'డాక్టర్ సుధాకర్ గారు - ప్రభుత్వం' ఉదంతంలో విషయంలో కొన్ని ప్రశ్నలు

డాక్టర్ సుధాకర్ గారు - ప్రభుత్వం ఉదంతంలో విషయంలో కొన్ని ప్రశ్నలు
-> సుధాకర్ గారు మాస్క్స్ మరియు గ్లోవ్స్ వంటివాటి కొరత గురించి తన పై అధికారులనో లేక అధికార వర్గాలనో సంప్రదించారా? సంప్రదించి ఉంటే వారు వాటిని ఇవ్వటానికి నిరాకరించారా లేక సరఫరా లేదు కాబట్టి సర్దుకోవాలన్నారా లేదా మరేదైనా సమాధానమిచ్చారా?
-> ఒకవేళ పై అధికారులనో లేక అధికార వర్గాలనో సంప్రదించలేదు అంటే - అలా ఎందుకు చేయలేదు? పై స్థాయి వర్గాలను సంప్రదించకుండా ఎవరైనా అడ్డుకున్నారా?
-> అయ్యన్న పాత్రుడు గారిని కలవడం తప్పు కాకపోవచ్చు. కానీ, కలిసి వచ్చిన వెంటనే ఆరోపణలు చెయ్యడం, ఆయన్నీ కలిసి హాస్పిటల్ దగ్గరకు వచ్చే సమయానికి అటూఇటుగా విలేఖర్లు హాస్పిటల్ దగ్గరకు రావటం - వీటన్నిటికీ ఒకదానికి మరొకదాన్ని లింక్ ఉందా లేదా? లేక కేవలం కాకతాళీయమేనా?
-> మాస్క్స్, పిపిఈ సూట్స్, గ్లోవ్స్ వంటి వాటి కొరత నిజమే అయినప్పటికీ; వాటి గురించి సంప్రదించవలసింది మీడియాను కాదు కదా. అధికార వర్గాలను సంప్రదించి ఉంటే, వారి స్పందన ఏంటో చెప్పవచ్చు కదా.
-> వీటి కొరత అన్నది మన రాష్ట్రానికి మాత్రమే పరిమితమైనది కాదు. అలాగని ప్రతి ప్రాంతంలో కొరత లేదు. కానీ అతడి ప్రెస్ మీట్ ను అడ్డు పెట్టుకుని ప్రభుత్వం మీద రాళ్ళేయటానికి ప్రయత్నించడం ఈ పరిస్థితుల్లో సబబేనా?
-> తప్పుడు కథనాలు రాసిన జర్నలిస్ట్స్ కు కరోనా రావాలి అని శాపం పెట్టి, బెదిరించిన కెసిఆర్ ను మాత్రం ప్రశంసిస్తారు. ఇక్కడ ఒక డాక్టర్, ప్రోటోకాల్ పాటించకుండా ప్రెస్ మీట్ పెడితే మాత్రం ప్రభుత్వాన్ని తిడతారు. అక్కడ మాత్రం మీడియా ఎలా పడితే అలా రాయకూడదు, ఇక్కడ మాత్రం అలా కాదు అనే పధ్ధతి సరైనదేనా?
-> ఇక సుధాకర్ గారి గత చరిత్రలో నేరారోపణలు తదితరాలు ఉండటం - అతడు ప్రతిపక్ష ఎమ్మెల్యేను కలిసి వచ్చాక ఆరోపణలు చేయడం వంటివి అనుమానం కలిగించటం లేదా?
-> తప్పు చేశానని ఇపుడు అంటున్నారు సరే, చేసిన తప్పు ఎందుకు చేశారు? ఎవరితోనైనా వ్యక్తిగత గొడవల వల్ల భావోద్వేగాలతో చేశారా లేక ఎవరి ప్రేరేపణ వల్ల అయినా చేసారా?
వీటిని ప్రశ్నించకుండా కొందరు అతడి తీరును విమర్శిస్తే అదేదో మొత్తం వైద్యులను తప్పు పట్టినట్టుగా, మరికొందరు ప్రభుత్వం ఏదో తప్పు చేసినట్టుగా ఏవేవో రాస్తున్నారు. అతగాడు ముందుగా ప్రభుత్వ వర్గాలను సంప్రదించి, వారు నిరాకరించినట్టు తేలితే మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వంది తప్పే అలాకాక అతడు కేవలం ప్రచారం కోసమో లేక ఎవరిమీదనైనా వ్యతిరేకతతోనో అలా చేసి ఉంటే తప్పు అతడిది అవుతుంది. అందునా ఇటువంటి విపత్కర పరిస్థితిలో అతడి వ్యవహారశైలి సరియైనది కాదు. ఆవేదనకూ, ఆవేశానికి, కుట్రకూ తేడా తెలియనంత అమాయకత్వంతో ఉన్నామా అన్నది విజ్ఞులు సరిచూసుకోవాలి. ... ఇవన్నీ చూస్తోంటే, ఒకటి మాత్రం అనిపిస్తోంది - జాతీయ స్థాయిలో కానీ, ఇతర రాష్ట్రాలలో కానీ ప్రతిపక్షాలు ఈ సమయంలో ప్రభుత్వాలను పెద్దగా విమర్శించటం లేదు. ప్రతి చోటా లోపాలున్నాయి. కానీ, ప్రతిపక్షాలు కూడా తమ వంతు అండగా నిలబడటమో లేక ప్రతిపక్ష నేతలు స్థానికంగా సహాయక చర్యలు చేపట్టటమో చేస్తున్నారు. అంతెందుకు కెసిఆర్ ప్రతి చర్యను వంద రీతులుగా విమర్శించే వారు కూడా నేడు, విమర్శలను పక్కనబెట్టి వీలైనంత సహాయం చెయ్యటానికి ప్రయత్నిస్తున్నారు. మన రాష్ట్రంలో గత రెండు మూడు రోజుల నుండి మాత్రం కొన్ని నియోజకవర్గాలలో అటువంటి చర్యలు మొదలుపెట్టారు (బహుశా విమర్శలకు జడిసి కావచ్చు). కనీసం ప్రతిపక్ష నేత, అత్యంత అనుభవజ్ఞుడు, దీర్ఘకాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన నేత తన పార్టీ వర్గాలను చురుకుగా సహాయక చర్యలు చేపట్టామని మాత్రం ఆదేశించలేదు. అడిగితే సలహాలు చెప్తా అని మాత్రం అనగలరు. సుశిక్షితమైన, నమ్మకమైన కార్యకర్తల బలం/వ్యవస్థ ఉన్న పార్టీగా, తమ కార్యకర్తల వ్యవస్థను ఉపయోగించుకుని సహాయక చర్యలు చేపడితే అది పార్టీగా తమకే లాభిస్తుంది కదా. ఇక భావి ముఖ్యమంత్రిగా ప్రొజెక్ట్ కాబడుతున్న లోకేష్ గారు ట్విట్టర్ వదిలి రాకపోవడం ... వారి విజ్ఞత. తన సమర్థతను, ఔదార్యాన్ని చూపించుకునే ఇటువంటి అవకాశాన్ని ఎందుకు ఆయన ఉపయోగించుకోవటం లేదో మరి.

