... ఇవాళ్టి రాజకీయాల్లో నేరారోపణలు

వంశీ వ్యూ పాయింట్ // ... ఇవాళ్టి రాజకీయాల్లో నేరారోపణలు // 
***************************************************************
            రాజకీయాల్లో నేరారోపణలు అన్నది ఒక రకంగా క్లిష్టమైన అంశం - ఎందుకంటే ఇవాళ రాజకీయాలు పూర్తిగా భ్రష్టు పట్టిపోయాయి. కేవలం అవినీతి అన్నది ఒక్కటే అంశం కాదు ఇపుడు. కేసుల విషయం అంటే - అవతలి వ్యక్తిని దెబ్బ తీయటానికి, ఇవతలి పక్షం వారు లేదా అధికారంలో ఉన్నవారు ఏదో ఒక కేసు పెట్టి, అధికార వ్యవస్థలను మేనేజ్ జైలు లో ఉంచవచ్చు. అతగాడి మీద నిజంగానే అబద్ధపు ఆరోపణలు చేయబడి ఉండవచ్చు, కొన్నాళ్ళ తరువాత అవి నిక్కంగా అబద్ధం అని తేలితే? మనం నమ్మే పరిస్థితుల్లో లేము ఎందుకంటే, ఇపుడు మనమెవరమూ నిజాయితీగా లేము, పార్టీలను/వ్యక్తులను అభిమానించే వారిగా విడిపోయాము. నిందారోపణలు నిరూపించబడి, శిక్షను అనుభవించిన (శిక్షకు, నిర్బంధానికి తేడా తెలుసుకోవాలి) వారిని కూడా అభిమానిస్తున్న రోజులివి. రేప్పొద్దున ఇవాళ సచ్చిలుడుగా పేరొందిన వారు ఎవరైనా, నిందలు నిరూపింపబడి జైలుకెళ్ళినా అది మనం రాజకీయ కక్ష సాధింపుగానే చూస్తాం. ఎందుకంటే సాధారణంగా ప్రతిపక్షంలో ఉన్నవారు లేదా అధికార పార్టీకి ఎదురు తిరిగినవారు మాత్రమే ఆరోపణలు కారణంగా జైలుకెళతారు. అధికారంలో ఉన్నవారైతే ఎన్ని కేసులున్నా స్టేలు తెచ్చుకోవడం లేదా వ్యవస్థల్ని మేనేజ్ చేయడం చేస్తూ గడిపేస్తారు. అందుకే, కొందరు ఉన్నత స్థాయిలో ఎవరు అధికారంలో ఉంటే వారితో లోపాయికారి ఒప్పందాలతో నిప్పులాగా కాలం గడిపేస్తారు. ప్రతిపక్షంలో ఉన్నవారు అధికారపక్షంపై ఆరోపణలు చేయడం అత్యంత సహజం - అవినీతి జరిగిందని విపరీతంగా ప్రచారం చేస్తారు. 
            నిజం చెప్పాలంటే ఏ పార్టీ అధికారంలో ఉన్నా అవినీతి అన్నది ఖచ్చితంగా జరగాల్సిన స్థితిలో ప్రస్తుత రాజకీయాలు మనుగడ సాగిస్తున్నాయి. కానీ, ఇపుడు ప్రతిపక్షంలో ఉన్న పార్టీ రేప్పొద్దున అధికారంలోకి రాగానే, మొదట విచారణ అదీ ఇదీ అంటూ హడావుడి చేసనప్పటికీ ఆ తరువాత మళ్ళీ ప్రెస్ మీట్స్ లో లేదా అసెంబ్లీలో ప్రత్యారోపణలు చేసుకోవటానికి తప్పించి మరెందుకూ పనికిరావవి. ఇందుకు ఉదాహరణగా వైఎస్సార్సీపీ అధినేత జగన్ గారిపై లక్ష కోట్ల అవినీతి ఆరోపణలు అని చెప్పవచ్చు. 2011 నుండి ఆ ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. అవి విచారణలో ఉన్న దశలో సాక్షులను ప్రభావితం చేయగలరనే నెపం మీద దాదాపు 18 నెలలు జైలులో నిర్బంధించారు కూడా. అయినా ఇంతవరకూ ఏవీ నిరూపించకలేకపోగా, ముందుగా పేర్కొన్నట్టు అవి లక్ష కోట్లు కాదు కదా, అందులో పావు వంతు కూడా కాదు - చివరకు 1200 కోట్లకు చార్జిషీట్లు చేసినట్టున్నారు. ఇదే అంశంపై జగన్ గారు గతంలో అసెంబ్లీలో ఛాలెంజ్ చేశారు కూడా. ఇక్కడ జగన్ అవినీతి చేశాడా లేదా అన్నదానిమీద నేను వ్యాఖ్యానించను, ఎందుకంటే అది ప్రస్తుతం న్యాయస్థానాల్లో విచారణ దశలో ఉంది - పలుమార్లు విచారణ త్వరిత గతిన పూర్తి చేయమని స్వయంగా ఆయనే పిటేషన్ వేశారు కూడా. కానీ, ఇపుడు అధికారంలో ఉన్నవారుగాత అయిదు సంవత్సరాలుగా అదే మాటలు మాట్లాడటమే తప్పించి, ఏమైనా నిరూపించగలిగారా? అదే సమయంలో గతంలో అధికారంలో ఉండిన కాంగ్రెస్, చంద్రబాబు గారి మీద చేసిన ఆరోపణలూ అంతే. దశాబ్దకాలం పాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్, ఏనాడూ చంద్రబాబును ఇబ్బంది పెట్టలేకపోయింది అవినీతి ఆరోపణల విషయంగా. 
            అందుకే ఇవాళ్టి రాజకీయాల్లో నేరారోపణలు అన్నది ఒక క్లిష్టమైన అంశమే కాక కాస్త సున్నితమైన అంశం కూడానూ. తమకు అడ్డు రానంతవరకూ సహిస్తారు ఎప్పుడైతే తమకు అడ్డొస్తారో లేదా తమను మించి పోతారనిపిస్తుందో అపుడు ఉపయోగించే అనేకానేక మార్గాలలో కేసులు అన్నవి ఒకటి. అందులో నిజం ఉండినా కూడా, తమకు అడ్డు రానంతవరకూ, తమ పక్షంలో ఉన్నంతవరకూ పట్టించుకోరు. మీడియా ఛానెల్స్ లో కూచునే వ్యాఖ్యాతలు తమకుతామే తీర్పులిచ్చేస్తూ, నేర నిర్ధారణ చేస్తూ, నేరస్తులెవరో చెప్పేస్తున్న ఇవాళ్టి రాజకీయాల్లో ఎవరైనా ఒక వ్యక్తిని కేసులు చూపి, పక్కకు పెట్టలేమేమో అన్నది నా అభిప్రాయం. ఇది ఏ ఒక్కరినో ఉద్దేశిస్తూనో లేక బలపరుస్తూనో చెప్పేది కాదు - ఇవాళ్టి రాజకీయాల తీరు గురించి వేదన అంతే. 

