... రెండు మాటలు

వంశీ కలుగోట్ల // ... రెండు మాటలు //
********************************
            మొదటిది - ప్రధానమంత్రి మాట్లాడిన ప్రతిసారీ ముఖం చాలా బాధగా పెట్టి, ఏదేదో మాట్లాడుతున్నారు కానీ వలసకూలీల సమస్యల గురించి ప్రస్తావించటం లేదు. స్వాన్ (స్ట్రాండెడ్‌ వర్కర్స్‌ యాక్షన్‌ నెట్‌వర్క్‌) దేశవ్యాప్తంగా ఏప్రిల్‌ 9వ తేదీ వరకు (ఇవాళ 29 వ తేదీ, ఈ ఇరవై రోజుల్లో ఇంకెన్ని జరిగాయో అధికారిక లెక్కలు నాకైతే తెలియదు) 11 వేల మంది వలస కార్మికులను విచారించగా లాక్‌డౌన్‌‌ కారణంగా 189 మంది వలస కార్మికులు మరణించారు. వీరిలో ప్రయాణంలో ప్రాణం విడిచిన వారు, ఆకలితో మరణించినవారు, స్వీయమరణాలు పొందిన వారు ఉన్నారు. దేశవ్యాప్తంగా చిక్కుకుపోయిన లక్షలాది మంది వలస కార్మికుల్లో కేవలం ఆరు లక్షల మందికి వసతి కల్పించినట్లు, దాదాపు 22 లక్షల మందికి ఆహారం అందజేస్తున్నామని కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్‌ ఒకటవ తేదీన సుప్రీం కోర్టుకు తెలియజేసింది. ‘స్వాన్‌’ నిర్వహించిన సర్వే ప్రకారం 84 శాతం వలస కార్మికులకు యాజమాన్యం వేతనాలు చెల్లించలేదు. వారిలో 98 శాతం మంది ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆర్థిక సహాయం పొందలేదు. 70 శాతం మందికి రేషన్‌ అందలేదు. 50 శాతం మందికి తినడానికి తిండి, చేతిలో చిల్లి గవ్వా లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం నుండి అధికారికంగా వారికి ఊరటనిచ్చేటటువంటి ప్రకటన గానీ, చర్యలు గానీ లేకపోవటం బాధాకరం. కరోనా విపత్తు కావచ్చు, కానీ ఆకలి మరియు పేదరికం అన్నవి కరోనాను మించిన విపత్తులు. 
            రెక్కాడితే కానీ డొక్కాడని బతుకులు మన దేశంలో లక్షలకొద్దీ ఉన్నాయి - వారి పరిస్థితి ఏంటన్న కనీస కార్యాచరణ ప్రణాళిక, ఆలోచన, ఆచరణ లేకుండా కరోనా భయం చూపి లాక్డౌన్, నిబంధనలు అంటే అది సమాజంలో అశాంతికి కారణం కాగలదు. కరోనా (లేదా కోవిద్ 19) కంటే ఎక్కువగా సామాజిక అశాంతి దేశాన్ని దెబ్బ తీయగలదు. వలస కార్మికులకు ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ఆహారం మరియు ఉపాధి చూపలేకపోతే అది దేశాన్ని దారుణమైన పరిస్థితుల్లోకి నెట్టేయగలదు. మాటలగారడీ పక్కనబెట్టి, ఈ విషయంలో చిత్తశుద్ధితో ఆచరణ దిశగా మోదీ ప్రభుత్వం చర్యలు చేపట్టవలసిన ఆవశ్యకత ఉంది.    

