... పవనన్నయ్యా, ఇవి విన్నావా?
వంశీ కలుగోట్ల // ... పవనన్నయ్యా, ఇవి విన్నావా? //
**************************************************
ఇదిగో పవనన్నయ్యా ఇవన్నీ విన్నావా
-> కిడ్నీ బాధితులకు (ఉద్దానం) నెలకుఅండ్ ఆర్ధిక సహాయం పదివేల రూపాయలకు పెంచారు
-> ఏజెన్సీ ప్రాంతాల్లో బాక్సయిట్ తవ్వకాలకు సంబంధించి గత ప్రభుత్వం ఇచ్చిన జీవోను ఉపసంహరించుకుంటున్నట్టు ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ గారు ప్రకటించారు. తమరికి గుర్తుందో లేదో, ఒకసారి తమరు వెళ్ళి ఆ ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజనులను కలిసి, సంఘీభావం తెలిపి మరీ వచ్చారు
-> అలాగే ఆ అగ్రి గోల్డ్ వ్యవహారానికి సంబంధించి త్వరితగతిన 1150 కోట్లు పరిహారం బాధితులకు అందేలా చర్యలు చేపడుతున్నారు
-> హోదా ఉద్యమకారులపై కేసులు ఎత్తివేయాల్సిందిగా కూడా ఆదేశించారు
... ఇవి కొన్నే సుమీ
ఇపుడు వీలయితే ప్రశంసించండి.
ఊరికే ప్రశ్నిస్తా, ప్రశ్నిస్తా అని మాత్రమే కాదు ప్రశంసించడం కూడా నేర్చుకుంటే బావుంటుంది ...
అయినా ఏదో వందరోజుల టైం ఇస్తా అన్నారు, దేనికో కనీసం తమరికైనా క్లారిటీ ఉందా? ఇపుడు ప్రజలు తమరికి అయిదేళ్ళ సమయం ఇచ్చారు. ఊరికే గుడ్డు మీద ఈకలు పీకటం, నాయుడు గారికి పక్కవాయిద్యంలా ఉండటం మానేసి కాస్త కష్టపడండి, జనాలతో మమేకం అవ్వండి.జనాల దగ్గరకి వెళ్ళినపుడు వాళ్ళు చెప్పినది వినాలి, వాళ్ళ బాధలను అర్థం చేసుకోవాలి, మనం ఊగిపోకూడదు. ఇపుడు జనాల్లోకి వెళ్ళి జగన్ ను విమర్శిస్తే జనాలు నోటితో నవ్వరు, ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. పాలనలో మంచి జరిగినపుడు ప్రశంసించు, చేదు జరిగినపుడు ప్రశ్నించు. వీలయితే జగన్ గారిని ఆ ఆ అదే ముఖ్యమంత్రిని కలవు, గతంలో కూడా సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళటానికి ముఖ్యమంత్రిని కలిసేవారు కదా. కాకపొతే, ఇపుడు ఎవరూ స్పెషల్ ఫ్లైట్స్ పంపరు అని మాత్రం గుర్తుంచుకోండి.
చివరగా మూడు ముక్కలు సిన్నన్నయ్యా - కష్టపడండి, ప్రశంసించండి, ప్రశ్నించండి
ఏంటి ఆ విధంగా ముందుకు పోదాం ఓకేనా ...
Agree with you. Still I feel Jagan is taking some hasty decisions. Why to demolish a structure in a hurry. Mark it as the last building which flouted norms prominently. Build something first. Then demolish.
ReplyDelete