వంశీ కలుగోట్ల // ... తడిసిపోతారు //
వంశీ కలుగోట్ల // ... తడిసిపోతారు //
********************************
వాడు: అది పరిష్కారం కాదు
వీడు: మరి ఏది పరిష్కారం
వాడు: పరిష్కారం చెప్పడం అంత సులువు కాదు
వీడు: మరలాంటప్పుడు ఏం చెయ్యాలి
వాడు: ఏమో నేనెలా చెప్పగలను? అయినా నేను చెపితే వింటారా?
వీడు: మరి వాళ్ళకు చెప్పటానికి ట్రై చెయ్యాల్సి ఉండేది, వినేవారేమో
వాడు: వాళ్ళు వీళ్ళకంటే ఘోరం, ఆ టైంలో చెప్తే వింటారా - నన్ను కూడా అదే చేసేవారేమో
వీడు: మరి అలాంటి వాళ్ళను ఇలా చేస్తే తప్పేముంది?
వాడు: నువ్వెన్నైనా చెప్పురా కానీ వాళ్ళది, వీళ్ళదీ ఇద్దరిదీ తప్పేరా
వీడు: నువ్వొకటి గుర్తించటం లేదురా - వాళ్ళది చర్య, వీళ్ళది ప్రతిచర్య. మొదట వాళ్ళు తప్పు చేసుండకపోతే, వీళ్ళు తప్పు చేయాల్సిన అవసరమే ఉండేది కాదు. వాళ్ళు ఘోరమైన తప్పు చేసి, వీళ్ళను తప్పు చేయకతప్పని పరిస్థితుల్లోకి నెట్టారు.
వాడు: నువ్వు భావోద్వేగపరిస్థితిలోనుండి బయటకు రాకుండా, ఆలోచిస్తున్నావు
వీడు: కరెక్టేరా, కొన్నిసార్లు మిగతా అన్నిటికంటే భావోద్వేగాలే మేలనిపిస్తాయి
వాడు: ఇలా మాట్లాడితే ఏం చెప్తాం
వీడు: చెప్పమని ఎవడడిగాడు? అయినా నీకు ఎపుడో చెప్పాను కదా, కొన్నిసార్లు మేధావుల మౌనం కూడా మంచిదే అని. మీరంతా ఇపుడు కాస్త మౌనంగా ఉండండి లేదంటే తడిసిపోతారు జనాల ఉమ్మిలో
వాడు: 🙄😷
Let the inhuman rights activists provide homestay for the rapists and murderers. Only till their trial is completed.
ReplyDelete