*
            రెండవది - తెలంగాణాలో ఎందుకు కరోనా నిర్ధారిత టెస్ట్స్ సంఖ్య పెంచటం లేదు? తెలంగాణ కంటే ఎన్నో తక్కువ కేసులు నమోదు అయిన, కేసులు పెరుగుదల తక్కువగా ఉన్న కర్ణాటక (42964 టెస్ట్స్) వంటి రాష్ట్రాలు కూడా తెలంగాణ (19000+ టెస్ట్స్) కంటే ఎక్కువ స్థాయిలో టెస్ట్స్ చేస్తున్నట్టుగా ఉంది. అంతేకాక సౌత్ కొరియా నుండి 80 వేల ఉన్నతశ్రేణి టెస్ట్ కిట్స్ ఆర్డర్ చేసింది. కానీ, తెలంగాణ మాత్రం టెస్ట్స్ నిర్వహించే తీరులో నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోంది. ఉదాహరణకు రెండు రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ 6500+ టెస్ట్స్ చేయగా, తెలంగాణ 150 టెస్ట్స్ చేసింది. ఆర్థికంగా తెలంగాణ కంటే ఎంతో వెనుకబడిన ఆంధ్రప్రదేశ్ 11 ఉన్నత స్థాయి టెస్ట్ సెంటర్స్ ను ఏర్పాటు చేసుకోగలిగింది. మరి తెలంగాణ ఎందుకు చేసుకోలేకపోతోంది? తెలంగాణాలో నాలుగు టెస్ట్ సెంటర్స్ ఉన్నాయని చదివినట్టు గుర్తు. రికవరీ రేట్ పరంగా తెలంగాణ మెరుగ్గా ఉంది కానీ, విస్తృతస్థాయిలో పరీక్షలు చేయకపోతే, నిబంధనలు దశలవారీగా సడలిస్తారని అంటున్నారు కాబట్టి వైరస్ విస్తృతి రానున్న రోజుల్లో మరింత సమస్యాత్మకంగా మారే అవకాశం ఉంది. కెసిఆర్ ప్రెస్ మీట్ లో మాట్లాడిన తీరుకు కొట్టే చప్పట్ల శబ్దం తగ్గితే, ఇవన్నీ వినబడవచ్చు లేదా కనబడొచ్చు. పరిస్థితి చూస్తోనే తెలంగాణాలో మెరుగ్గా ఉన్నది పరిస్థితులు అనేకంటే కెసిఆర్ ప్రెస్ మీట్స్ అని చెప్పాలేమో అనేలా ఉంది. 
            మిగతా రాష్ట్రాలు ఎన్నో ఉండగా ఒక్క తెలంగాణను మాత్రమే ఈ విషయంలో ప్రస్తావించడం ఎందుకు అంటే - హైదరాబాద్ లో కేసెస్ సంఖ్యా చూస్తే తెలుస్తుంది. అలాగే, ప్రజల తీరు కూడా. అయినా కూడా రాష్ట్రం మొత్తం మీద ఒక రోజులో కేవలం 150 పరీక్షలే చేశారంటే (ఎక్కువగా అంటే దాదాపు 500/600 చేస్తున్నారు) అది నిర్లక్ష్యమనుకోవాలా, నిర్వహణలోపం అనుకోవాలా - లేక మరేమిటి? కొన్నిరోజుల క్రితం మినిస్ట్రీ అఫ్ హోమ్ అఫైర్స్ కూడా ఇదే అభిప్రాయం వెలిబుచ్చింది - హైదరాబాద్ నగరంలో సరైన సంఖ్యలో పరీక్షలు జరిగితే గానీ అసలు పరిస్థితులు అర్థం కావు, కేసులు విపరీతంగా పెరగవచ్చు అని. తెలంగాణాలో చాలా రాష్ట్రాల కంటే మెరుగైన వైద్య సదుపాయాలున్నాయి కాబట్టి, కోలుకుంటున్న వారి సంఖ్య ఎక్కువగా ఉండటం మరియు మరణాల సంఖ్య తక్కువగానే ఉండటం సంతోషకరమైన విషయం. కానీ, తెలంగాణాలో కోవిద్ 19 పరీక్షల సంఖ్య పెంచవలసిన ఆవశ్యకత మాత్రం ఉంది. ఆ దిశగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. ఎన్ని నిర్వహణా లోపాలున్నా కెసిఆర్ ఒక్కక్క ప్రెస్ మీట్ పెడితే చాలు అనే ధోరణి సరికాదు. ఆలోచించండి. 

Comments

  1. నేను చూసిన లెక్కల ప్రకారం దేశంలో జరిగిన టెస్టులు 716,733 కాగా తెలంగాణాలో 19,063 అనగా 2.7%; దామాషా ప్రకారం తక్కువేమీ కాదు.