Comments

  1. మీరు వ్రాస్తున్నవన్నీ చదివాక మీరు ఐ ఏ ఎస్ అవకపోవడం ఈ దేశం చేసుకున్న అదృష్టం అనిపిస్తుంది.మీకు న్యాయస్థానం మీద నమ్మకం లేదు, ఎలక్షన్ కమీషన్ మీద నమ్మకం లేదు,మీమీద కూడా మీకు నమ్మకం లేదు. రోజూ ఆమ్రపాలి,స్మితా సబర్వాల్ చేసే పనులను చూస్తుండండి. మీ పిల్లలైనా మంచి అధికారులవుతారు.

    ReplyDelete
    Replies
    1. రాజకీయంగా మీ అభిప్రాయం వేరుగా ఉండవచ్చు, అది మీరు చెప్పవచ్చు. కానీ, నా వ్యక్తిగత విషయాల మీద వ్యాఖ్య చేసే హక్కు మీకు లేదు. నేనేంటో మీకు తెలీదు, ఈ అక్షరం నేను అవ్వచ్చు, కాకపోవచ్చు. ఇక మీరు దేశం చేసుకున్న అదృష్టం అనుకున్నది, నాతో వ్యక్తిగత పరిచయం ఉన్నవారు దురదృష్టం అనుకుంటారు. ఇక మీరు ప్రస్తావించినట్టు నేను న్యాయ తదితర వ్యవస్థల మీద నమ్మకం లేదని ఎక్కడ చెప్పానో నాకైతే తెలియదు. కానీ, ఈ దేశంలో వ్యవస్థలు మేనేజ్ చేయబడుతున్నాయన్నది ఎవరూ కాదనలేని నిజం - కాదని అనడం ఒక అందమైన అబద్ధం, దాన్ని తెలుసుకోలేకపోవడం అమాయకత్వం. నా వ్యాసంలో అంశాలపై మీకేవన్నా అభ్యంతరాలుంటే తెలియజేయవచ్చు కానీ, వ్యక్తిగత వ్యాఖ్యల దాకా రావద్దని మనవి. నేను ఎంత బాధ్యతాయుతంగా ఉంటానో, ఒక సోషల్ అక్టీవిస్ట్ గా నేను ఏం చేస్తానో కూడా తెలీకుండా మీ చిత్తానికి మాట్లాడేస్తే, మీ ఇష్టం అనుకుని ముందుకుసాగడమే నా పని తప్పించి ఇలా ప్రతిసారీ సమాధానాలిచ్చుకోలేను, అన్యధా భావించకండి

      Delete
    2. ఈ తెలుగు బ్లాగులు కూడా రాజకీయ దుర్వాసన వేస్తున్నాయి. అటు వనం వారూ వంటి, నగ్నచిత్రవిచిత్రం వారూ వంటి వారు నాలికపీకేలా కేసీఆర్ గారికి జయగీతాలు పాడతమూ, ఇటు ఎడతెరిపిలేకుండా ఇలా వ్త్యూపాంట్ల నోపాయింట్ జగన్ యశోగోతాలాపనలూ, జైగారివంటి మేతావులు ఆంధ్రామీద నిర్విరామంగా విషజ్వాలలు చిమ్మటాలూనూ. ఇంత దరిద్రపు రాజకీయం కుళ్ళుకంపు లేకుండా మరేదైనా చదువుదామంటే సినిమాపాటలూ చింతకాయల గోలలు. చండాలమహో చండాలం!

