... కవిత్వానికి ఖాళీ కావాలి

వంశీ కలుగోట్ల // ... కవిత్వానికి ఖాళీ కావాలి //
***************************************
          కథలు, నవలలు లాంటి వచన పుస్తకాలలో సాధ్యమైనంత వరకూ పుటల్లో ఖాళీ లేకుండా చూసుకుంటారు. కానీ, కవిత్వ పుస్తకాలలో అలా కాదు. ఒక్కో పుటలో దాదాపు సగభాగం ఖాళీగానే ఉంటుంది. కవిత నిర్మాణమే వాక్యాన్నిఅర్థపూరితంగా, భావవంతంగా విడగొట్టడంలోనే ఉంది కదా అనిపిస్తుంది. ఇక ఈ కవిత్వ పుస్తకాలలో ఖాలీ గురించి, మరీ ఎక్కువగా ఆలోచించకపోయినా నేను అప్పుడప్పుడూ అనుకునేవాడిని 'ఇంత స్థలం వృధాగా పోతోంది కదా' అని. కవిత్వ పుస్తకాలు అనే కాదు, కాగితాల్లో కవితలు రాసుకునేపుడు - రాసిన కవిత చూసుకున్న సంతృప్తితో పాటు, ఖాళీగా మిగిలిన జాగా చూసినపుడు ఏదో తెలియని అసంతృప్తి, ఇదమిద్ధంగా ఇదీ అని చెప్పలేనిది. 
         ఇపుడు శ్రీశ్రీ గారి ఆత్మ చారిత్రాత్మక చారిత్రిక నవల 'అనంతం' చదువుతున్నాను. అందులో నిన్నచదివిన భాగంలో శ్రీశ్రీ గారు ఈ అంశానికి సంబంధించి ఒక వివరణ ఇచ్చారు "'... ప్రతి పేజీలోనూ గీతం ఆక్రమించిన జాగా కొంచమూ, ఖాళీ స్థలం బోలెడూనూ! ఈ ఖాళీ జాగాల్లోనే సిసలైన కవితాపదార్థం దొరుకుతుందని పాల్ ఎల్వర్డ్ అన్నారు. దరిమిలానూ ఆ ఖాళీ జాగాను నా కామెంట్స్ తో నింపేసాను ... కవిత్వాన్ని గుర్తించడానికదో సులువైన మార్గం అనుకుంటాను ఈ ఖాళీ జాగాలను వదలడం! అందుకే ఏ భాషలోనైనా కావ్యగీతాల చుట్టూ బోలెడు ఎంప్టీ స్పేస్ ఉంటుంది. అదో అనంతాకాశం ...". నిజమే కదా అనిపించింది. నేనెప్పుడూ ఏ కవిత్వ పుస్తకంలోనూ శ్రీశ్రీ గారిలా కామెంట్స్ రాసుకోలేదు కానీ, శ్రీశ్రీ గారు చెప్పినది నా ఆలోచనలకు దగ్గరగా ఉన్నట్టనిపించింది.

వలసకూలీల పాదాలు 
ఆకలితో ఎండుతున్న కడుపులు 
కూలిపోతున్న బతుకులు 
ఆదుకుంటున్న మనుషులు   
మాటలు చెప్పే పాలకులు 
ఫిడెల్ వాయించుకునే నీరోలు 
కాదేదీ కవితకనర్హం 

రాయడానికి ఏదైనా రాయొచ్చు 
కానీ, కవిత్వానికి ఖాళీ కావాలి
... అర్థం చేసుకోవడానికి ఆలోచనలో
... స్ఫూర్తి పొందటానికి మనసులో
... నింపుకోవటానికి కాగితంలో

Comments

  1. మీ పరిశీలన సరైనదే . కవిత్వం కప్పి చెబుతుంది. వచనం విప్పి చెబుతుంది అంటారు. కవిత్వం లో కొన్ని ఖాళీలు పాఠకుడు పూరించుకోవాలి. Poetry is best left open ended. It leaves something to reader's imagination

    ReplyDelete
  2. శ్రీ శ్రీ లేని కవిత్వమేలా..... నిజమే అనిపిస్తుంది... రాయాల్సిన వస్తువు ఉన్నా ఒక్కోసారి ఉపశమనం కోరుకుంటున్నట్లు ఉంటుంది. ఆ తరువాతే అది పూర్తి పరిపక్వతను పొందుతుంది.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

... కరోనా కంటే ఎక్కువగా భయపెడుతున్న అంశం?

... మూడో కూటమి

... 2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు - జనసేన