    పొతే కాస్త SQC థియరీ:

    Random testing is advised only in well distributed databases, especially if when causal factors are not certain. Biased sampling is more effective for assignable defects in a data model considered to be accurate.

    ReplyDelete
    Replies
    1. కాదండీ, చాలా తక్కువ. మర్కజ్ నుండి  ఆంధ్రప్రదేశ్ కంటే తెలంగాణాలో ఎక్కువ, అంతేకాక అసలు నంబర్స్ తెలీవు. పాతబస్తీలో ఎంతమంది ఉన్నారో, వారిలో ఎంతమంది మర్కజ్ కు వెళ్లి వచ్చారో, వారితో ఎంతమంది కలిసారో ఇత్యాది వివరాలన్నీ గోప్యమే. రాండమ్ టెస్టింగ్ ప్రాతిపదికన కూడా తెలంగాణ చాలా వెనుకబడింది. హైదేరాబాద్ లో కరోనా సంబంధిత లక్షణాలు ఉన్నవారిని, ప్రైమరీ కాంటాక్ట్ మరియు ట్రావెల్ హిస్టరీ లేకపోతే టెస్ట్ చేయకుండా, కండిషన్ ముదిరేవరకూ హోమ్ క్వారంటైన్ లో ఉండమంటున్నారట, ఇక కుటుంబంలో ఒకరికి వస్తే మిగతావారికి, వారి చుట్టుపక్కలవారికి టెస్ట్స్ చెయ్యట్లేదు - లక్షణాలు బయటపడితే కానీ టెస్ట్స్ చేయమని కూచుంటున్నారు. కొత్తగా తెలిసిన దాని ప్రకారం కోవిద్ 28 రోజుల్లో కానీ, ఆ తరువాత కానీ బయటపడవచ్చు, అంతేకాక యువకులు, మధ్యవయస్కులలో లక్షణాలు కనబడకపోవచ్చు. టెస్ట్స్ అన్నవి అత్యంత కీలకం - ఎందుకంటే దీనికి మందు కానీ, వాక్సిన్ కానీ లేదు కాబట్టి 

      Delete
    2. అన్నీ గోప్యంగా ఉండుంటే హైదరాబాదులో దక్షిణ & పశ్చిమ జోనులో ఇన్ని పోలీసు స్టేషన్ పరిధులలో కంటైన్మెంట్ క్లస్టర్లు ఉండేవి కావు.

      నిజామాబాదు, భైంసా, నిర్మల్, జగిత్యాల, మహబూబునగర్ పట్నాలలో పరీక్షలు జరిపినా పాజిటివులు తక్కువ వచ్చాయి. పెద్దగా అనుమానం రాకూడని గద్వాల & సూర్యాపేటలలో అనుకోని విధంగా ఎక్కువ ఉన్నాయి. కాంటాక్ట్ ట్రేసింగ్ బలహీనంగా ఉంటే ఇవి బయటికి వచ్చేవి కావు.

      రాండం టెస్టింగ్ ఖర్చు దండగే కాక తీవ్ర పరిమితులలో ఉన్న పరీక్షా వనరుల మళ్లింపు కూడా. Not viable or recommended.

      Delete
    3. మిగతా కేసెస్ లో ఆ థియరీ కరెక్ట్ ఏమో కానీ కరోనా విషయంలో అలాంటి అంచనాలన్నీ తప్పుతున్నాయి. తెలంగాణాలో అలా కాకుంటే ఉంటే, అంతకుమించిన సంతోషం ఉండదు. చూద్దాం ... నా అభిప్రాయంలో తెలంగాణాలో కూడా పరీక్షల సంఖ్యను గణనీయంగా పెంచాల్సిన ఆవశ్యకత ఉంది

      Delete
    4. పరీక్షలు పెంచాలి అన్న విషయంతో నాకూ విబేధం లేదు కాకపోతే ఎక్కడన్నదే ప్రశ్న.

      కరోనా సందేహం తక్కువగా జనగామలో టార్గెట్ల పేరిట టెస్టింగ్ విస్తృతం చేస్తే, అవసరమున్న సూర్యాపేటలో పరికరాలు & వనరులు కొరత వస్తుందనే తప్ప వేరే కాదు.