      Delete
    3. హ హ ఏదో సామెత ఉంది '... ఏమి తెలుసు గంధపు చెక్క వాసన' అని. మీకు నచ్చనిదంతా చెడు కాదు. చంద్రబాబు తిట్టటమంటే, ఇక మిగతావారికి స్తోత్రాలు చదవటం కాదు. అయినా ఈ బ్లాగ్ లేదా ఫేస్ బుక్ లేదా ట్విట్టర్ వంటి సామాజిక మాధ్యమాలు ప్రతి ఒక్కరికీ తమ అభిప్రాయాలను వ్యక్తం చేసుకునే అవకాశం కల్పించాయి. ఇతరుల రాతలను తిడుతూ కూచునేకంటే, మీరూ మీ అభిప్రాయాలను రాసుకోవచ్చు. నేనైనా, మరెవరైనా మా రాతలు చదవండహో అని ఎవరినీ వేడుకోవట్లేదు కదా. ఇక అసలు విషయానికి వస్తే, నేను వ్యక్తం చేసిన అభిప్రాయాలలో మీకు సమంజసం కాదనిపించింది వాటి గురించి మీ అభిప్రాయం వ్యక్తం చేయవచ్చు. విషయానికి సంబంధం లేని అంశాలు, బూతులు, వ్యక్తిగత విమర్శలు రానంతవరకూ చర్చకు నేను సిద్ధం. ఇక మీ ఇష్టం ...

      Delete
  2. మిమ్మల్ని వ్యక్తిగతంగా విమర్శిస్తే మీకు బాధకలిగింది కదా ? ఎవరైనా అంతే! అవినీతి పట్టించుకోను జైలుకి వెళ్ళినా పర్వాలేదు అని ఒక విద్యావంతుడు అనవచ్చా ? కొంతమంది ఆరోగ్య శ్రీ ఇచ్చాడు,ఉచిత విద్యుత్ ఇచ్చాడు అని ఓటేస్తారు మీకన్నా వాళ్ళు నయం. నేను కాంగ్రెస్ అభిమానిని కానీ ఇపుడు దేశ,రాష్ట్ర ప్రయోజనాల కోసం ఒక్కోసారి మారాలి. అసలే ఆర్ధిక కష్టాల్లో ఉంటే జగన్ అవసరమా ?

    ReplyDelete
    Replies
    1. మీరు చేసింది వ్యక్తిగత విమర్శ కాదు, వ్యక్తిత్వం మీద విమర్శ. అవినీతి పట్టించుకోను, జైలుకెళ్ళినా పర్లేదు అని నేనలేదే. ప్రస్తుత రాజకీయాలను ప్రస్తావించడం తప్పా? ప్రత్యర్థులు ఆరోపణలు చేస్తారు, అది సహజం. అధికారంలో ఉన్నవారు కక్షసాధింపు చర్యలకు పాల్పడటం అన్నది ఇవాళ కొత్తకాదు, మహాభారత కాలం నుండి ఉన్నదే - అందుకే, ససాక్ష్యంగా నిరూపింపబడేవరకూ నిందితుడికి, నేరస్తుడికి తేడా ఉంటుందన్నది నేను పేర్కొన్నాను. అలా కాక, ఆరోపణలే నేరంగా టీవీ ఛానళ్ల తరహాలో తీర్పులిచ్చేస్తానంటే అది మీ ఇష్టం. నేను ఏ పార్టీ అభిమానిని కాదు. ' ... ఆ ముగ్గురి గురించి' అన్న వ్యాసంలో స్పష్టంగా చెప్పాను - నేను వ్యక్తిత్వాల ప్రాతిపదికన బాబు గారికంటే జగన్ మరియు పవన్ లను ప్రిఫర్ చేస్తాను అని. అదే సమయంలో రాజకీయ సామర్థ్యం విషయంలో జగన్ - పవన్ లు వచ్చినపుడు - ప్రస్తుతం జగన్ ను ప్రిఫర్ చేస్తాను అని చెప్పాను. మీకు నేను ప్రస్తావించిన అంశాలలో ఏవైనా అభ్యంతారులుంటే, మీ అభిప్రాయం చెప్పవచ్చు. కానీ, ఇలా ఎదుటివారి వ్యక్తిత్వం మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం ఎంతవరకు సబబో మీకే తెలియాలి. నేను నా వ్యాసంలో ప్రస్తావించినవి కూడా విధానాలతో కూడిన అంశాలే కానీ వ్యక్తిత్వం మీద విమర్శలు కాదు. ఇక జగన్ అవసరమా లేక చంద్రబాబు అవసరమా అన్నది ఎన్నికలు తెలుస్తాయి, అంతవరకూ ఎవరి అభిప్రాయాలు వారు చెప్పుకోవచ్చు. అనుభవం మీద నమ్మకంతో ఇచ్చిన అవకాశాన్ని చంద్రబాబు గారు నిలబెట్టుకోలేకపోయారన్నది మాత్ర నిజం. ఇక మీరు ప్రస్తావించిన ఆర్ధిక కష్టాలకు ఒకానొక కారణం ఆయన డాబు, దర్పం కూడానూ. తన కుటుంబం అద్దెకుండటానికి స్టార్ హోటల్ ను నెలలతరబడి లక్షల రూపాయలు అద్దె ఇచ్చి ఉంచిన స్థాయిలో ప్రభుత్వ దానం దుర్వినియోగం చేశారు. అయినా ఈ వ్యాసానికి అవి సంబంధిచినవి కాదు, మరొక వ్యాసంలో అవి ప్రస్తావిస్తాను

      Delete
  3. అసలే ఆర్ధిక కష్టాల్లో ఉంటే జగన్ అవసరమా ?