*** వంశీ కలుగోట్ల 🙏🙏🙏

Comments

  1. పచ్చ డాక్టర్ పిచ్చి ప్రేలాపనలు వెనుక ఎవరున్నారో అందరికీ తెలుసు. అది తనివితీరా పచ్చ గొట్టాల వాల్లు సైకో మీడియాలో పదే పదే చూసుకొని పిచ్చి చర్చలు చేసి పైశాచిక అనందం పొందాయి.

    In crisis time also the yellow Media and yellow gang behaving in a disgraceful disgusting manner.

    ReplyDelete
    Replies
    1. తర్వాత రెండు రోజులకి "రెడ్డి" అనే ట్యాగ్ పెట్టుకున్న ఒక డాక్టర్ కూడా ఇదే ఆరోపణలు చేశారు.ఆయన్ని పచ్చ బ్యాచ్చి అని ఎందుకు అనలేదు?రామకృష్ణ ఉదంతానికి చాలా ముందే ఒక లేడీ డాక్టర్ మాస్క్ అడిగితే ఒక ప్రభుత్వ శాఖయే పోలీసు కేసు పెడితే ఎంక్వయిరీకి వచ్చిన పోలీసే ఆశ్చర్యపోయ్యాడు.అవన్నీ కూడా పచ్చ బ్యాచ్చికి కలిపేస్తారా?

