... పవన్ రాజకీయం

వంశీ వ్యూ పాయింట్ // ... పవన్ రాజకీయం // 
***********************************************
            2009 ఎన్నికలప్పుడు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టి, ఎన్నికలకు సిధమైనపుడు - మొదట చాలామంది జనాలు వైఎస్, సిబిఎన్ తరహా కాకుండా కాసింత కొత్త తరహా మరియు నిజాయితీతో కూడిన రాజకీయం చూడవచ్చని ఆశపడ్డారు. కానీ, ఎప్పుడైతే చిరంజీవి కూడా తెదేపా, కాంగ్రెస్ వంటి పార్టీలనుండి వచ్చిన నేతలకు, అక్రమార్కులుగా పేరు పెద్దవారికి టికెట్స్ ఇవ్వడంతో పాటు - అల్లు అరవింద్ ఆధ్వర్యంలో సినిమా వ్యాపారం తరహాలో చేయడంతో ఆశలు ఆవిరైపోయాయి. అక్కడికీ, చిరంజీవిని అభిమానించేవారితో పాటు ఇతరులను వ్యతిరేకించేవారు కూడా కాసింత నమ్మకం చూపడంతో దాదాపు 19% వోట్లు, 18 సీట్లు సాధించగలిగారు. వైఎస్ మరణానంతరం ఉన్న పరిస్థితిని తనకు అనుకూలంగా మలచుకోలేక, కాంగ్రెస్ లో కలిసిపోయి, కేంద్ర రాజకీయాలకు వెళ్ళిపోయారు. చిరంజీవి పరంగా చూస్తే కొన్నేళ్ళు సినిమారంగానికి దూరం కావడం తప్పించి పెద్దగా కోల్పోయిందేమీ లేకపోవచ్చు. కానీ, కాంగ్రెస్ లో విలీనం వంటి చర్యలతో మరో కొత్త పార్టీని నమ్మడం అన్నదాన్ని అనుమానాస్పదంగా చేసి వెళ్లిపోయారు చిరంజీవి. ఆ గాయం మానకముందే, 2014 లో ఆయన తమ్ముడు, 2009 లో యువరాజ్యం అధ్యక్షుడుగా పంచెలూడగొడతా అని ఎగెరెగిరిపడిన పవన్ కళ్యాణ్ 'జనసేన' అని కొత్తపార్టీతో వచ్చారు. ఏదో చేస్తారేమో అనుకుంటే, చంద్రబాబు మాయలో పడి - ఆయనకు మద్దతిచ్చి నాలుగున్నరేళ్ళు అప్పుడప్పుడూ ట్విట్టర్ పోరాటం, కొన్నిసార్లు జనాలదగ్గరకు వెళ్ళిరావడం - ఆ తరువాత బాబు మీద నమ్మకం ఉందంటూ కాలం గడిపి - ఇపుడు ఎన్నికలప్పుడు కొత్తగా జనల ముందుకు వచ్చి పోటీకి తయారయ్యారు. 
            2009, 2014 ఉదంతాలు అనుమానపు నీడలను పెంచుతూ ఉంటే - మరోవైపు పవన్ ఇపుడు రాష్ట్రంలో ఉన్న పరిస్థితికి కారణమైన అధికార పక్షాన్ని కాక ప్రతిపక్షాన్ని ప్రశ్నించడం వంటివి అనుమానం కలిగించేలా చేశాయి. గత అయిదేళ్ళలో కూడా అనేక కీలక ఘటన విషయంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించని పవన్, (వోట్ కు నోట్, కాల్ మనీ సెక్స్ స్కాండల్ వంటివి) ఇపుడు కూడా ప్రభుత్వాన్ని లేదా తెదేపాను కాక ప్రతిపక్షం లక్ష్యంగా ప్రచారం చేయడం ఆయన చంద్రబాబుతో లాలూచీ పడ్డాడు అనే అనుమానం కలిగించేదిగానే ఉంది. అంతే కాక ఏదో దరఖాస్తులు, పరీక్షలు అంటూ ఒక పెద్ద తతంగం నడిపి - చివరకు ఇతర పార్టీల నుండి వచ్చినవారికి అప్పటికప్పుడు టికెట్స్ కేటాయించడం వంటివి కూడా వ్యూహాత్మక తప్పిదాలే కాగలవు. తాను మిగతా రాజకీయపక్షాల లాగా కాకుండా భిన్న, నిజాయితీ మరియు విలువలతో కూడిన రాజకీయాలు చేస్తానని చెప్పుకునే పవన్ కళ్యాణ్ కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పవలసి ఉంది - రెండు స్థానాలలో పోటీ చెయ్యడం; ఆయన పార్టీ సిద్ధాంతం ప్రకారం దరఖాస్తు చెయ్యడం, పరీక్ష రాయటం వంటివి లేకుండానే అప్పటికప్పుడు పార్టీ మరి వచ్చిన వారికి టికెట్స్ కేటాయించడం; తెదేపా, కాంగ్రెస్, వైఎస్సార్సీపీ, తెరాస వంటివారి కుటుంబ రాజకీయాలను ప్రశ్నిస్తూ తాను తన అన్న నాగబాబుకు టికెట్ కేటాయించడం; తెదేపా ప్రభుత్వ అవినీతి తదితరాలపై కాక ప్రతిపక్షం లక్ష్యంగా ప్రచారం చెయ్యడం; ఒకవైపు ఉత్తరాది పెత్తనం వద్దంటూ, మరోవైపు అసలు రాష్ట్రంలో అస్థిత్వమే లేని ఉత్తరాది బీఎస్పీ పార్టీకి వామపక్షాల కంటే అధికంగా స్థానాలు కేటాయించడం; ప్రభుత్వ వ్యతిరేక వోట్ చీల్చేలా ప్రవర్తించడం - ఇటువంటివి పవన్ రాజకీయంపై నీలినీడలు ప్రసరించేలా చేశాయి. 