    నిహారిక గారు, అసలే ఆర్ధిక నష్టాల్లో ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ దేశమేగినా ఓ పేద్ద పటాలాన్నేసుకుని స్పెషల్ ఫ్లైట్ ల్లో రాష్ట్ర ఖజానాపై ఆర్ధిక భారాన్ని మోపడం సమంజసమేనా? అలాగే వినోద్ గారన్నట్లు నెలల తరబడి కోట్ల రూపాయలు ప్రజా ధనాన్ని కుటుంబం కోసం ఖర్చు చేయడం కూడా సమర్ధింపదగిన దేనంటారా? మీకున్న అభిప్రాయాలకు మల్లేనే ఇతరులకు కూడా వాళ్ళ అభిప్రాయాలు ఉండకూడ దంటారా? మీరు మీ వాదన కరెక్ట్ అనుకున్నట్లుగానే ఇతరులు కూడా వాళ్ళ వాదన కరెక్ట్ అనుకునే స్వాతంత్రం వాళ్ళకుంటుంది కదా. అలాగే జగన్ అవినీతి పరుడు అని మీరనుకున్నట్లుగానే, ఇతరులు చంద్రబాబు అవినీతి పరుడు అంటుంటే కాదని నిరుపించే సాక్ష్యాలు గాని, జగన్ అవినీతి పరుడని నిరూపించే ఆధారాలు గానీ మీ దగ్గర గని ఇతరుల దగ్గర గాని ఉన్నాయంటారా? ఉంటే ఇంతవరకు ఎవర్నైనా అవినీతి పరులుగా ఇంతవరకు ఎందుకని నిరూపించలేక పోయారంటారు? సరే అదో ప్రక్క - జగన్ కనీసం కోర్ట్ లనెదుర్కొని ఎదురీదుతున్నాడు మరి చంద్రబాబు ఆయన మీద వేసిన ప్రతి కేసులోనూ ఎందుకు స్టే లు తెచ్చుకుంటాడంటారు? కోర్ట్ లనెదుర్కొని కడిగిన ముత్యంలా ఎందుకు బయటపడి నీతిమంతుడుగా మన్ననలు పొందలేకపోతున్నాడు? దేశంలో అసలు ఈయన కాక ఇంకెవరన్నా ఇన్ని స్టే లున్న నాయకున్నాడంటారా?
    అప్పుడెప్పుడో, తెహెల్కా వాళ్ళనుకుంటాను, దేశం అంతలో చంద్రబాబు గారు రిచెస్ట్ పొలిటిషన్ అని వార్తా ప్రచురించారు. రెండెకరాల రైతు రాజకీయాల్లోకి వచ్చి అంత సంపాదింహాదంటారు ప్రత్యర్థులు. లేదు లేదు ఆయన పూర్తిగా నీతిమంతుడు అవన్నీ గిట్టని వాళ్ళ ఆరోపణలు అని మీరంటారా? అన్నట్లు తాజా వార్తలు మీరు కూడా చదివే ఉంటారు చంద్రబాబు గారి కుటుంబ ఆస్తులు ప్రస్తుతం 800 కోట్ల చిల్లర అంట. అప్కోర్స్ జగన్ గారి ఆస్తులు కూడా ఆ స్థాయిలోనే డిక్లేర్ చేసి ఉంటారు లెండి. అయినా ప్రకటింపబడిన ఆస్తులే అంతంత ఉండి ఉంటే నిజ ఎంతెంత ఉండి ఉంటాయి అంటారు? వీళ్లిద్దరు కూడా ఇంతింత ఆస్తులుల న్యాయంగానే సంపాదించి ఉంటారంటారా? మే బి, మీ దృష్టిలో చంద్రబాబు గారు మాత్రం న్యాయంగా, జగన్ గారు అన్యాయం గా సంపాదించారు. అంతేగా? మీరు కాస్తంత లాజికల్ గానే జవాబిస్తారని అనుకుంటూ ఉంటాను. దీనిక్కూడా లాజికల్ గా ఎనాలిసిస్ ఇవ్వగలరు.

    ReplyDelete
  4. అసలే ఆర్ధిక నష్టాల్లో ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ దేశమేగినా ఓ పేద్ద పటాలాన్నేసుకుని స్పెషల్ ఫ్లైట్ ల్లో రాష్ట్ర ఖజానాపై ఆర్ధిక భారాన్ని మోపడం సమంజసమేనా?

    కేసీఆర్ లాంటివాళ్ళే స్వంత హెలికాఫ్టర్ మెయింటైన్ చేస్తుంటే బాబుగారు తిరగొద్దా ?

    ReplyDelete
    Replies
    1. ఇతరులతో పోలిక ఎందుకండీ ఇక్కడ? ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక పరిస్థితి విభజన తరువాత దారుణం అని తెలియదా? పోల్చాలంటే, దేశ ప్రధాని ఎయిర్ ఇండియా విమానాల్లో తిరుగుతుంటే, ఈయన ప్రత్యేక విమానాలు అవసరమా? రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ధృవీకరించిన ప్రకారమే 2014 - 15 కాలానికి దాదాపు 120 కోట్లు కేవలం ఆయన విమాన (ప్రత్యేక) ప్రయాణాల ఖర్చు. మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా అలా తిరగలేదేమో. ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి ...

      Delete
  5. అలాగే వినోద్ గారన్నట్లు నెలల తరబడి కోట్ల రూపాయలు ప్రజా ధనాన్ని కుటుంబం కోసం ఖర్చు చేయడం కూడా సమర్ధింపదగిన దేనంటారా?

    మీరన్న నీతిపరుడైన జగన్ ఇల్లు, కేసీఆర్ గారి ప్రగతిభవన్ ఎవడబ్బ సొమ్మో ముందు తేల్చండి.