      అంటే, ఒకసారి 151 మందిని ఎన్నుకున్నారు గాబట్టి అయిదేళ్ళ పాటు ఎన్ని సమస్యలు వచ్చినా చెప్పకూడదన్న మాట.సమస్యలు వస్తే పరిష్కరించి ప్రభుత్వం కాలరెగరేసుకోవాలన్న ఇంగితజ్ఞానం కూడా లేదా మీకు!ప్రజలు సమస్యలు చెప్పుకోవడమే కుట్ర కింద కనిపిస్తుందా మీకు?మాస్కుల కొరత అని చోట్లా ఉందని అందరికీ తెలుసు.కానీ మాస్కులు కావాలి అని ఆడిగీన్ డాక్టర్లని అల్లరి మూక/పచ్చ కోవర్టుల కింద వర్ణిస్తూ సమస్యలు చెప్పుకుంటున్నవాళ్ళని దోషులుగా చూపే వికృతత్వం మాత్రం ఒక్క ఏపీలో తప్ప ఇంకెక్కడా జరగడం లేదు.ఎందుకని?

      Delete
    2. ఇక్కడ నేను అననీవన్నీ, వేరే ఎవరో ఒక్కడో అన్నవన్నీ నాకు ఆపాదించి మీరు ప్రశ్నిస్తే నేనేం చెయ్యను? నేనిక్కడ పచ్చ టాగ్ వెయ్యలేదు - అతడి తీరులోని హేతుబద్ధతను ప్రశ్నించాను, అనుమానాస్పద తీరును ఆక్షేపించాను. ఇక మీరన్న ఆ ఇతర రెండు ఘటనల్లో వారు ఇలా నోటికొచ్చిన తీరులో లేదా వివాదాస్పదంగా మాట్లాడలేదు. ఇక ఎంక్వయిరీకి వచ్చిన పోలీస్ ఆశ్చర్యపోయాడు అనడం ఏదో పక్కనుండి చూసినట్టు ఉంది. నేను వ్యాసంలో ప్రస్తావించిన ప్రతిదానికి పత్రికల్లో వచ్చిన ఆధారాలున్నాయి, వీడియోలతో సహా. మరి మీరు చెప్పిన పోలీస్ ఆశ్చర్యపోవడం, ఆ పోలీస్ చెప్పినట్టుగా వీడియో ఉందా? ఇక మీరు నేను ప్రస్తావించని అంశాల గురించి ఇక్కడ ప్రస్తావిస్తే - మీ విజ్ఞత. నేను ప్రస్తాటించిన దేని గురించైనా అడగండి ... ఇందులో లేనివాటి గురించి వేస్ట్ అఫ్ టైం ఫర్ బోత్ అఫ్ అస్. 

      Delete
    3. I have directed this question to GKK, not you.

      Delete
    4. @vamsee
      ఇక ఎంక్వయిరీకి వచ్చిన పోలీస్ ఆశ్చర్యపోయాడు అనడం ఏదో పక్కనుండి చూసినట్టు ఉంది.

      hari.S.babu
      I saw a video in youtube in which the lady doctor explaining her case.

      Delete
    5. hari.S.babu
      I saw a video in youtube in which the lady doctor explaining her case.

      ఆ..వూ.. మరీ... మరే.. అప్పుం.. అప్పుం... అప్పుడు..అప్పుడూ.. ఆమె ఫ్యేసులో కనపడ్డదిలే.

      నన్నే క్వసనింగు చేస్తున్నావ్... నువ్వు హిందూ వ్యతిరేకివే...

      Delete
    6. Mr. Vamshee!
      Do you support this animosity and vulgar language of the above anonymous?
      ---@@@
      ఆ..వూ.. మరీ... మరే.. అప్పుం.. అప్పుం... అప్పుడు..అప్పుడూ.. ఆమె ఫ్యేసులో కనపడ్డదిలే.

