... తిరుమల టికెట్స్ వ్యవహారం
వంశీ వ్యూ పాయింట్ // ... తిరుమల టికెట్స్ వ్యవహారం //
*****************************************************
తిరుమల వెళ్ళే బస్సులో టిక్కెట్ల వెనుక జెరూసలెం యాత్ర గురించిన ప్రకటన ముద్రించడం అన్నది ఖచ్చితంగా సున్నితమైన భావాలను రెచ్చగొట్టగల అంశం, తప్పు. అయితే, దీన్ని వెంటనే జగన్ కు ఆపాదించి, క్రైస్తవ మత ప్రచారం మొదలు పెట్టాడు అంటూ మతాల మధ్య చిచ్చు పెట్టాలని చూడటం అంతకంటే బాధ్యతారాహిత్యం.
నాకు అర్థం కానీ విషయాలు ఏంటంటే
-> ఈ టిక్కెట్ల వెనుక ప్రభుత్వ పథకాల ప్రచారం అన్నది చంద్రబాబు ప్రభుత్వం చేసినది. ఆ ప్రకటనలలో ఏమున్నదో ఒకసారి చూడండి - 'గత నాలుగున్నరేళ్ళలో' అని సుస్పష్టంగా ఉన్నది. అంటే, దిగిపోకముందే చంద్రబాబు ప్రభుత్వం ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని చేసిన పని అది అన్నది స్పష్టం. అపుడు ఎవరూ ప్రశ్నించలేదు. అసలు అవి కనీసం ప్రింట్ అయ్యాయో లేదో కూడా ఎవడికి తెలియదు. కానీ, ఇపుడు దానిని జగన్ కు ఆపాదించి గొడవ చేస్తున్నారు.
-> శ్రీశైలం ఈవో విషయంలోనూ ఇలానే జరిగింది. కానీ, అతడు జగన్ వచ్చాక నియమించబడ్డ వ్యక్తి కాదు. కానీ, గొడవ మాత్రం జగన్ సీఎం అయ్యాక జరిగింది.
అంటే ఇక్కడ, ఏదో ఒక విధంగా గొడవలు చెయ్యాలని ఎవరో ప్రయత్నిస్తున్నారన్నది స్పష్టంగా కనబడుతున్నది. అయినా, ఇపుడు వీరికి కావలసింది హిందూ మతాన్ని ఉద్ధరించటం కాదు. జగన్ అనే ఒక వ్యక్తి అధికారంలో ఉండకూడదు. జగన్ సీఎం కాకుండా ఉంటే - తిరుమలలో నగలు పోయినా, బూట్లతో పూజలు చేసినా, పుష్కరాల్లో జనాలు చనిపోయేలా నిర్లక్ష్యధోరణితో వ్యవహరించినా, అనేక దేవాలయాలను రోడ్ల పేరుతో కూల్చినా - ఇంకా చాలా చాలా చేసినా చీమ కుట్టినట్టు కూడా అనిపించదు. కానీ, గత ప్రభుత్వపు చర్యను కూడా ఈ ప్రభుత్వం మీద రుద్ది, లేనిపోని భయాలను రేకెత్తించటం మాత్రం కుదురుతుంది. అసలు ఆ టికెట్ మీద ముద్రించింది గత నాలుగున్నరేళ్ళలో ఇంతమందిని తీసుకెళ్ళాం, అంత చేశాం అని కదా - అంటే అది ఎవరు చేసినట్టు? ఇపుడు ఒకవేళ జగన్ కనుక నిజంగా క్రైస్తవ ప్రచారం చేయాలనుకుని ఉంటే, అది చంద్రబాబుకు లాభదాయకంగా ఉండేలా ఎందుకు చేస్తాడు? ఇంతా చేసి, ఇంత చిన్న లాజిక్ ఎందుకు ఎలా మిస్ అయ్యారబ్బా? చివరగా ఒక్క ప్రశ్న - గతంలో జగన్ పై హత్యాయత్నం జరిగినపుడు మరియ్ జగన్ చిన్నాన్న వివేకా హత్యకు గురైనపుడు - 'ఏమో, సానుభూతి కోసం జగన్ చేయించుకుని ఉండవచ్చు' అని పలికిన నోళ్ళు - ఇపుడు జగన్ పై వ్యతిరేకత రావాలని, తనపట్ల సానుభూతి రావాలని ఇవన్నీ చంద్రబాబు చేయిస్తున్నారు అనే రీతిన మాత్రం మాట్లాడట్లేదు. ఆహా మేధావిత్వమా వర్ధిల్లు, జనాలను నాశనం చేసేవరకూ నువ్వు వర్ధిల్లు.