    ReplyDelete
    Replies
    1. జగన్ గారి విషయానికి వస్తే, గతంలో వైఎస్ గారు పేర్కొన్నట్టు వారేమీ బాబుగారిలా రెండెకరాల ఆసాములు కాదు వైఎస్ గారి తాతల కాలం నుండి ఆ ప్రాంతంలో అన్నిరకాలుగా కలిగిన కుటుంబం అది. ఆధారాలు లేని ఆరోపణలు పక్కనబెడితే, అంతటి ఇల్లు కట్టుకోగలిగే ఆర్ధిక స్థోమత జగన్ గారి కుటుంబం కలిగి ఉందనేది వాస్తవం - కనీసం 2004/09 ఎన్నికల సమయంలో వారు సమ్పరించిన అధికారిక అఫిడవిట్ ల ప్రకారం చూసినా. ఇక, మీరే తెచ్చారు కాబట్టి అలాగే చంద్రబాబు గారు తాజాగా హైదరాబాద్ లో కట్టుకున్న ఇల్లు లెక్కలు తెలిస్తే చెప్పండి లేదా మీకు కేవలం జగన్ ఇల్లు మరియు కెసిఆర్ ఇల్లు గట్రా మాత్రమే కనబడతాయి అంటే చర్చే అనవసరం. మరో ముఖ్య విషయం - ఈ పోస్ట్ జగన్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్థించేది కాదు. ప్రస్తుత రాజకేయాల్లో నేరారోపణల తీరు గురించి చెప్పటం మాత్రమే. అవి నిజమా, కాదా అనేది న్యాయస్థానాలు ఆధారాలను బట్టి తేలుస్తాయి. నేను ఎవరినీ నిరపరాధి అని అనట్లేదు అలాగే ఎవరినీ నేరస్థుడనీ అనట్లేదు.

      Delete
  6. మీరు మీ వాదన కరెక్ట్ అనుకున్నట్లుగానే ఇతరులు కూడా వాళ్ళ వాదన కరెక్ట్ అనుకునే స్వాతంత్రం వాళ్ళకుంటుంది కదా.

    అందుకేగా చర్చ నడుస్తుంది. చర్చకి అవకాశం ఇవ్వకపోతే మీరు కూడా వ్రాసేవారు కాదు.

    ReplyDelete
    Replies
    1. నేను చెప్పేది మాత్రమే కరెక్ట్ అనుకుంటే మీ వ్యాఖ్యలకు అసలు సమాధానం కూడా ఇచ్చేవాడిని కాదు. చెప్పానుగా నేను నాయకుల మీద చేసిన వ్యాఖ్యలకు మీరు నానా వ్యక్తిత్వం మీద చేసిన వ్యాఖ్యలు సమంజసంగా లేవు అని. ఆలాంటి వ్యాఖ్యలు రానంతవరకూ చర్చకు నేను ఓకే. మనం మన అభిప్రాయాలు చెప్పుకుంటున్నాం ... నా అభిప్రాయం నచ్చితే, సమంజసంగా ఉందనుకుంటే మీరు ఏకీభవించవచ్చు లేదా సహేతుకమైన విమర్శలు చేయవచ్చు.

      Delete
  7. అలాగే జగన్ అవినీతి పరుడు అని మీరనుకున్నట్లుగానే, ఇతరులు చంద్రబాబు అవినీతి పరుడు అంటుంటే కాదని నిరుపించే సాక్ష్యాలు గాని, జగన్ అవినీతి పరుడని నిరూపించే ఆధారాలు గానీ మీ దగ్గర గని ఇతరుల దగ్గర గాని ఉన్నాయంటారా?

    2 లక్షల కోట్ల 2 జీ కుంబకోణం చేసినవాళ్ళు కానీ, చంద్రబాబుగారు కానీ 18నెలలు జైళ్ళలో లేరు. మన మీద ఒక్క కేసు ఉన్నా ప్రభుత్వ ఉద్యోగం రాదు అని వినోద్ గారికి తెలుసు.ముఖ్యమంత్రి పదవి ఎలా ఇస్తారు అని అడుగుతున్నా !


    ReplyDelete
    Replies
    1. మీకు తెలిసి మాట్లాడుతున్నారో లేక తెలీక అంటున్నారో అర్థం కావటం లేదు, ఇపుడు నేను అనాలి మీకు వ్యవస్థల గురించి అవగాహన ఉందా అని? ఎందుకంటే, జగన్ గారు జైల్లో ఉన్నది నేరస్తుడిగా కాదు, సాక్ష్యాలను ప్రభావితం చేస్తాడేమో అని అదనపు అభియోగాలపై. మరో విషయం కాంగ్రెస్ ప్రముఖులు స్యయంగా పేర్కొన్నట్టు సోనియా గాంధీకి దేహి అని ఉంటే, జగన్ పై కేసులు ఉండేవి కావు, కేంద్రంలో మంత్రి పదవి కూడా వచ్చేది. ఇది స్వయంగా ఆనాటి కాంగ్రెస్ వ్యవహారాలను సమీక్షించిన గులాం నబీ ఆజాద్ గారు సెలవిచ్చినది, మరి దానిని కక్షసాధింపు అంటారా కాదా? రాజకీయాల్లో ఇక్కడ మీరూ, నేను ప్రస్తావించిన వారెవరూ మంచిముత్యాలు కారు, కానీ వారి మీద ఆరోపణలకు ఆధారాలు లేకుండా చట్టం ప్రకారం నేను వారిని నేరస్తులని అనలేను. వ్యవస్థ మీద నమ్మకం ఉంటే మీరు కూడా అన్నారు, ఆరోపితులు లేదా నిందితులు అని అనవచ్చు, చట్టప్రకారం. చంద్రబాబు గారు ఒక్క కేసులో, కనీసం ఒక్క కేసులో స్టే కు అప్లై చేయకుండా ఉండమనండి చూద్దాం - విచారణ ఎదుర్కోవడానికి కూడా భయపడుతున్నారు కదా.

