... నాణేనికి రెండు వైపులుంటాయి డ్యూడ్
వంశీ కలుగోట్ల // ... నాణేనికి రెండు వైపులుంటాయి డ్యూడ్ //
***************************************************
కొద్దిరోజులుగా ఈ మెసేజ్ వాట్స్ యాప్ లో చక్కర్లు కొడుతోంది, సంక్షేమపథకాల ఆవశ్యకత పెరుగుతున్న ఈ తరుణంలో మరీ ఎక్కువైంది. ఇది అంత సమంజసమైనదిగా అనిపించలేదు, అందుకే నాకు అనిపించింది చెప్పాను
విషయం (వాట్స్ అప్ మెసేజ్ ద్వారా వచ్చినది)
---------------------------------------------------
40వేలు జీతంతో చావలేక బతుకుతున్న మధ్య తరగతి మనిషి... అంతరంగం..
నువ్వు నిజాయితీగా కట్టే TAX వల్ల...
అమ్మ వడి 15000 నీకు రావు ఐటీఐ,డిగ్రీ చదివే పిల్లలువుంటే వసతి 15000 రావు...
రైతు భరోసా 12000 రావు....
పంట కోసం రుణం తీసుకుంటే రుణమాఫీ నీకు రాదు..టైం బాగా లేక పంట సరిగా పండక పోతే మద్దతు ధర నీకు రాదు....
బియ్యం కార్డు నీకు రాదు (20kgx50rsx12months)--12000 పెట్టి బియ్యం కొనాల్సిందే
ఉగాదికి ఇళ్ల స్థలం నీకు రాదు
ఇల్లు కట్టాలంటే ప్రభుత్వం ఇచ్చే 2లక్షల రూపాయలు నీకు రావు
డబుల్ బెడ్ రూమ్ ప్లాట్ నీకు ఇవ్వరు
ఆరోగ్య శ్రీ కార్డ్ నీకు యివ్వరు
ఎంత బిల్లు ఆయినా నువ్వు కట్టాల్సిందే
నీకు ఇన్కమ్ సర్టిఫికెట్ ఎక్కువ ఉంది కాబట్టి నీ పిల్లల ఫీజు... నువ్వు కట్టాలి...
ఇక నీపిల్లలు ఇంజనీరింగ్/ MBBS చదువు? ఒక కల
అందుకే పని పాట మానేసి ఊరికే ఉంటే ...
టాక్స్ కట్టే పని లేదు....ప్రభుత్వం నుండి నిరుద్యోగ భృతితోపాటు పైన నేను చెప్పినవన్నీ పొందొచ్చు....
కష్టపడి జాబ్ చేసి...సంవత్సరం చివర నీకు మిగిలింది ఏంది....బజాజ్ ఈఎంఐ(EMI) లు తప్ప...
నెలకు జీతం 40 వేలు అనుకో
ఇంటి అద్దె 6000
పాలు. 1800 1లీ 60 రూ
కరెంట్ బిల్. 1000
రైస్ 50 kg x50rs 2500
కూరగాయలు 1000
ఆయిల్..వగేరా. 3000
సండే చికెన్. 4వాx200. 800
కార్ లేక బైక్ పెట్రోల్.3000- 5000
పిల్లల ఫీజు. 2000x2 నెలకి
(LKG కూడా 20వేలు కాబట్టి ఒక్కడికి)
(నాకు ఇద్దరు పిల్లలు కాబట్టి నెలకు 4000 వేలు)
పిల్లలకి ప్రతి నెల హాస్పిటల్స్ కి 2000 అవతాయి..
ఆరోగ్య శ్రీ లేదుగా ఇన్సూరెన్స్ కట్టాలి...
నెలకు 4లుగురికి 4000 వేలు....
ఇప్పటికే 30 వేలు అయి0ది.. నెలకు మినిమం ఖర్చు....ఇక పండగలు పెళ్లిళ్లు/ బర్త్ డే లు
అమ్మ వాళ్ళ ఊరు...
అత్తగారి ఊరు ప్రయాణాలు...ఖర్చులు....
ఇవన్నీ కాక....40వేల జీతం కదాఅని పెళ్ళాం వచ్చి
మంచి ఫోన్ కొను
ఏసీ కొను
ఫ్రిడ్జ్ కొను
వాషింగ్ మెషీన్ కొను
సోఫా కొను
గోల్డ్ కొను
బొక్క కొను
భూషణం కొను
అంటే ఉంటాయా.......ఏమన్నా అంటే
40వేలు జీతం ఎమ్ చేస్తావ్ అంటారు...
సరే...ఏదో అడుగుతుందిగా అని BANKకి వెళితే ....టాక్స్ రిటర్న్స్ కట్టిన కాగితాలు తీసుకురా అంటాడు...
ఎమి మిగిలింది అని టాక్స్ కట్టడానికి....40వేలు అయిపోయి ...పక్కన ఫ్రెండ్ ని అడుగుదాం అంటే వాడిపరిస్తితి అంతే....
