలించాల్సిన, సమీక్షించాల్సిన అనేకానేక అంశాలలో ఇదీ ఒకటి అనిపించింది. 
            ఆంగ్ల మాధ్యమం, నూతన అంశాల చేర్పు వంటివాటితో పాటు విద్యార్థులలో నమ్మకం, ధైర్యం పెంచేవిధంగా విద్యావిధానాన్ని రూపొందించగలిగితే బావుంటుంది. వారానికి ఒకటి లేదా రెండు పీరియడ్స్ చదువుతో సంబంధం లేని కొన్ని జీవన విద్యలు నేర్పే విధంగా రూపొందించగలిగితే బావుంటుంది - ఉదాహరణకు అల్లికలు, టైలరింగ్ లాంటివి. ఆంగ్లమాధ్యమబోధన వంటివి మన అవకాశాలను ఖచ్చితంగా పెంపొందించగలిగేవే కావచ్చు; అదే సమయంలో ఇలాంటివి నేర్పగలిగితే ఉన్నత చదువులు చదవకపోయినా, చదివిన ఉన్నతచదువులకు ఉద్యోగాలు రాకపోయినా బతకగలమన్న ధీమాను వారికి ఇవ్వగలగాలి. 'చదువది ఎంత గల్గినను రసజ్ఞత ఇంచుక చాలకున్నను ...' అన్నట్టుగా ఎంతటి చదువు చదివినా, రేపేమవుతుందో అనే భయంతో బతుకీడ్చే వారిని లెక్కకు మిక్కిలిగా చూశాను. రేపటి తరం అలాంటి భయాన్ని మోయకూడదు అనే కోరికతో ఈ సూచన  చేస్తున్నాను. ఈ సూచన చేయడమే కాదు - ఇక మీదట నా పరిధిలో, పరిమితులలో ఈ విషయంగా ఏమి చేయగలనో పరిశీలించి, కనీసం మా గ్రామ పాఠశాల స్థాయిలో నా చేతనైనది నేను చెయ్యడం మొదలెడతాను. కలిసి రావాలనుకునేవారు, సూచనలు ఇవ్వగలవారికి స్వాగతం. ప్రభుత్వపరంగా కూడా ఈ దిశగా ఏవైనా కార్యక్రమాలు చేపట్టగలిగితే బావుంటుంది. 

Comments

  1. Wow thats incredible thought Bro
    Adding to this
    Every Saturday there is no class room education
    Should b categorised like
    1week Sat - Personality development
    We have been watching many rape victims so in Childhood we should provide value education towards well wehaved Indian citizen
    2week sat Holiday
    3week sat what u said right we can provide as u suggested some course which will make as self employee
    4th week sat
    Things happening around the world
    It may updates ..live stuff

    ReplyDelete
    Replies
    1. Thanks for reply with suggestions. I am working on draft with all such suggestions then I am planning to approach governments

      Delete

Post a Comment

Popular posts from this blog

... మూడో కూటమి

... కరోనా కంటే ఎక్కువగా భయపెడుతున్న అంశం?

... 2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు - జనసేన