      Delete
    2. మీ అనాలిసిస్ ప్రకారమే చూస్తే కోర్టులు స్టే ఇచ్చింది కేసులో బలం లేకపోవడం వల్లే కావచ్చు. విచారణలు ఎదుర్కొంటూ నేరాలు నిరూపితం కానీ జగన్ కన్నా ఇంకా విచారణే ప్రారంభం కాని చంద్రబాబు రేటింగ్ ఎక్కువేమో కదా!!

      Delete
    3. నేను ఎనాలిసిస్ చేసింది రాజకీయాలలో ఆరోపణల గురించి మాత్రమే తప్పించి, ఒకరు నీతిమంతుడు అనో మరొకడు కాదనో నేను తీర్మానించలేదు. మరో విషయం - కోర్ట్ లో ఆధారాలు మరియు ఇరువైపుల వాదనలూ ముఖ్యం. లాయర్ సమర్థుడు కాకపొతే లేకపోతే సమర్థంగా వాదన వినిపించకపోతే జడ్జి ఏమీ చెయ్యలేరు. వ్యవస్థల పనితీరుపై మీకు అవగాహన ఉందనుకొంటాను. కేసుల్లో ఎంత బలమున్నప్పటికీ, ఆధారాలు లేకపోతే లేక వాదన లాజికల్ గా వాదన వినిపించలేకపోతే కేసు వీగిపోవచ్చు. ఇవన్నీ మీకు తెలియనివి కావు ...

      Delete
  8. చంద్రబాబు గారు రిచెస్ట్ పొలిటిషన్ అని వార్తా ప్రచురించారు. రెండెకరాల రైతు రాజకీయాల్లోకి వచ్చి అంత సంపాదించాడంటారు ప్రత్యర్థులు. లేదు లేదు ఆయన పూర్తిగా నీతిమంతుడు అవన్నీ గిట్టని వాళ్ళ ఆరోపణలు అని మీరంటారా?

    రెండెకరాల రైతు సమర్ధుడు కాబట్టే ఎన్ టీ ఆర్ కూతురిని ఇచ్చారు.
    సమర్ధుడు నీతివంతుడవనవసరం లేదు. నీతిమంతుడు డబ్బు సంపాదించలేడు. రెండూ వేరు. మీకు నీతివంతుడు కావాలా సమర్ధుడు కావాలో మీరే తేల్చుకోవాలి.ఆంధ్రాకి ప్రస్తుతం సమర్ధుడే కావాలి అని నేను అభిప్రాయపడుతున్నాను.జగన్ సమర్ధుడూ కాదు నీతివంతుడూ కాదు.

    ReplyDelete
    Replies
    1. చంద్రబాబు పట్ల మీ అభిప్రాయాలు మార్చుకోమని నేనేమీ మిమ్మల్ని కానీ, వేరెవరినీ కానీ బతిమాలట్లేదు. అదే సమయంలో ఆయనపట్ల నాకున్న అభిప్రాయాలు ఏర్పడటానికి, నేను చూసిన/విన్న/చదివిన సంఘటనలు కారణం. అవన్నీ వేరే వ్యాసంలో రాయగలను. ఇక ఎన్టీఆర్ గారి కూతురును చేసుకునే టైం కి ఆయన రెండెకరాల రైతు కొడుకు మాత్రమే కాదు, అప్పటికే మినిస్టర్ అనుకుంటాను లేదా రాజకీయాల్లో చెప్పుకోదగ్గ స్థాయికి చేరుకున్నారు. ఇక జగన్ లేదా పవన్ ల సమర్థత గురించి నేను విమర్శించను, ఎందుకంటే వారివురూ అధికారంలో లేరు. వారు అధికారం చెలాయించాక, అపుడు ఆ పాయింట్ మీద మాట్లాడవచ్చు. ఇక మరోకోణంలోంచి చూస్తే, 2014 ఎన్నికల్లో అధికశాతం ప్రజలు బాబుగారికంటే, జగన్ పై నమ్మకం వెలిబుచ్చారనుకోవచ్చు - ఎందుకంటే జగన్ ఒంటరిగా పోరు చేయగా - బాబుగారు మోదీ మరియు పవన్ ల సహకారంతో కేవలం 1.5% వోట్ల తేడాతో గెలవగలిగారు. ఇక మీ విజ్ఞత ...

      Delete
    2. "రెండెకరాల రైతు సమర్ధుడు కాబట్టే ఎన్ టీ ఆర్ కూతురిని ఇచ్చారు"

      ఎన్టీఆర్ తన మీద వేసిన కోర్టు కేసులో చంద్రబాబు ఇచ్చిన వాజ్మూలం ప్రకారం:

      1. చంద్రబాబు 1978లో శాసనసభకు నెగ్గాడు
      2. ఆయన 1980-82 మధ్యలో ముగ్గురు ముఖ్యమంత్రుల కింద మంత్రిగా పని చేసాడు
      3. పెండ్లి జరిగింది 1981లో, అప్పటికి ఆయన మంత్రి పదవిలో ఉన్నాడు

      https://indiankanoon.org/doc/809013/

      "Before the petitioner entered politics of Andhra Pradesh I was actively involved in the politics of Andhra Pradesh"

      "I was married in 1981 while I had been in politics long before my marriage. The petitioner entered political field for the first time only in 1982"

      PS: "petitioner" = NT Ramarao

      Delete
  9. మీ దృష్టిలో చంద్రబాబు గారు మాత్రం న్యాయంగా, జగన్ గారు అన్యాయం గా సంపాదించారు. అంతేగా? మీరు కాస్తంత లాజికల్ గానే జవాబిస్తారని అనుకుంటూ ఉంటాను. దీనిక్కూడా లాజికల్ గా ఎనాలిసిస్ ఇవ్వగలరు.