ముద్రలేసే బ్యాచ్ కోసం ఈ లైన్స్
... ఆ ఆ మీ గురించే ఎదురు చూస్తున్నా, రండి. ఇంకా అనలేదేంటి? ముసుగు తొలగింది, జగన్ మద్దతుదారు, ఇంకా ఏవేవో అంటారు కదా. మీరు అలా అంటూనే ఉండాలి మరి. లేకపోతే కిక్కు ఏముంటాది నా డాష్.
The shameless yellow K media relentlessly tries to needle Jagan. They have decades of expertise in character assassination, Goebbels propaganda and spread of fallacies. The yellow casteist gang are genetically flawed like the Isis terrorists.
ReplyDeleteAgree with your post
ఆహా మేధావిత్వమా వర్ధిల్లు -
ReplyDeleteకులగజ్జితో గోక్కునే వాళ్ళు కొందరైతే, మతగజ్జితో గోక్కునే వాళ్ళు ఇంకొందరు. అలాంటి వాళ్ళు కొందరు ఇక్కడ మేధావుల ముసుగులోనే సంచరిస్తుంటారు పారాహుషార్. వాళ్లకు లాజిక్లతో సంబంధం ఉండదు. ఏకసూత్ర పధకం - బాబు గారు లేకుంటే దేశం, రాష్ట్రం మటాష్. అదొక్కటే ప్రచారం. నది మధ్యలో ఒక చిన్న పడవను పెట్టి వరద నీటిని వెనక్కి మళ్లించవచ్చనే మేధావులకు భజనలు చేస్తూ అదెలా అనే వాళ్ళను వెధవలు క్రింద చూస్తుంటారు.
సదరు టికెట్ల వెనుక జెరూసలేము మాత్రమే కాదు హజ్ యాత్ర & దుల్హన్ (తెలంగాణ షాదీ ముబారక్ నఖలు) పథకం తాలూకా ప్రకటనలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం గొడవ చేస్తున్నది బీజేపీ ఐతే వీటిని
ReplyDeleteకూడా వదిలేదు కాదు. కేవలం "పెట్రేగి పోతున్న కిరస్తానం" పాట పాడుతున్నారంటే ఇది ఎల్లో పైడ్ ఆర్టిస్ట్ గాంగ్ నిర్వాకం అనుకోకతప్పదు.
ఆహాఁ!తమరికి ఇక్కడ కూడా తెదెపా,బాబు కనిపించే స్థాయిలో పచ్చ కామెర్ల రోగం ముదిరినట్టుందే!
Delete@author
Deleteఇపుడు ఒకవేళ జగన్ కనుక నిజంగా క్రైస్తవ ప్రచారం చేయాలనుకుని ఉంటే, అది చంద్రబాబుకు లాభదాయకంగా ఉండేలా ఎందుకు చేస్తాడు? ఇంతా చేసి, ఇంత చిన్న లాజిక్ ఎందుకు ఎలా మిస్ అయ్యారబ్బా?
hari.S.babu
అయ్యో పాపం!పోలీసుల్ని చర్చిల దగ్గిర హాజరు వేయించుకోమని చెప్పడం కూడా ఇతర్లకి తన జుట్టు ఇవ్వడం కోసం కాదా అండీ!ఇప్పుడు అధికారంలో లేని తెదెపా వాళ్ళు ఆ టిక్కెట్లని కండక్టర్లకి ఎలా ఇవ్వగలరండీ - ఈ చిన్న లాజిక్ మీరు ఎలా మిస్సయ్యారబ్బా!
