... రాజకీయాలే గెలుస్తాయి
వంశీ కలుగోట్ల // ... రాజకీయాలే గెలుస్తాయి //
****************************************
భవిష్యత్తులో ... అనగా తరువాతి వీలయితే వర్షాకాల లేదంటే సీతాకాల శాసనసభాసామావేశాల సందర్భంగా అధికార ప్రతిపక్ష నేతల తీరు ఈ విధంగా ఉండవచ్చునని ఒక ఊహ - ఇందులో బల్ల చరచడాలు, అసభ్యపదాలు, అడ్డం తగిలేవారి ప్రస్తావన లేకుండా ఊహించడం జరిగింది అని గమనించగలరు
సభాపతి: విశాఖ విషవాయువు లీకేజీ ఘటనపై చర్చకు అనుమతిస్తున్నాం. సభ్యులందరూ సభాసంప్రదాయల ప్రకారం నడుచుకుని, చర్చించండి
ముఖ్యమంత్రి: అధ్యక్ష్యా మాకు సభా సంప్రదాయాలంటే ఎంతో గౌరవం. మేము మాట ఇస్తున్నాం అధ్యక్ష్యా, సభా సంప్రదాయాల ప్రకారం నడుచుకుంటామని. అధ్యక్ష్యా మేము మాట ఇస్తే మడమ తిప్పమని ఈ సందర్భంగా మనవి చేసుకుంటా ఉన్నాను అధ్యక్ష్యా. ఇక పొతే ... మనం ఒకటి గమనించాలి అధ్యక్ష్యా. విశాఖపట్నంలోని ఎల్జి పొలిమెర్స్ లో జరిగిన గ్యాస్ లీకేజీ ఒక దురదృష్టకర సంఘటన. అధ్యక్ష్యా ఈ ఘటనలో మేము వెంటనే స్పందించి చర్యలు తీసుకుని, బాధితులకు అండగా ఉన్నామని తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష్యా. గతంలో ఎపుడూ, ఎక్కడా జరగని విధంగా, ఎవరూ ఇవ్వని విధంగా మరణించిన వారికి కోటి రూపాయలు ఇవ్వడం జరిగింది
... ఇలా మాట్లాడుతూ ఉండగానే ప్రతిపక్షం నుండి ప్రధాన ప్రతిపక్ష నేత, ఆయన పక్కనుండే లావాటి ఆయన ఇలా అందరూ గొడవ చేస్తూంటే ముఖ్యమంత్రి ఆవేశంగా
'అధ్యక్ష్యా .. వారు మాటిమాటికీ అడ్డు తగులుతున్నారు. వారినే మాట్లాడమనండి, వారు మాట్లాడాక నేను మాట్లాడతాను. నేను వారిలా కాదు అధ్యక్ష్యా, మాకు విలువలున్నాయి' అని చెప్పి కూచుంటారు. అపుడు ప్రతిపక్ష నేత లేచి మాట్లాడటం మొదలెడతారు
ప్రధాన ప్రతిపక్ష నేత: అధ్యక్ష్యా ఈ ముఖ్యమంత్రికి గౌరవం ఇవ్వడం తెలీదు అధ్యక్ష్యా. దేశంలోనే సీనియర్ మోస్ట్ నాయకుడిని నేను, నాకు విలువల గురించి చెప్తారా ఈయన? అసలు ఏమనుకుంటున్నారు ఈయన? నాకు చెప్పేంతటివాడా
... అని మాట్లాడుతూంటే సభాపతి కల్పించుకుని విశాఖ అంశం మీద మాట్లాడమని చెప్తారు.
అధ్యక్ష్యా విశాఖ గ్యాస్ లీకేజీ ఘటనలో ప్రభుత్వం తీరు అసలు బాలేదు అధ్యక్ష్యా. ఈ ముఖ్యమంత్రి నిర్లక్ష్యంగా వ్యవహరించారు. చనిపోయినవారికి కోటిరూపాయలిచ్చానని అంటున్నారు, ఎన్ని కోట్లిస్తే చనిపోయిన వారిని తీసుకురాగలరు అధ్యక్ష్యా? ఆయన ఫ్యాక్టరీకి కాకుండా, హాస్పిటల్ కు వెళ్ళారు, నాలాంటి అనుభవజ్ఞుడైతే ఫ్యాక్టరీకి వెళ్ళేవాడు అధ్యక్ష్యా
... అపుడు ముఖ్యమంత్రి కల్పించుకుని
ముఖ్యమంత్రి: అధ్యక్ష్యా ఇపుడు ఒక వీడియో చూపించటానికి అనుమతివ్వండి (అనుమతి ఎలాగూ దొరుకుతుంది కాబట్టి, సిబ్బంది ముందే సిద్ధంగా ఉంటారు)
వీడియోలో
గతంలో చంద్రబాబు గారు ఏయే ప్రమాదాల సమయంలో ఎలా స్పందించారు, పరిహారం ఎంతిచ్చారు ఇత్యాది వివరాలన్నీ ఉంటాయి
... అవన్నీ చూపించాక ముఖ్యమంత్రి ప్రతిపక్షనేతకు 'ఈయనా మాకు చెప్పేది' అని ఎగతాళి చేస్తారు. ప్రతిపక్షం ముఖ్యమంత్రి మరియు అధికార పక్షతీరుపై నిరసన వ్యక్తం చేస్తూ, పత్రికసమావేశంలో శివాలెత్తుతారు.
... ఆ విధంగా దిగ్విజయంగా మరోమారు ప్రధాన సమస్య పట్ల చర్చ పక్కదోవ పట్టి, రాజకీయాలే గెలుస్తాయి. ఏ డౌట్స్
Yes. You said right!! ఇంతకంటే ఏమీ జరగదు.
ReplyDeleteHa ha. చాలా బాగా వ్రాశారు.
ReplyDeleteశాసన సభలో ఒకరితో ఒకరు నేరుగా మాట్లాడ కూడదు అని ఏదైనా నియమం ఉందేమో తెలియదు. సభాపతిని మాటి మాటికి అధ్యక్షా అధ్యక్షా అంటూ అన్యాపదేశంగా ఒకరినొకరు నిందించు కోవడం కామెడీ గా చిరాకుగా అనిపిస్తుంది.
Ha ha ... true, don't know why they do that, looks really funny
DeleteStandard legislative protocol all over the world to address the Chair
DeleteYes Jai garu ... but, manollu daanni over gaa vaadi comedy peice laa chesaaru
Delete