    ప్రకటించిన ఆస్తులకన్నా ఇద్దరికీ ఎక్కువే ఉంటాయి అని నేను భావిస్తున్నాను. ఆస్థుల ఆధారంగా ఓట్లు వేస్తున్నామా ? అవినీతి ఆధారంగా ఓటు వేస్తున్నాం.అతి తక్కువ అవినీతి ఎవరిలో ఉంది అంటే పవన్ అనే చెప్పవచ్చు కానీ పవన్ గారు ఎన్నో పుస్తకాలు నమిలేసాను అంటారు కానీ ఆయన కూడా తాయిలాలు ఇస్తాను అంటున్నారు. ఉచితంగా ఎవరు ఎక్కువ ఇస్తానంటున్నారో వారే ఎక్కువ అవినీతికి పాల్పడవలసి వస్తుంది.ప్రజలే అవినీతికి పాల్పడమని ప్రోత్సహిస్తుంటే అవినీతిపరులెవరో ఎవరు తేలుస్తారు ?
    ఎవడబ్బ సొమ్ము ఇస్తున్నారు అని అడుగుతున్నవాళ్ళకు తెలుసు ఏదీ ఊరికే రాదు అని.
    ఇపుడు మనముందున్నది ముగ్గురు వారిలో ఎవరో ఒకరిని ఎన్నుకోవాలి.పవన్ కి అనుభవం సరిపోదు,జగన్ కి కేసులున్నాయి.రేపు ముఖ్యమంత్రి అయ్యాక జయలలితలాగా కోర్టుకి వెళితే పరిస్థితి ఏమిటి ? 18 నెలలు జైలులో ఉండి వచ్చినవాడు సచ్చీలుడు అని నమ్మే పరిస్థితి లేదు.
    చంద్రబాబు నాయుడు గారు తప్ప మరొకరు కనిపించనపుడు ఆయనే ముఖ్యమంత్రి అవుతారు కదా ?

    ReplyDelete
    Replies
    1. ప్రకటించిన ఆస్తుల లెక్క చూస్తే చంద్రబాబు కుటుంబ ఆస్తులే ఎక్కువగా ఉన్నాయి మరి. ఇక ఎన్నికల తాయిలాలు ప్రకటించటంతో ఎవరూ తగ్గట్లేదు, కాబట్టి ఆ విషయంలో అందరూ ఒకటే. మరో వ్యాఖ్యలో ప్రస్తావించినట్టు ఇపుడు రాజకీయాల్లో స్వాతిముత్యాలు లేరని అందరికీ తెలుసు. ఇక జైలులో ఉన్నది రేమండ్ ఖైదీగా, మీకు దాని అర్థం తెలుసనుకుంటాను. సాక్షులను ప్రభావితం చేయగలడేమో అనే అభిపయోగాలపై నిర్బంధంలో ఉన్నాడు తప్పించి, నేరాలు రుజువై కాదు. ఇంతవరకూ ఏ సాక్షులూ నిర్ధారించలేదు, కోర్ట్స్ ధ్రువీకరించలేదు. నాకు వ్యవస్థల మీద గౌరవం ఉంది కాబట్టి, వ్యవస్థల పరిధిలో మాత్రమే మాట్లాడుతున్నాను. చట్టప్రకారం నేరస్థుడుగా ధృవీకరించబడని వ్యక్తిని మీరు నేరస్థుడు అంటున్నారు, మీ విజ్ఞత. చంద్రబాబు నాయుడు గారిని మీరు అభిమానించవచ్చు, ఆయనే అత్యంత సమర్థుడు అని అనుకోవచ్చు - అందులో నాకభ్యంతరమేమీ లేదు. కానీ, నాతో అనిపించాలన్న మీ ప్రయత్నం సఫలం కాదు - ఎందుకంటే నేను అన్ని విషయాలను సహేతుకంగా పరిశీలిస్తూ గత దశాబ్దం పైగా వివిధ మార్గాలలో సమాచారం సేకరించి, విశ్లేషించుకున్నాను. అలాగే మీరు కూడా అభిప్రాయం ఏర్పరచుకొని ఉండవచ్చు. మీ ఇష్టం ... కానీ, నా దృష్టిలో చంద్రబాబు నాయుడు అవసరం లేదు రాష్ట్రానికి. వెంటనే మీరు జగన్ లేదా పవన్ వేరే వ్యక్తుల ప్రస్తావన తేకండి. వారు ఒకసారి అధికారంలోకి వస్తే వారు అవసరమా కదా అన్నది తెలిసేది. అటూ ఇటూగా ఇద్దరూ అధికారం చెలాయించాలని నా అభిప్రాయం. చూద్దాం - జనాల తీర్పు ఎలా ఉంటుందో. నా అంచనాలు ఇప్పటికే రాశాను

      Delete
    2. ఈ లెక్కన కె ఏ పాల్ సమర్థత కూడా అతన్ని ఒకసారి సీఎం ని చేస్తేగాని తెలియదా?