This comment has been removed by the author.
Deleteఓహో మీకలా అర్థమైందా? అయినా మీరు సరిగా చదివినట్టు లేరు, నేను అన్నది అప్పట్లో అలా వాదించిన వారు - ఇపుడు అలా ఎందుకు ఆలోచించట్లేదు అని. పచ్చకామెర్లు ఉన్నపుడు, ఇలాంటివి అర్థం కాకపోవటంతో తప్పేమీ లేదులెండి. ఇక తెదేపా వారు వచ్చి టికెట్ రోల్స్ ఇచ్చారని నేనలేదు. అప్పట్లో హత్యాయత్నం జగనే చేయించుకున్నాడు, బాబాయిని జగనే హత్య చేయించాడు అన్న వారికి - ఇపుడు అలాంటి అవకాశాలు ఎందుకు చర్చించటం లేదు అని ప్రశ్నించాను. ఇక పోలీసులను చర్చి దగ్గర హాజరు వేయించుకోవడం అన్నది, వివరాలు మీరు చెపితే తెలుసుకోవాలని ఉంది. ధన్యవాదాలు
Deleteశ్రీశైలం వివాదాన్ని జగన్ పరిష్కరించడం కట్టర్ హిందువుగా పేరు పొందిన గోషామహల్ శాసనసభ్యుడు రాజా సింగ్ సైతం మెచ్చుకున్నాడు. తిరుమలలో అన్యమతస్థులకు ఉద్యోగాలు ఇవ్వరాదన్న వైకాపా ప్రభుత్వ నిర్ణయాన్ని కూడా ఆయన కొనియాడారు.
Deleteదొంగచాటున కాషాయ దళంలో పాగా వేసేందుకు వెంకయ్య నాయుడి కొంగు పట్టుకొని కమలం పార్టీలో చేరిన సుజనా చౌదరి & కో. లకు ఈ విషయాలు పట్టవు. వీళ్లకు ఎంతసేపు ఐదేళ్లు భ్రమరావతి గ్రాఫిక్కుల ముసుగులో చేసిన భూదందాలు బయట పడతాయన్న భయం తప్ప వేరే ఆలోచన లేదు.
@author
Deleteబాబాయిని జగనే హత్య చేయించాడు అన్న వారికి - ఇపుడు అలాంటి అవకాశాలు ఎందుకు చర్చించటం లేదు అని ప్రశ్నించాను.
hari.S.babu
అంటే, తెదెపా వాళ్ళు గానీ లేక వేరేవాళ్ళు గానీ జగన్ వాళ్ళ ఇళ్ళల్లో బాత్ రూముల లోకి కూడా వెళ్ళీ జగన్ బాబాయిని హత్య చెయ్యగలరని నమ్ముతున్నట్టు కనిపిస్తున్న మీకు నీలి కామెర్ల వ్యాధి లేదని ఎట్లా నమ్మాలి?
@author
ఇక పోలీసులను చర్చి దగ్గర హాజరు వేయించుకోవడం అన్నది, వివరాలు మీరు చెపితే తెలుసుకోవాలని ఉంది.
hari.S.babu
మీరు సాక్షి తప్ప ఇంకో పేపరే చదవనట్టు అర్ధం అవుతున్నది నాకు - మీరు వూర బ్లూ, కదూ!అధికారంలోకి వచ్చీ రాగానే పాస్టర్లకి జీతాలో పించన్లో ఇవ్వదమూ చర్చిల దగ్గిర ఏమి హోరాలు జార్గబోతున్నాయని అనిపించిందో అప్పుడప్పుడూనో రెగ్యులరుగానో పోలీసులే చర్చిలకి వెళ్ళి భద్రత గురించి వాజ్బు చెయ్యాలని చెప్పదమూ మీకేమీ తెలియనే తెలియదన్న మాట - హయ్యో రామా!ఇంకా మీకు చెప్పటానికి ఏముంది లెండి?
