కొన్ని ప్రశ్నలు ...

కొన్ని ప్రశ్నలు ... 
********************
గత రెండు సంవత్సరాలలానే ఈసారీ లక్షల కోట్ల కొద్దీ ఒప్పందాలు, లక్షల ఉద్యోగాల కల్పన అంటూ ఈ సంవత్సరం జరిగిన సదస్సులో కుదిరిన ఎంఓయూల గురించి సంకలు గుద్దుకునే ముందు కొన్ని ప్రశ్నలు వేసుకుందాం ... 

-> గత రెండు సదస్సులలో కూడా లక్షల కోట్ల మేరకు ఎంఓయూలు కుదిరాయి, లక్షలాది ఉద్యోగాలు వస్తాయి అంటూ ప్రచారం జరిగింది. వాటిలో ఎన్ని వాస్తవ రూపం దాల్చాయి లేదా యే స్థాయిలో ఉన్నాయి?
-> ఎంఓయూలకు , పూర్తి ఒప్పందాలకు, కార్యాచరణకు ఉన్న తేడా నాకంటే మీకే బాగా తెలిసి ఉంటుందనుకుంటాను. మరి ఎంఓయూలకు ఇంతటి ప్రచారం, సంకలు గుద్దుకోవటం, అనవసర భ్రమలు కల్పించటం అవసరమా?
-> లక్షలకొద్దీ ఉద్యోగాలు వస్తాయంటున్నారు. అవి ఇటువంటివి? అందులో ఎన్ని స్థానికంగా అర్హత ఉన్నవారికి వచ్చే అవకాశాలు కల్పిస్తున్నారు? 
-> ఉద్యోగాలు అంటే పరిశ్రమ నిర్మాణంలో కూలీలుగానా లేక పరిశ్రమ ఏర్పాటయ్యాక సాంకేతిక నిపుణులుగానా? 
-> ప్రతి ఏటా ఇన్ని పరిశ్రమలు, ఇన్ని ఉద్యోగాలు అంటున్నారు. అవి నిర్మాణం పూర్తయ్యేలోపు తత్సంబంధిత నైపుణ్యాన్ని సంపాదించే శిక్షణ స్థానిక యువతకు కల్పించే సదుపాయాలూ ఏర్పాటు చేస్తున్నారా?
-> ఎటువంటి పరిశ్రమలు వస్తున్నాయి? వాటివలన స్థానిక వాతావరణంలో కానీ జీవన విధానంలో ఎటువంటి మార్పు అనగా పర్యావణానికి ఏమైనా హానీ జరిగే అవకాశం ఉందా? ఉంటే, దానిని తగ్గించటానికి ఎటువంటి చర్యలు చేపడుతున్నారు? 
-> గత రెండు సంవత్సరాలలో జరిగిన సదస్సులలో కుదిరిన ఎంఓయూలలో ఎన్ని వాస్తవ రూపం ధరించాయి లేదా యే స్థాయిలో ఉన్నాయి తత్సంబంధిత వివరాలతో ఒక శ్వేతపత్రం విడుదల చేయగలరా? 
-> పరిశ్రమల నిర్మాణానికి ముందుకు వచ్చిన కంపెనీలకు ప్రభుత్వం కల్పించిన రాయితీల విలువ ఎంత? 
-> ఏర్పాటవ్వబోయే ఆయా పరిశ్రమల ద్వారా ప్రభుత్వానికి కానీ, ఇతరత్రా వేరే రంగాలకు కానీ, స్థానిక జనాలకు కానీ జరిగిన లేదా జరుగబోయే మేలు ఎటువంటిదో తెలుపగలరా? 
-> ఎంఓయూలు కుదుర్చుకుంటున్న కంపెనీలలో స్థానిక కంపెనీలు ఎన్ని, విదేశీ కంపెనీలు ఎన్ని? వాటిలో స్థానిక కంపెనీలలో ఆయా రాజకీయ పార్టీల నేతలకు భాగస్వామ్యం కానీ, ప్రమేయం ఉందా? 

... సంకలు గుద్దుకోవటం పూర్తయ్యుంటే తిట్ల దండకం అందుకోకుండా వీటికి సవివరణాత్మకంగా వివరణ ఇవ్వగలిగితే సంతోషిస్తాం. (దయచేసి నాయకుడి గొప్పతనం గురించి కానీ, మీకు నచ్చని ప్రతిపక్షాలపై తిట్ల దండకం కానీ, వ్యక్తిగత ఇతరత్రా విమర్శలు కానీ ఈ ప్రస్నావళికి సమాధానాల్లో పోస్ట్ చేయవద్దని మనవి. పోస్ట్ చేస్తే తొలగించటం జరుగుతుంది.) కాస్త సంభాయించుకుని, నేలమీదకు దిగి చదువగలిగితే అవి కేవలం ఎదో విమర్శించాలని అడిగినవి కావని తమరికి అర్థం కాగలదు. కళ్ళకు పచ్చ ముసుగేసుకుని జాతి గొట్టాలలాగా చదివితే మాత్రం అందులో కేవలం ప్రతిపక్షపు ధోరణి కనబడుతుంది. చేతకాకపోతే ఆ పనే చెయ్యండి. 

--- ఇంతకు ముందు ప్రశ్నించావా? అని అడిగే వారికి ఇంతకు ముందు అడగకపోతే ఇప్పుడు అడగకూడదా? ఇప్పుడు అడిగితే చెప్పరా? నేను ఇంతకుముందు అడిగాను, ఇప్పుడు అడుగుతాను, ఇకమీదట కూడా అడుగుతాను. కేంద్ర ప్రభుత్వానికీ ఇటువంటి ప్రశ్నలే ట్విట్టర్ ద్వారా, నాకు తెలిసిన మార్గాల ద్వారా అడిగాను. ఇంతవరకూ సమాధానం రాలేదు, ఇప్పుడు పై ప్రశ్నలకు కూడా సరియైన సమాధానం వస్తుందన్న నమ్మకం ప్రస్తుతానికి లేదు. చూద్దాం ... 

Comments

Popular posts from this blog

... కరోనా కంటే ఎక్కువగా భయపెడుతున్న అంశం?

... మూడో కూటమి

... 2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు - జనసేన