      Delete
    3. అతడు నిత్యం రాజకీయాల్లో ఉంటూ, రాజకీయంగానో మరో విధంగానో పోరాటాలు చేస్తూ, ప్రజల్లో ఒక స్థిరమైన మరియు బలమైన ప్రత్యామ్నాయ రాజకీయ నేతగా గుర్తింపు పొందగలిగిననాడు అతడికీ అవకాశం రావచ్చు. ఎన్ని కేసులున్నా, ఎంత బద్నామ్ అయినా ఇపుడు ఒకే ఒక బలమైన ప్రత్యామ్నాయ నేతగా నిలబడగలిగాడంటే అది జగన్ నిత్యం ప్రజల్లో ఉంటూ, తన అస్థిత్వం కోసమో లేక ప్రజల కోసమో లేక రాజకీయ అవసరాల కోసమో చేసిన పోరాటం మాత్రమే కారణం. అతడి తండ్రి ఇమేజ్ కొంతవరకూ సహకరించి ఉండవచ్చు, కానీ వైఎస్ చనిపోయి దశాబ్దం అయింది కేఏ పాల్ మాత్రమే కాదు, మీరో నేనో కూడా కావచ్చు - దానికి ఏం చేయాలో కూడా మీకు తెలుసు. ఇక సమర్థత అన్న విషయానికి వస్తే తొమ్మిది సంవత్సరాలుగాఅధికారంలో లేకపోయినా, అధికార పక్షాలతో తీవ్ర వైరంతో ఉంటూ కూడా బలమైన రాజకీయ నేతగా ఎదిగాడే తప్ప, కృంగిపోలేదు. ఈనాడు జాతీయ మీడియా కూడా దేశంలోనే అత్యంత ప్రభావవంతమైన నేతలలో చంద్రబాబు కంటే జగన్ కె మెరుగైన స్థానం ఇచ్చింది. ఇవేవీ ఊరికే వచ్చేవి కావని కూడా మీకు తెలుసు, కేవలం డబ్బులతో కొనవచ్చు అంటే అధికారంలో ఉన్న చంద్రబాబు కొనలేడా చెప్పండి? ఇక కేఏ పాల్ లేదా పవన్ లు తమ అస్థిర, అనిశ్చిత తీరుతో బలమైన నేతలుగా ఎదగలేకపోయారు. పవన్ కు ఉన్న సినిమా ఇమేజ్ అతడిని బలంగా చూపుతుండవచ్చు గాక కానీ ఎన్నికల ఫలితాలు తెలుపుతాయి అతడి బలమెంతో ... సమర్థతకు, నేరారోపణలు సంబంధం లేదని గమనించగలరు - అది వేరే అంశంగా చర్చించవచ్చు.

      Delete
  10. తెలంగాణ ఎన్నికల సమయంలో లగడపాటితో ఫేక్ సర్వే చేయించి పరువు పోగొట్టుకున్న పచ్చ బాచీ తాజాగా ఇంకో ఫేక్ సర్వే విడుదల చేసింది. సీబీఎన్ చంద్రజ్యోతి ఊదరగొడుతున్న సమాచారం ఇది:

    https://www.andhrajyothy.com/artical?SID=754283

    లోక్‌నీతి-సీఎ్‌సడీఎస్‌ అనే స్వతంత్ర సంస్థ సదరు సర్వే చేసినట్టు వేమూరి చెప్తున్నాడు. ఆ సంస్థ వారు మాత్రం తాము ఎటువంటి సర్వే చేయలేదని ప్రకటించారు.

    "Lokniti-CSDS has NOT done any survey in the State of Andhra Pradesh. What is being shared on social media is FAKE and complete rubbish!"

    https://twitter.com/lokniticsds?lang=en
    https://twitter.com/LoknitiCSDS/status/1112577889877323781

    ఇంతటి బరివాత దిగజారుడు ఎల్లో మీడియాకే చెల్లింది.

    ReplyDelete
    Replies
    1. పచ్చ మీడియా తాజా సర్కస్ ఫీటు. "కొర్పొరేటు చాణక్య" అనే సంస్థ ఎదో సర్వే చేసిందని & అందుట్లో బాబు గెలుస్తాడని నిన్నంతా దండోరా వేసారు. గోనుగుంట్ల అనిల్ అనబడే సదరు సర్వేయరు తాము జనాభాలో 2% ప్రజలను సర్వే చేసామని డబ్బా కొట్టుకున్నాడు.

      ఇతగాడు గతంలో ఎప్పుడూ సర్వే చేసిన పాపాన పోలేదు. వింతేమిటంటే ఈ ఘనకార్యం చేసినట్టు చెప్తున్న అనిల్ అనబడే పచ్చ చెంచా తన డొక్కు కంపెనీకి పేరు మోసిన టుడేస్ చాణక్య సంస్థకు పోలిన పేరు పెట్టుకొని మరీ బారి తెగించాడు. షరా మామూలుగా తమకు ఈ నిర్వాకంతో సంబంధం లేదని వారూ ప్రకటించాల్సి వచ్చింది.

      https://twitter.com/TodaysChanakya/status/1114915801990148096

      "This is not our survey. We have not done it. Please retweet to make people in Andhra aware about this"

      Delete

Post a Comment

Popular posts from this blog

... కరోనా కంటే ఎక్కువగా భయపెడుతున్న అంశం?

... మూడో కూటమి

... 2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు - జనసేన