అయ్యా అధ్యక్ష్యా, వేగులు అందించిన సమాచారం ప్రకారం గత రెండు రోజులలో విడుదలైన రెండు సినిమాలు ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటున్నాయి అని తెలుస్తోంది. వివరాలు ఇలా వున్నాయి ...
-> ఖైదీ నెంబర్ 150: ఇది అత్యంత సాధారణ చిత్రం, నాసిరకం అని తెలిసింది అధ్యక్ష్యా. కథ, కథనాలతో ఎటువంటి కొత్తదనమూ లేకపోయినా కేవలం 'బాస్ ఈస్ బ్యాక్' అంటూ పది సంవత్సరాల తరువాత చిరంజీవి పునరాగమనం అనే ఒకే ఒక్క అంశం ఆధారంగా ఈ చిత్రం బాహుబలియేతర రికార్డులనన్నింటినీ దుమ్ము దులుపుతూ ఒక సినిమా నటుడిగా చిరంజీవి సత్తా చూపుతోంది అని తెలుస్తోంది. అలాగే, ప్రజలు సినిమాలను రాజకీయాలను వేరుగా చూడటం అలవాటు చేసుకుంటున్నారు అని చెప్పటానికి, ప్రజల ఎదుగుదలను చూపటానికి ఈ చిత్రం ఒక ప్రామాణికంగా నిలబడుతుంది అని వార్తల సారాంశం.
-> గౌతమీపుత్ర శాతకర్ణి: ఈ చిత్రానికి దర్శకుడు క్రిష్ అనగానే బాలకృష్ణను వైవిధ్యంగా చూపుతాడని ఆశ కలిగినప్పటికీ క్రిష్ మాత్రం అటువంటి సాహసాల జోలికి వెళ్ళకుండా ఆవుకథ సిద్ధాంతాన్ని నమ్ముకుని చరిత్రను చెత్తలో పడేసి, ఎలాగూ సరియైన ఆధారాలు లేవు కాబట్టి తనకు తోచిన విధంగా రాసుకుని; రోమాంచిత యుద్ధపు సన్నివేశాలతో, ఉర్రూతలూగించే సంభాషణలతో నింపేసి తనకు అందని ద్రాక్షగా ఉన్న పెద్దస్థాయి వాణిజ్య విజయాన్ని సాధించాడు అని తెలుస్తోంది.

---> కానీ, వేగుల వారు అందించిన ఈ సమాచారం మమ్మల్ని గందరగోళానికి గురి చేస్తోంది అని తెలియజేస్తున్నాము. కారణమేమనగా, నోట్లరద్దు వలన జనాలు ఇబ్బందులు పడుతున్నారు తమ చిత్రాలను చూడటానికి రారేమో అని చిత్రపరిశ్రమ వారు భయపడ్డమాట నిజం. కానీ, ఈ రెండు చిత్రాలపై కురుస్తున్న కాసుల వర్షం (అంతేకాక బాలీవుడ్ లో దంగల్ విజయం) ఆ భయాలను తుత్తునియలు చేయటమే కాక ప్రభుత్వానికి ఇటువంటి మరిన్ని చర్యలు చేపట్టగలిగే ధైర్యం ఇచ్చింది. ఇది మరింత ముదావహం అని తెలియజేసుకుంటున్నాం.

Comments

Popular posts from this blog

... కరోనా కంటే ఎక్కువగా భయపెడుతున్న అంశం?

... మూడో కూటమి

... 2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు - జనసేన