వంశీ వ్యూ పాయింట్ - వెంకీమామ

వంశీ కలుగోట్ల // వంశీ వ్యూ పాయింట్ - వెంకీమామ // 
*********************************************
            మనలో చాలామందిమి వేదికనెక్కి మాట్లాడాలంటే చాలా భయపడతాం. క్రింద ఉండగా అనర్గళంగా గంటలకొద్దీ మాట్లాడేవాళ్ళం, వేదికనెక్కగానే నాలుకను ఎవరో లాగేసినట్టు మాటలు బయటకు రావు.నువ్వు స్టేజి మీద బాగా మాట్లాడతావు అనేవారితో నేను ఒకటే చెబుపుతుంటాను 'నీకు స్టేజి ఫియర్ అనేది లేకపోతే, నీముందు నేను సోదిలోకి కూడా రాను' అని. ఇపుడు పాటలు బాగా రాసేవారు, బాగాపాడలేకపోవచ్చు కదా అలాగన్నమాట. అలానే కథలు రాసేవారు (లేదా బాగా కథలు రాసేవారు), సరిగా తీయలేకపోవచ్చు. ఈ సోది అంతా ఎందుకంటే, 'వెంకీమామ' అనే సోది సినిమా గురించి చెప్పటానికి. ఈ సినిమా దర్శకుడు బాబీ అనే కథారచయిత కాబట్టి. నిజజీవిత మామా అల్లుళ్ళు వెంకటేష్ - నాగచైతన్య మామా అల్లుళ్ళుగా నటించిన చిత్రం కావడంతో సహజంగానే 'వెంకీమామ' చిత్రంపై కాస్త ఆసక్తి ఏర్పడింది. ఎఫ్2 వంటి హిట్ చిత్రం తరువాత వస్తున్న వెంకటేష్ సినిమా కావడం కూడా ప్లస్ పాయింట్. 
              ముందుగా కథ పరంగా చెప్పుకోవాలంటే జాతకాల సమస్యలతో ఇబ్బంది పడిన ఒక కుటుంబ కథ - అంతే. జాతకం ప్రకారమే జరిగిందని చెప్పటానికి నాగచైతన్య తల్లిదండ్రులను ఆక్సిడెంట్ లో చంపేసే మొదటి సీన్ తోనే సిని మా కథ మరియు తీత ఎంత 'పాతగా' ఉండబోతున్నాయో అర్థం కాకపొతే అది మన తప్పే తప్పించి దర్శకుడి తప్పు కాదు. ఏ దశలోనూ, ఏ సన్నివేశంలోనూ కొత్తదనం వాసన పొరపాటున కూడా రాకుండా దర్శకుడు మరియు కథకుడు జాగ్రత్తపడ్డారు. కథలో ఎక్కడా ఉత్సుకత కానీ, ఉత్కంఠత కానీ, తరువాతేమి జరుగుతుందన్న ఆసక్తి కానీ ఉండదు. జాతకాలు మాత్రమే అంటే మసాలా సరిపోదని - ఫ్లైట్స్ అవీ ఉండాలి కాబట్టి, వాటికోసం ఉండాలని ఒక విలన్ (రావు రమేష్) ఉంటాడు. మొదటి సన్నివేశం నుండి, చివరి సన్నివేశం వరకూ అత్యంత నిరాసక్తంగా ఉండే ఈ సినిమాను వెంకటేష్ తన భుజాలమీద మోయటానికి శతవిధాలా ప్రయత్నించాడు. వెంకటేష్ లాంటి సీనియర్ స్టార్, నటుడు లేకపోయుంటే చూడటం కష్టం. 
            నటీనటుల విషయానికి వస్తే ఆన్ స్క్రీన్ మామా అల్లుళ్ళుగా నటించిన వెంకటేష్ - నాగచైతన్య పర్వాలేదనిపించారు. వెంకటేష్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు, ఇటువంటి పాత్రలు పదుల సంఖ్యలో చేసి ఉంటాడు. వెంకటేష్ లాంటి నటుడు కూడా కొన్ని సన్నివేశాల్లో క్లూ లెస్ గా కనబడ్డాడంటే అది దర్శకుడి వైఫల్యమే. ఇక నాగ చైతన్య నిలబెట్టకపోయినా చెడగొట్టలేదు. చాలా సన్నివేశాల్లో వెంకటేష్ లాంటి నటుడి పక్కన ఫాఫమ్ తేలిపోయాడు. ఇక హీరోయిన్స్ గురించి ఎంత తక్కువగా చెప్పుకుంటే అంత మంచిది. వారికి తెలిసింది చేయలేక, వీళ్ళు అడిగింది చెయ్యడం రాక ఎంత యాతన అనుభవించారో ఫాఫమ్ అనిపిస్తుంది. కనీసం మేక్ అప్ విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకున్నట్టు లేరు - పాయల్ మేక్ అప్ ఎబ్బెట్టుగా కనబడుతుంటుంది. ఇక మిగతా ఎవరి గురించి కూడా పెద్దగా చెప్పుకోవడానికేమీ లేదు. 