      నన్నే క్వసనింగు చేస్తున్నావ్... నువ్వు హిందూ వ్యతిరేకివే...
      ----@@@

      Do you think I am a road side Romeo to be treated like this at your blog?

      I think you are enjoying such substandard language. What do you think of yourself,himself and myself?

      Can't we knew what is the reaction of the police from a visual conversation?

      What does it means it was published even after you put moderation?

      Do you think you are the only intellectual in this world!

      Delete
    7. Mr Hari S Babu garu, as I can see the comment was not at all against you. He made reference of a youtube video and what was there in YouTube video. Regarding your other questions, we don't know each personally so no chance of assuming you of something like and vice versa. And, the comment was published as he mentioned it was in the youtube, least we can ask him to post that video. And, show me one instance where I mentioned I am an intellectual or something else. One last thing - if you have objection with the content of my posts, you are welcome to express it. If you feel the problem is with me then all I can say is I am not asking or begging you to follow or read my works. So, choice is yours 

      Delete
    8. @Anonymous garu, please can you post the link of the referred youtube video here as Hari babu garu felt the comment was against him ... thanks

      Delete
  2. టీవీ99 వాడు విశాఖ అల్లిపురం కొరోనా చావంటూ అబద్దాలు ప్రసారం చేసినందుకు జనం బోలెడంత హైరానా పడ్డారు. అంధకోతి పేపరోడు మాస్కులు లేవని కల్లబొల్లి కట్టుకబుర్లు అల్లి ప్రజలను భయభ్రాంతులు చేసాడు. ఏబీపీ మాఝా రైళ్లు మొదలహో అంటూ అడ్డగోలు సొల్లు మాటలు రాసి బాంద్రాలో వేలాది మందికి ప్రాణానికి ముప్పు తెచ్చాడు.

    ఇటువంటి వాళ్ళు దేశానికి ముప్పే తప్ప పైసా ప్రయోజనం లేదు. మంచి చేయకపోతే మానె చెడగొట్టకపొతే చాలన్న ఇంగితం కూడా లేని పెండ బతుకులు.

    ReplyDelete
    Replies
    1. అమెరికా వాడు జపానులో బాంబేసింది అది ఎలాంటి ఫలితాలను ఇస్తుందో తెలిసి కాదు, డిస్పరేటుగా మాత్రమే !

      జపాను వెధవలు అంతగా దాన్ని రెచ్చగొట్టాల్సింది కాదు కదండీ ..

      అలానే కొన్ని కొన్ని అలా జరుగుతూ ఉంటాయి..

      Delete
    2. అక్కడ అమెరికా చేసింది ఖచ్చితంగా ప్రయోగమే. ఎందుకంటే అణు బాంబులు వేసే ముందే టోక్యో తో సహా చాలా ప్రదేశాల్లో వైమానిక దాడులు చేసి బాంబులు జారవిడిచింది. అలాగే అణుబాంబు వేయడానికి "ఇంతకు ముందు పెద్దగా దాడి చేయని ప్రాంతాన్ని ఎంచుకోవడం" కూడా బాంబు తీక్షణత ని పరిశీలించడానికే.
      వియత్నాం యుద్ధం లో రసాయన ఆయుధాలు కూడా ట్రయల్స్ కోసం వాడింది.

      Delete
  3. అంధ కోతి ఇచ్చేవి ' చీ పాడు ' వార్తలే అన్నీ.

    ReplyDelete
  4. భాధాకృష్ణకి రిపోర్టర్లు అవసరమేలేదు. జగన్ పేరు తలుచుకోగానే, సైకోగాడికి... ఉగ్రవాద బుద్ది వార్తలు తన్నుకుంటూ వొచ్చేస్తాయి.

    ReplyDelete
  5. దక్షిణ కొరియా జనాభా షుమారు 5 కోట్లు. కోవిద్ కేసులు 10 వేల పైచిలుకు, 239 మరణాలు. ఎన్నికలు జరిపితే అధికార పార్టీ బంపర్ మెజారిటీ గెలిచింది

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

... కరోనా కంటే ఎక్కువగా భయపెడుతున్న అంశం?

... మూడో కూటమి

... 2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు - జనసేన