@hari.S.babu మీరు సరిగా చదివినట్టు లేరు. నేను అలా అన్నవారిని, ఇపుడు ఇలా ఎందుకు ఆలోచించటం లేదు అని ప్రశ్నించాను. ఇక చర్చి దగ్గరకు పోలీసులు వెళ్లి పరిశీలించటానికి, వెళ్ళి హాజరు వేయించుకోమని చెప్పారు అనటానికి ఉన్న తేడా మీకు తెలీదేమో. భద్రత గురించి వాకబు చెయ్యమని చెప్పడం ఒక్క చర్చిల దగ్గరే కాదన్న సంగతి బహుశా మాకు కనబడకపోయి ఉండవచ్చు. మీకు చెప్పటానికి ఏమైనా ఉన్నా, లేకున్నా - నేను పెట్టె పోస్ట్స్ పట్ల పూర్తి స్పష్టతతో పెడతాను. ఇంతకుముందు పచ్చరంగు అన్నారు, ఇపుడు నీలి రంగు అంటున్నారు - బహుశా మీకు రంగుల పట్ల స్పష్టత ఉన్నట్టు లేదు ముందుగా రంగులపట్ల స్పష్టత తెచ్చుకోండి, తరువాత మాట్లాడుకుందాం. ఇక నేను రోజూ చదివేటన్ని పేపర్స్ మీరు చదవారేమో లెండి, నేనేం చదువుతానో అనేముందు మీరేం చదువుతారో క్లారిటీగా ఉండండి. ఇక స్వస్తి, సభకు నమస్కారం.
Delete"పచ్చకామెర్లు ఉన్నపుడు, ఇలాంటివి అర్థం కాకపోవటంతో తప్పేమీ లేదులెండి." - this is your rhetorical label first given in your comment to me!
Delete@jai
Deleteవీళ్లకు ఎంతసేపు ఐదేళ్లు భ్రమరావతి గ్రాఫిక్కుల ముసుగులో చేసిన భూదందాలు బయట పడతాయన్న భయం తప్ప వేరే ఆలోచన లేదు.
hari.S.babu
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి కూడా కనిపించని లొసుగులు నీకెలా కనిపించాయి బాసూ!
కప్పెక్కి కూస్తున్నాడే గానీ అధికారంలోకి వచ్చి 100 రోజులు దాటినా ఒక్క తప్పు దొరక్క ఇబ్బంది పడుతున్నాడు,అక్కడికీ అధికార్లని బాబు పనుల్లో బొక్కలు వెతికితే ప్రైజులు ఇస్తానని వూరించాడు కూడాను, పాపం!
జర్రంత నువ్వు పోయి నీకు తెల్సింది చెప్పి బాబుని బొక్కలో వెయ్యించరాదె?
అక్కడా ఇక్కడా ఎన్నాళ్ళని బొరోమని యాడస్తావు, పాపం!ఒక్క దెబ్బతో పనైపోద్ది, సుకంగుండొచ్చు.
💄👗👠
పచ్చబాబును ఎవడైనా అన్నాడా లేదా అన్నదే ముఖ్యం. ఏమన్నాడో ఎందుకన్నాడో ఈ పిచ్చబాబుకు అవసరంలేదు. మొరుగుడే మొరుగుడు. ఆ కుక్కని పట్టిచ్చుకోవాల్సిన అవసరం మేకెవ్వరికీలేదు. దాన్ని అట్టా రోడ్డున వొదిలేసెయ్యండీ.
Delete