'మార్పు'కు బాధ్యత ఎవరిది?
వంశీ కలుగోట్ల // 'మార్పు'కు బాధ్యత ఎవరిది? // ****************************************** "ఆలోచన" మతం లాంటిది. నువ్వు దాన్ని ఎంత బలంగా నమ్ముతావో అంత బలంగా ఆచరిస్తావు ... ప్రపంచంలో ప్రతి మతం, సిద్ధాంతం, విప్లవం, మార్పు పేరేదైనా కానివ్వండి అది ఒక ఆలోచనలోంచే ఉద్భవించింది ... అందుకే స్వామి వివేకానంద చెప్పినట్లు "ఒక మహోన్నతమైన ఆదర్శాన్ని నీ జీవిత ధ్యేయంగా చేసుకో. దాన్ని గురించే ఆలోచించు. దానికి అనుగుణంగా జీవించు. నీ మెదడు, నరాలు, కండరాలు, నీ శరీరమంతా నీ ఆదర్శంతో/ఆలోచనతో నిండాలి." దేవుడు అంటే ఒక రూపం కాదు. దేవుడు అంటే మంచి. మంచి చేసే ప్రతి ఒక్కరూ దేవుడి ప్రతి రూపాలే. అందుకే మంచి చేసిన ప్రతి ఒక్కరిని దేవుళ్ళను చేశాం, కానీ వారు చేసిన మంచిని మాత్రం ఆచరించటం లేదు. ఇలాగే మంచి చేసే వాళ్ళందరినీ దేవుళ్ళుగా చేస్తూ మనం మాత్రం దానవులుగా మిగిలిపోతున్నాం. మనం వ్యవస్థలో మార్పు రావాలి రావాలి అంటూ ఉంటాం కాని ఆ వ్యవస్థలో మనమూ భాగమనే విషయం మర్చిపోయి ఎవరో మార్పు తీసుకుని రావాలి అంటూ ఉంటాం. ఈ వాక్యాలు ఎవరో ఒకరిని ఉద్దేశించ...