            రెండు స్థానాల్లో పోటీ చెయ్యడం, అన్నకు మరియు ఇతర పార్టీల నుండి వచ్చిన నేతలకు టికెట్స్ కేటాయించడం వంటివి రాజ్యాంగం ప్రకారం, చట్టప్రకారం, ఎన్నికల సంఘం నిబంధనావళి ప్రకారం తప్పులు కాకపోవచ్చు - కానీ, పవన్ ఇంతవరకూ చెప్పుకున్న భిన్న రాజకీయాలు మాత్రం కావు. ఇక, ఇవి వ్యూహాలుగా చెప్పుకుంటే అంతకు మించిన వ్యూహాత్మక తప్పిదాలుండవు అని గమనించాలి. అంతేకాక, అటువంటి అభ్యర్థులకు సీట్స్ ఇవ్వడం గురించి ఆయన సమర్థింపు బహు విడ్డూరంగా ఉంది, 'ఆ పార్టీలు మంచివారికి ఇచ్చి ఉంటే నేనూ మంచివారికే ఇచ్చి ఉండేవాడిని' అన్నారు. నువ్వూ ఆ పార్టీల లాంటివారికే ఇస్తే ఇక నువ్వెందుకు? ఈ విషయంగా గతంలో పవన్ చెప్పిన ఒక విషయాన్ని ప్రస్తావిస్తాను. తొలిప్రేమ తరువాత అనుకుంటాను, ఒక ఇంటర్వ్యూలో 'మీరు మీ అన్న చిరంజీవి గారిని అనుకరిస్తారా?' అని అడిగిన ప్రశ్నకు సమాధానంగా పవన్ గారు 'చిరంజీవిగారిలాగా చెయ్యటానికి చిరంజీవి ఉన్నారు కదా, నేనెందుకు? అయినా చిరంజీవి లాగా మరొకరు చేస్తే జనాలు మెచ్చరు, చిరంజీవి ఓక్కరే అనే తీరున సమాధానమిచ్చారు. ఇపుడు ఇతర పార్టీల లాగానే తానూ రాజకీయం చేస్తానని అనేముందు ఒకసారి ఆ తీరును సమీక్షించుకోవాలి. 
            ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే, పవన్ భిన్న తరహా రాజకీయాలు చేయకపోగా చంద్రబాబు మాయలో పడి తన రాజకీయ అస్థిత్వాన్ని పణంగా పెట్టాడని అనిపిస్తోంది. పవన్ మీద అనేక ఆశలు పెట్టుకున్న అభిమానులు, మేధావులు, ఇతరులు - రేపటి ఎన్నికల తరువాత పవన్ తీరుతో నిరాశ చెందటం ఖాయంగా అనిపిస్తోంది. ఇక్కడ పవన్ రాజకీయం ప్రజారాజ్యం అనంతరం అనేకంటే మరో కొత్తపార్టీ రాజకీయం, ఒక కొత్తతరహా రాజకేయం చూస్తామని ఆశపడ్డ ప్రజల నమ్మకాన్ని కూకటివేళ్ళతో పెకలించివేస్తోందేమో. అనేక జాతీయ, ప్రాంతీయ సర్వేల ప్రాతిపదికన చూస్తే పవన్ పార్టీ వోట్ల చీల్చివేతకు పనికి వస్తుంది తప్పించి మరేమీ కాదని అర్థమవుతోంది. ఇక మరో విషయం - 2014 ఎన్నికల్లో సరళిని గమనిస్తే తెదేపా, భాజపా, జనసేన మద్దతుదారులందరి వోట్లు ఒకవైపే ఉండినవి. అదే సమయంలో వైఎస్సార్సీపీ మద్దతుదారుల వోట్లు (కాంగ్రెస్ వోట్ బ్యాంకు పూర్తిగా అటువైపు మళ్ళిందనుకోవచ్చు) ఆ వైపు పడ్డాయి. ఇపుడు వైఎస్సార్సీపీ తమ సాంప్రదాయ వోట్ బ్యాంకు తో పాటు, ప్రభుత్వ వ్యతిరేక వోట్ పై నమ్మకం పెట్టుకుంది. అప్పట్లో గంపగుత్తగా ఒకవైపు పడిన వోట్లు ఇపుడు తెదేపా, భాజపా, జనసేన + వామపక్షాలుగా చీలిపోయాయి. అదే సమయంలో వైఎస్సార్సీపీ సాంప్రదాయ వోట్ బ్యాంకు వారివైపు అలానే ఉంది. ఆ లెక్కన చూస్తే, ఈ ప్రభుత్వ వ్యతిరేక వోట్ అన్నది తెదేపా, భాజపా, జనసేన వోట్ బ్యాంకు నుండి పుట్టినదే అనుకోవాలి. అయితే ఆ చీలిక అన్నది ప్రతిపక్షం వైపు మళ్ళకుండా పవన్ ద్వారా అడ్డుకట్ట వేసి, ఎన్నికల అనంతరం కలిసిపోవాలన్నది వ్యూహంలా కనిపిస్తోంది. ఈ వ్యూహం ఎంతవరకూ పని చేస్తుందో చూడాలి. పవన్ పిల్లగాలిగా మిగిలిపోతాడా లేక రాష్ట్ర రాజకీయాల్లో సుడిగాలి అవుతాడా - చూద్దాం. 

