... అనుభవం

వంశీ వ్యూ పాయింట్ // ... అనుభవం // 
****************************************
            రాజకీయాల్లో 'అనుభవం' అన్నమాట వింటుంటే నాకు ఒక ఘటన గుర్తొస్తోంది. దాదాపు పదిహేనేళ్ళ క్రితం జరిగిన ఘటన ఇది. నా మిత్రుడొకరు ఏదో పండగకు ఊరికి వెళ్ళాడు. అప్పటికే రెండు సంవత్సరాలనుండి ఒక పెద్ద ఎమ్మెన్సీ లో మంచి ఉద్యోగం చేస్తున్నాడు మావాడు. ఇంట్లో పెళ్ళిసంబంధాలు చూస్తున్నారు. మా వాడు ఊరెళ్ళి, ఇంట్లో అడుగుపెట్టే సమయానికి ఎవరో ఒక తెలిసినావిడ వాళ్ళింట్లో ఉందట. ఆవిడ పెళ్ళిసంబంధాలు చూసే మధ్యవర్తి కూడానట. మావాడు కాస్త ఫ్రెష్ అప్ అయ్యి వచ్చాక, ఆవిడ ఇంటర్వ్యూ మొదలైంది. అన్ని వివరాలు కనుక్కున్నాక, అయ్యో ఒక మంచి సంబంధం ఉంది కానీ, సెట్ అవదు అన్నదట. ఎందుకూ అంటే 'ఏం లేదు బాబూ, ఆ అమ్మాయికి కనీసం నాలుగేళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కావాలట. నీకేమో రెండు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ మాత్రమే ఉంది కదా, కాబట్టి ఆ అమ్మాయి ఒప్పుకోదు లేకపోతే మంచి సంబంధం బాబూ' అన్నదట. 
            మరి ఆ అమ్మాయి కోరుకున్నంతటి ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తి దొరికాడో లేదో తెలియదు కానీ, మావాడు మాత్రం ఇపుడు బాగా అంటే బాగా సెటిల్ అయ్యాడు. రెండు మూడు దేశాలు కూడా తిరిగొచ్చాడు. అంతేకాక, ఆ అమ్మాయి అనుభవం అంటే ఏమనుకుందో తెలియదు కానీ మావాడు మాత్రం నిజంగానే చాలా మంచివాడు అన్నిరకాలుగా. అందుకే, ఊరికే అనుభవం అనుభవం అనకూడదు. మేము ఐటీ ఉద్యోగాలకోసం వేటలో ఉన్నపుడు, ప్రకటించబడే ఉద్యోగాలలో అధికశాతం రెండు లేదా మూడు సంవత్సరాల అనుభవం అవసరం అని ఉండేవి. అపుడు అనుకునేవాళ్ళం - ఎవడో ఒకడు ఉద్యోగం ఇవ్వకుండా అనుభవం రాదు, అనిభవం ఉంటే కానీ ఎవడూ ఉద్యోగం ఇవ్వనంటాడు! ఎలా? అయినా ధైర్యం, మంచితనం ఉండాలి కానీ అనుభవంది ఏముంది చెప్పు. సర్లే, ఇంతకీ ఏం మాట్లాడుకుంటున్నాం - హా, రాజకీయాల్లో అనుభవం గురించి కదా. ఏమోనబ్బా ... ఈ అనుభవమూ అదీ అంతగా పనికిరావని అనుభవమే చెబుతోంది. చూద్దాం, శివయ్య ఏటనుకుంటన్నాడో ... 

Comments

Popular posts from this blog

... కరోనా కంటే ఎక్కువగా భయపెడుతున్న అంశం?

... మూడో కూటమి

... 2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు - జనసేన