సరే అడిగింది కదాఅని బజాజ్ లో EMI లోకొంటె మల్ల నెలనెలా వాడి గోల.. కాస్త జీతం లేటఇతే.. ఎవర్ని అడిగినా...ఇదేమాట...నేను కట్టాలి బ్రో అని
ఎలాగోలా టాక్స్ కడుతూ నెట్టుకొస్తుంటే ఒక రోజు ఫంక్షన్ కి చుట్టాలు వచ్చి...
అయ్యా 40వేలు జీతం కదా ...
స్థలం కొన్నవా....
ఇల్లు కట్టవా అని...
(ఎందిరా ఈగోల....) 40వేల జీతంతో స్థలం కొనలేం...ఇల్లు కట్టలేం...
ప్రభుత్వం స్థలం ఇవ్వదు.... నేను కొనలేను..
ప్రభుత్వం డబుల్-బెడ్-రూమ్ ఇల్లు ఇవ్వదు....నేను కట్టలేను...
40వేలు జీతంతీసుకుని నేను పీకింది ఏంది.....
జాబ్ మానేసి.....కాళీగా ఉంటే....పైన చెప్పిన వన్నీ వస్తాయి....ఏ గోల ఉండదు.....
ఇంకొక ముఖ్య విషయం
చిన్నప్పటి నుంచి గవర్నమెంట్ స్కూల్లో చదివి గవర్నమెంట్ హాస్పిటల్ లో చికిత్స పొంది అన్ని ఫ్రీ గా పొంది ఇప్పుడు పరాయి దేశాలకు వెళ్లి ఉద్యోగం చేసుకునే వాళ్లందరికీ ఈ పైన చెప్పినవి అన్ని దొరుకుతున్నాయి ఎంత విచిత్రమో ఇదండి మన భారతదేశంలో బ్రతుకు ఉన్నటువంటి మధ్యతరగతి మనుషుల ఆవేదన ఆక్రందన
సేకరణ:- WhatsApp
***************
దానికి నా వివరణ/సమాధానం దిగువన చదవండి
-------------------------------------------------------
హ హ ... చదవగానే నిజమనిపించేలా ఉంటాయిలాంటివన్నీ. ఇలాంటివన్నీ నాణేనికి ఒకవైపు లాంటివి, నేను కేవలం మన రాష్ట్రం గురించి లేదా మన దేశం గురించి మాత్రమే మాట్లాడటం లేదు. ఉదాహరణకు అమెరికా, ఇంగ్లాండ్ లాంటి దేశాలలో నిరుద్యోగ భృతి ఉంటుంది - చాలా ఉద్యోగాలలో వచ్చే జీతం కంటే నిరుద్యోగభృతి ఎక్కువగా ఉంటుంది. కానీ, ఎందుకు జనాలు పని చెయ్యకుండా నిరుద్యోగ భృతి తీసుకోవడం మీద ఆసక్తి చూపటం లేదు. ఇక, పై మెసేజ్ లో ప్రస్తావించబడిన ప్రతి ఒక్క పథకం (అలాగని నేను కేవలం మన రాష్ట్రం గురించి మాత్రమే అనట్లేదు, అలాగే ప్రస్తుత ప్రభుత్వం గురించి మాత్రమే కాదు - జనరల్ గా)
మెసేజ్ లో ప్రస్తావించబడిన అంశాలను పరిశీలిస్తే
- నిజానికి రూ. 40000/- జీతం ఎంతమందికి వస్తోంది? 20 వేలకు కాస్త అటూ, ఇటూగా వచ్చే వారు చాలామంది నాకు తెలుసు. ఇక 40000 వచ్చేవారందరూ మధ్యతరగతివారా లేక 40 వేలు వచ్చేవారందరూ నిజాయితీగా ఉంటారా? అసలు మన దేశ (మన దేశం అనే కాదులే, కానీ ఇక్కడ టాపిక్ మన దేశం కాబట్టి) పౌరులలో టాక్సబుల్ ఇన్కమ్ వస్తున్నవారిలో ఎంతమంది నిజాయితీగా టాక్స్ కడుతున్నారని అనుకుంటున్నావు? టాక్సబుల్ ఇన్కమ్ వస్తున్నవారిలో 90% మందైనా నిజాయితీగా ఆదాయానికి తగిన టాక్స్ కడితే మన దేశ ఆర్థికావసరాలలో కనీసం పాతికవంతు తీరతాయి అని ఒక అంచనా
- అమ్మఒడి, రైతు భరోసా, ఇంటి స్థలం, రేషన్ కార్డు, డబల్ బెడ్ రూమ్ ఇల్లు వంటి పథకాలు అనే కాదు అసలు ఏ పథకమైనా ఖచ్చితంగా నిబంధనల ప్రకారం అమలు పరుచబడుతుందని నీవనుకుంటున్నావా? అవన్నీ రిజర్వేషన్ సిస్టం లాంటివే, వాటిని తీసేయలేరు అలాగని కొనసాగించడం కష్టం. అందుకే ఎక్కడో అక్కడ ఏదో రకంగా కట్ చేయడం జరుగుతుతుంది, అలాగే అధికారపార్టీ అనుయాయులకు పందేరం చేసుకునే అవకాశాలూ ఉన్నాయి