Comments

  1. భ్రమరావతి గ్రాఫిక్స్ చూపించి ఆంధ్రాలో ఓట్లు దండుకోవాలని పైపెచ్చు రాహుల్ గాంధీని కీలుబొమ్మ చేసి దేశమంతా చక్రం తిప్పేద్దామని కలలు కన్న బాబు తన కొడుకు సీటుకే ఎసరు వచ్చేసరికి పవన్ సాయం తీసుకోకతప్పట్లేదు. విధి ఎంత బలీయం!

    ReplyDelete
  2. ఏడుపుగొట్టిముక్కలా, అమరావతి గ్రాఫిక్సని నువ్వు, మీ దొర, ఇక్కడున్న మీ దొర దోస్త్ చేసే ప్రచారాలకి, జనాలని బస్సుల్లో తీస్కెళ్ళి మరి చూపించారులే. జనాలకి తెలుసు ఏం జరిగిందో, పూర్తిగ జరగటానికి ఎంత సమయం పడుతుందో, మీరలాంటి భ్రమల్లోనే ఉండండి.

    ReplyDelete
    Replies
    1. అయ్యా అనానిమస్ గారూ, ఇలా దూషణలకు దిగటం బాగాలేదు. ఏదైనా విషయం ఉంటే, అది ప్రస్తావించండి. ఇక తాత్కాలిక నిర్మాణాలకు వందల కోట్లు తగలేసి, అవి కూడా కాస్త వర్షానికే అటూ ఇటూ అయ్యే తరహాలో కట్టినాయన ఇంక అంత పెద్ద రాజధాని నిర్మాణం చెయ్యలేడేమోనని అనుకుంటున్నారట. ఇక తమరు తదుపరి రిప్లై ఇచ్చేముందు, కనీసం పేరు చెప్పుకునే ధైర్యం చేస్తారని ఆశిస్తున్నాను.

      Delete
    2. "సింగపూరు తలదన్నే రాజధాని" వదిలేయండి కనీసం కాంగ్రెస్ హయాములో "ఉద్యమం" చేసిన కనకదుర్గ ఫ్లై-ఓవరు కూడా తయారు కాలేదు. ఎంతో టాంటాం చేసిన భ్రమరావతి-అనంతపురం ఎక్స్ప్రెవేకి అనుమతులు సైతం తెచ్చుకోలేకపోయారు. ఐదేళ్లలో వీళ్ళు సాదించిందల్లా ఒక్కటే: సభ్యత లేని అనామక భజన మండలిని పోగు చేయడం. అందుకే
      మంగళగిరిలో చినబాబుకు పోటీ పెట్టొద్దని పవన్ కాళ్ళు పట్టుకోవాల్సి వచ్చింది.

      Delete
    3. In India, construction is also labour intensive. Construction projects get delayed if labour strength is not sufficient.

