... బురదోపాఖ్యానం

వంశీ కలుగోట్ల // ... బురదోపాఖ్యానం // 
************************************
మనం బురదలో రాయి వేయాలి అన్నపుడు కొన్నిటికి సిద్ధంగా ఉండాలి అలానే కొన్ని విషయాలు తెలుసుకోవాలి 

- బురద మన మీద పడగలదు అని అర్థం చేసుకోవాలి
- ఎంత దూరంగా ఉండి రాయి వేస్తే బురద చిట్లి మనమీద పడదో అంచనా వేసుకోవాలి
- ఎటువంటి రాయి వేస్తే ఎంతదూరం చిట్లుతుంది అన్నది అంచనా వేసుకోవాలి
- బురద ఎటువంటిది - అంటే అది సహజంగా ఏర్పడినదా లేక ఎవరైనా బురదగుంటను కావాలనే ఏర్పరచారా అన్నది తెలుసుకోవాలి 

- నిజంగానే బురద ఉందా, లేక ఉన్నట్టుగా కనబడుతోందా అని నిర్ధారించుకోవాలి 
- ఆ బురద వర్షపు నీటివల్ల ఏర్పడినదా లేక మురుగునీటితో ఏర్పడినదా అన్నది తెలుసుకోవాలి 
- చివరగా, అసలు బురదలో రాయి వెయ్యాలా వద్దా అని మరోసారి సమీక్షించుకోవాలి

ఇవేవీ చెయ్యకుండా - బురదలో రాయి వేసి బురద చిట్లింది అంటూ విచారించి లాభం లేదని బురదలో రాళ్ళేసే ఎదవలందరికి చెప్పమని మా శకుంతలాకియా సందేశం పంపింది. 

Comments

Popular posts from this blog

... మూడో కూటమి

... కరోనా కంటే ఎక్కువగా భయపెడుతున్న అంశం?

... 2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు - జనసేన