            సాంకేతిక అంశాల విషయాలకు వస్తే - తమన్ పాటల విషయంలో చాలాసార్లు ఫెయిల్ అయ్యాడు కానీ నేపథ్య సంగీతం విషయంలో అతి తక్కవ సార్లు ఫెయిల్ అయ్యుంటాడు - అందులో వెంకీమామ మొదటి ప్లేస్ లో ఉంటుందేమో. నేపథ్య సంగీతమే అంత చెత్తగా ఇచ్చాక, పాటలకు మంచి సంగీతం ఇస్తే ఫీల్ అవుతారనుకున్నాడేమో. ఉన్న బలహీనమైన కథలో కూడా కాస్త బలమైన సన్నివేశాలు అనిపించేవాటిని నేపథ్యసంగీతం మరింత దిగజార్చింది. ఫోటోగ్రఫీ బాగుంది. సంభాషణలు ఎవరు రాశారో కానీ, సినిమాలో బాడ్ థింగ్స్ విషయంలో అది టాప్ లో ఉంటుంది. 70, 80 లలో వచ్చే నాసిరకం సినిమాల్లో ఉండేలా ఉన్నాయి సంభాషణలు. ఇక పాయల్ కు రాసిన తీరు అయితే మరీ వెటకారంగా, జుగుప్సగా ఉంది. 'ఎవరైనా పేరు పూచుతారు' అని పాయల్ అన్నపుడైతే థియేటర్ లోంచి లేచి వెళ్లిపోదామనిపించింది. కానీ, నాతోపాటు సినిమాకొచ్చినవాళ్ళు మరియు పెట్టిన ఖర్చు గుర్తొచ్చి - వెంకటేష్ కూడా ఉన్నాడన్న ధీమాతో కూచోగలిగాను. సురేష్ ప్రొడక్షన్స్ లాంటి సంస్థ ఇంతటి నాసిరకం కథ, తీత తో రావడం హాశ్చర్యపరచింది -  కథ, క్వాలిటీ విషయంలో సురేష్ బాబు గారి గురించి అందరూ గొప్పగా చెబుతుంటారు. సురేష్ బాబు కథను, తీసిన షాట్స్ అంత ఈజీగా ఓకె చెయ్యడని; క్వాలిటీ లేకపోతే మళ్ళీ మళ్ళీ తియ్యాల్సిందేనని - కానీ ఈ సినిమా చూస్తే అవన్నీ అబద్ధాలనిపిస్తుంది. 
            బాబీ గారు కథలు రాసుకోవడం మీద మాత్రమే దృష్టి పెడితే బావుంటుందేమో. పవన్, సర్దార్ గబ్బర్ సింగ్, జై లవకుశ - ఏ చిత్రమూ దర్శకత్వ విభాగం మీద అతడికి పట్టున్నట్టు కనబడేలా ఉండదు. కమర్షియల్ గా ఒక రేంజ్ కు తీసుకెళ్ళగల ఎలెమెంట్స్ ఉన్న జై లవకుశ లాంటి సినిమాను కూడా తన దర్శకత్వ ప్రతిభతో యావరేజ్ సినిమాగా నిలబెట్టాడు, జూనియర్ ఎన్టీఆర్ మోయకపోయినట్టైతే ప్లాప్ అయ్యుండేది. సినిమా బాలేదబ్బా అంటే సినిమాలో ఏవీ బాలేవబ్బా. 'అమ్మరాజ్యంలో కడప బిడ్డలు' సినిమా వల్ల 'వెంకీమామ' సినిమాకు అడ్వాంటేజ్ ఉండొచ్చు. అది బాలేదని కొందరు, అది చూసిన తలనొప్పి తగ్గటానికి కొందరు, దానికి భయపడి కొందరు, వెంకటేష్ కోసం మరికొందరు ఇలా ఈ సినిమాను చూస్తారేమో. మొత్తానికి వెంకీమామ - అయ్యోరామా. 

Comments

  1. Kadapa kids in mummy's kingdom - horrible

    Venky uncle - passable.

    I like Venkatesh acting in manappuram gold ads.

    ReplyDelete
  2. Thanks for an honest review. We will wait for it to arrive on Amazon - just to watch if we don't have any interesting things to do.

    ReplyDelete


  3. సంభాషణలు ఎవరు రాశారో కానీ, సినిమాలో బాడ్ థింగ్స్ విషయంలో అది టాప్ లో ఉంటుంది.

    జనార్ధన మహర్షి కాదూ ? :)

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

... మూడో కూటమి

... కరోనా కంటే ఎక్కువగా భయపెడుతున్న అంశం?

... 2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు - జనసేన