      Delete
    4. ఇంతకీ మీ దొర ప్రామిస్ ల కత ఎమిటి ఏడుపుముక్కల? kg 2 pg ఉచితం ఏమయ్యింది? ఎంతమంది దళితులకు 3 ఎకరాలు ఇచ్చిండు? ఎంతమందికి 5 లక్షల 40 వేల రూపాయలో డబల్ బెడ్ రూం లు ఇచ్చిండు? హైదరాబాద్ ను డల్లాస్/ఇస్తాంబుల్ లాగా, కరీం నగర్ను లండన్/పారిస్ లాగా చేస్తానన్నాడు మరి అవి ఏమయ్యాయి? హుస్సేన్ సాగర్ ప్రక్షాణలన, మూసి మురికి కూడా వదిలించకపోయిన మీ దొర కు కాల్మొక్కుతూ నీ బాంచెన్ అని తర తరాలుగా దొర ల సేవలో తరించే బానిస ఏడుపుగొట్టు వెధవలు కూడా మాట్లాడే వాళ్లే!!!!

      Delete
    5. అయ్యా అనామకుడు గారూ, ఏదో మాట్లాడామని అనిపించుకోవడానికి తప్పించి మీరు మాట్లాడడానికి ఇక్కడ నా పోస్ట్ కు ఏమన్నా సంబంధముందా? అయినా మీరు దొర దొర అని ఆయన నామస్మరణం మానండి, నా అభిమానం లేదా వ్యతిరేకత అంతా విధానాల ప్రాతిపదికన తప్పించి వ్యక్తిగతం కాదు. అయినా, నేనిక్కడ ఎవరికీ మద్దతుగా మాట్లాడలేదు. ఇకమీదట మాట్లాడాలనుకుంటే, ముందుగా ధైర్యంగా మీ పేరు చెప్పుకోండి. లేకపోతే దయచేయండి

      Delete
    6. హేవిటో ... పేరు చెప్పుకునే ధైర్యం లేని ప్రతి అనామకుడూ, ఇంట ప్రస్ఫూటంగా రాసిన నా ధైర్యాన్ని ప్రశ్నించేవాడే

      Delete
  3. ఆశ్చర్యకరంగా పవన్ తన గొయ్యి తానే తవ్వుకుంటున్నాడు. పాతికేళ్ల రాజకీయ ప్రస్తానం కోసం వచ్చాను అని గొప్పలు చెప్పుకుంటూనే ఈ ఎలక్షన్స్ తర్వాతే తన ఉనికిని కోల్పోయే ప్రమాదాన్ని ఆహ్వానిస్తున్నాడు. యేదెప్పుడు మాట్లాడతాడో తనకే తెలియని విధంగా ఉంటున్నాడు. ఏ విషయంలోనూ క్లారిటీ అనేదే కనపడదు. ఏ విషయంలోనూ నిబద్దత కూడా అస్సలు కనిపించదు. (తాజా రుజువు నూజివీడు, విజయవాడల్లో సిపిఐ పార్టీకి కేటాయించిన సీట్లకు తన పార్టీ అభ్యర్థులను ప్రకటించడం). తనకేం కావాలో తానే తెలుసుకోలేని అయోమయం అతన్ని ఆవహించిందా అనిపిస్తోంది.

    టీడీపీ + పవన్ ఇద్దరూ కూడా కళ్ళు మూసుకుని పాలు తాగే పిల్లుల్లా ప్రవర్తిస్తున్నారు. అదే నమ్ముతున్నారు. ప్రజలను ఏమీ తెలుసుకోలేని దద్దమ్మలనుకుని తమ జ్ఞానాన్ని నిర్లజ్జగా, నిస్సంకోశంగా బయట పెట్టుకుంటున్నారు, అధికారమే అంతిమ లక్ష్యం అని నిస్సిగ్గుగా బహిర్గత పరుచుకుంటున్నారు. తన రాజకీయ భవిష్యత్తును ఫణంగా పెట్టి పవన్ ఈ విధంగా సాధించేదేమిటో అస్సలు అంతుబట్టదు. వెర్రిపప్పలెవరంటే తనను నమ్ముకుని తన వెంట నడిచేవారు. ఇక్కడ ఇంకో శోచనీయమైన విషయమేమిటంటే వాళ్ళ వాళ్ళ అభిమానులకు ఇదేమీ పట్టదు. తమ దారిలో తాము ఒకళ్ళనొకళ్ళు దుమ్మెత్తి పోసుకుంటుంటారు, తమ నాయకులిద్దరూ ఒకే కంచం, ఒకే మంచం అన్న విషయాన్ని చాలా కన్వేనియెంట్గా ప్రక్కన పెట్టేస్తూ -

    రిషి

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

... కరోనా కంటే ఎక్కువగా భయపెడుతున్న అంశం?

... మూడో కూటమి

... 2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు - జనసేన