- ఇక పిల్లల చదువుల గురించి, చదువును చదువులాగా కాకుండా ఇతరులతో పరుగు పందెంలా భావిస్తున్నావా? చదువు అంటే ఐఐటీ, డాక్టర్, ఇంజనీర్ ఇవేనా? ఇంకేం లేవా? నిన్ను నీవు ఒక వృత్తంలో బంధించుకుని, ఎవరినో ఎందుకు తిడతావు? ఒక్కసారి నీ ఆలోచనా పరిధి నుండి బయటకురా - ప్రపంచం ఎంత విశాలమైనదో తెలుస్తుంది, ప్రపంచం దాకా ఎందుకు నీవున్న ఊరి గురించే సరిగా తెలియని పరిస్థితిలో ఉన్నావు
ఇక చివరి పేరా గురించి - ఎవరికి దొరకట్లేదో, ఎవరికి దొరుకుతున్నాయో నిర్ధారించేంతటి పరిజ్ఞానం, సమాచారం నీ వద్ద ఉందా? మీ ఊరిలో ఎన్ని వీధులు తిరిగి తెలుసుకున్నావు? ఎన్ని ఊర్లు తిరిగావు? ఎన్ని రాష్ట్రాల్లో తిరిగి తెలుసుకున్నావు? ఎన్ని దేశాల్లో తిరిగి తెలుసుకున్నావు?
చివరగా ఒక్కటి అడుగుతాను - నువ్వు చదువుకునేప్పుడు నీ క్లాసులో ఎంతమంది ఉండేవారు - ఓ 30 లేదా 40 మంది? వారిలో ఇపుడు ఎవరెవరు ఏమేం చేస్తున్నారో తెలుసా? మీ క్లాస్ టీచర్స్ అందరికీ ఒకేరకంగా పాఠం చెప్పినా - ఒక్కొక్కరు ఒక్కోలా - అంటే కొందరు ఎందుకు బాగా సంపాదించగలుగుతున్నారు? కొందరు ఎందుకు సంపాదించలేకపోతున్నారు? లోపం ఎవరిది? లోపం నీలోనో, వ్యవస్థలోనో కాదు - ఇద్దరిలోనూ ఉంది. నేను గవర్నమెంట్ స్కూల్ లో చదువుకున్నాను, ప్రైవేట్ కాలేజీలో చదువుకున్నాను, ఉద్యోగరీత్యా విదేశాలకు వెళ్ళాను - వ్యక్తిగతంగా ఇప్పటివరకూ నేను ఏ ఒక్క ప్రభుత్వ సంక్షేమపథకాన్నీ ఉపయోగించుకోలేదు, వాటి అమలులోని లోపాలను వాడుకోలేదు, ఏ ఒక్క ప్రత్యేక తరగతి సబ్సిడీ అందుకోలేదు - నేను ఇలా అంటే నీవంటావేమో 'అందరూ నీలా ఉండరు' అని. That's what exactly I am saying, not everyone acts the same way. అందరూ నాలానో లేక నీలానో ఉండరు. మరొక విషయం సంక్షేమ పథకాలు ఉపయోగించుకునేవారందరూ ఖాళీగా కూచుని హీక్కుంటున్నారనుకుంటే అంతకంటే అమాయకత్వం ఉండదు, ఆ మూర్ఖత్వం నుండి త్వరగా బయటకురా ...
ముక్తాయింపు
ఇపుడు ఈ మెసేజ్ చదవగానే (అంటే చదివితే, చదివినా స్పందించే అలవాటుంటే) కొందరు విమర్శిస్తూ, కొందరు సమర్థిస్తూ వ్యాఖ్యలు చేయవచ్చు. వారందరకూ నేను చెప్పొచ్చేదేంటంటే డ్యూడ్ 'అందరూ ఒకేలా ఉండరు' - నీకు అర్థమైంది తప్పు కాకపోవచ్చు, నేను అర్థం చేసుకున్నది కూడా తప్పు కాకపోవచ్చు. మ్యాటర్ ఏంటంటే నాణేనికి రెండువైపులుంటాయి.
ముప్పైకోట్లు మందికి సరిపడే భూమిలో నూట ముప్పై కోట్లు జనాభా ఉంటే ఎక్కడి వనరులు సరిపోవు. మన దేశం జనాభా తగ్గుముఖం పడితే 30-40 ఏళ్ల తరువాత కొంచెం జీవనం మెరుగు పడుతుంది.
ReplyDeleteAnother factor is huge military spending. If the border disputes with neighbouring intransigent countries are solved and peace prevails, the military budget can be reduced and can be utilized for welfare of people.