      Delete
    5. Corona vistruti adhikamgaa unna areas lo koodaa pareekshalu vistrutamgaa cheyyatam ledu.

      Delete
    6. 2.7% of Indian testing done in Telangana as per records

      Delete
  2. ప్రధాని గారు మన్ కీ బాత్ అని ఏవో విషయాలు చెబుతుంటారు కానీ సూటిగా స్పష్టంగా కార్యాచరణ దిశగా అనిపించదు. ఈ విషయం లో కేసీఆర్ గారు వివరించే విధానం చాలా బాగుంటుంది. ప్రెస్ మీట్ లో అయన రబీ పంటల కొనుగోళ్లు, అలాగే QE గురించి ప్రణాళికా బద్ధంగా వివరించిన తీరు చాలా బాగుంది.

    రాష్ట్రాలకు స్పష్టంగా ఆర్థిక సహాయం గురించి ఒక్కమాట కూడా చెప్పకుండా లాక్ డౌన్ పాటించండి, మాస్కులు ధరించండి, ఆయుర్వేద మూలికా ద్రావకాలు తాగండి , దూరం దూరం జరగండి చేతులు తరచూ కడగండి అని చెబితే సరిపోదు.

    ఇక నిర్మల సీతారామన్ గారు కూడా ఏదో మాటల గారడీ లాగా చెబుతారు. ముఖ్యమైన విషయాలపై ఏమీ చెప్పకుండా ఊరకే తెలిసిన విషయాలు మళ్లీ మళ్లీ చెప్పడం ఏమిటి.

    ఎట్టకేలకు వలస కూలీల తరలింపు విషయంలో చర్యలు తీసుకుంటున్నారు.

    ReplyDelete
  3. ఆంధ్రజ్యోతి పేపరోడు అప్పట్లో తెలంగాణా దవాఖానాలలో వ్యక్తిగత పరిరక్షణా పరికరాలు తీవ్ర కొరత ఉందని ఏదేదో తిక్కరాతలు రాసాడు. కేంద్ర బృందం పర్యటన దరిమిలా అది అబద్దమని తేలింది. ఇవ్వాళ కేంద్ర ప్రభుత్వ అధికారిక పత్రకార సమ్మేళనలో గృహమంత్రిత్వ శాఖ తరఫున పుణ్య సలిల శ్రీవాస్తవ గారు వెల్లడించారు.

    ముందు బురద జల్లిన వేమూరి ఇంకో కొత్త అభియోగం చేస్తాడు తప్ప తాను గతంలో రాసిన తప్పుడు సొల్లు వెనక్కు తీసుకోడు. This is hit-and-run yellow "journalism".

    ReplyDelete
    Replies
    1. https://www.thenewsminute.com/article/telangana-covid-19-testing-now-less-national-average-what-experts-say-123586

      చంద్రజ్యోతి వాడు కాస్త అతిగా రాశాడు, కానీ అప్పట్లో కొంత కొరత ఉండిందన్నది నిజం. గత వారం ప్రెస్ మీట్ లో కెసిఆర్ 'ఇపుడు పీపీఈ కిట్స్, మాస్క్స్ కొరత లేదు' అని ప్రస్తావించడం ఇందుకు నిదర్శనం. నేను చంద్రజ్యోతి రాతలను అస్సలు చదవను, ఇక ప్రామాణికంగా తీసుకోవడం ఎక్కడ? మొన్నటివరకూ చేసిన వంద, రెండొందలు కాక కాస్త టెస్ట్స్ పెంచేసరికి నిన్న 22 పాజిటివ్ కేసెస్ వచ్చాయని గమనించగలరు

      Delete
    2. మీరు ఇచ్చిన News Minute లింకులోనే విభిన్న అభిప్రాయాలు ఉన్నాయి.

      పాజిటివులు పెరిగాయా అన్నది ఇంకొన్ని రోజులు గమనించాకే చెప్పగలము. అయితే కేసులన్నీ ఒకే ప్రాంతం నుండి కావడం a few high risk clusters model కి సూచకంగానే ఉంది.

      Delete

Post a Comment

Popular posts from this blog

... కరోనా కంటే ఎక్కువగా భయపెడుతున్న అంశం?

... మూడో కూటమి

... 2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు - జనసేన