ప్రశ్న: రైతులకు ఏమి చేశాడని రైతులపై సినిమా తీస్తారు?
ప్రతి
ప్రశ్న: అలా అయితే దయ్యంపై సినిమా తియ్యాలంటే చచ్చి దయ్యం కావాలా? అలాగే
సైనికులు, మాఫియా, కూలీలు, దేవతలు, లాయర్లు, డాక్టర్లు, ... ... ... తదితర
రంగాలపై ప్రధానపాత్రలతో సినిమా తియ్యాలంటే ఆయా రంగాల్లోని లేదా ఆయా రంగాలకు ఎదో చేసిన వారితోనే ఆ సినిమాలు తియ్యాలి
తప్పించి నటులు పనికిరారు. రాజులపై సినిమా తియ్యాలంటే రాజులే కావాలి కదా,
మరి ఈరోజుల్లో రాజులున్నారా? ఏ యుద్ధం చేశాడని ప్రభాస్, రానా మరియు
ప్రభాకర్ తదితరులు బాహుబలిలో యుద్ధ సన్నివేశాలలో నటించారు? అధ్యక్ష్యా, సమాధానం ఇవ్వాలని కోరుతున్నాం. ప్రతి ఇతర రంగంలానే నటన అన్నది కూడా ఒక ఉపాధి రంగమే.... మూడు బెత్తం దెబ్బలు
వంశీ కలుగోట్ల // ... మూడు బెత్తం దెబ్బలు // *************************************** ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూడు రాజధానులు ఉండవచ్చు అనగానే చాలామంది ఉలిక్కిపడ్డారు, మరికొంతమంది వెటకారాలు మొదలు పెట్టారు. ఇందులో చాలామంది గతంలో చంద్రబాబు అధికర మరియు అభివృద్ధి కేంద్రీకరణ చేస్తున్నాడని, అన్నీ అమరావతిలోని పెడుతూ మళ్ళీ మిగతా ప్రాంతాలకు అన్యాయం చేస్తున్నాడని అన్నవారే. జగన్ ముఖ్యమంత్రి కాకముందు హై కోర్ట్ కర్నూలుకు లేదా రాయలసీమలోని మరో ప్రాంతానికి (అనంతపూర్ వంటి వెనుకబడిన) ఇస్తే బావుంటుందని అలాగే తిరుపతి వంటి ప్రాంతాన్ని పాలిత కేంద్రంగా చేస్తే బావుంటుందని సూచనలు, సలహాలు ఇచ్చినవారే. ఇపుడు ఆ మేధావుల గత సూచనలకు తగినట్టుగానే అధికార మరియు అభివృద్ధి వికేంద్రీకరణ జరుగబోయే సూచనలు కనబడుతుంటే ఈ కావడం లేదు. - ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రానికే మూడు రాజధానులు అంటే మరి భారతదేశానికి 29 రాజధానులా అంటూ కొందరు వ్యాఖ్యలు చేస్తున్నారు. అయ్యా నాకు బట్టతల వచ్చింది కాబట్టి దువ్వెన అవసరం లేదు, అలాగని ఇంకెవ్వరికీ దువ్వెన అవసరం లేదని తీర్మానించేస్తే ఎలా? ప్ర...
Comments
Post a Comment