... అనుభవం 2

వంశీ కలుగోట్ల // ... అనుభవం : 2//
**********************************
            నేనే సీనియర్ని, నాది నాలుగు దశాబ్దాలకు పైగా అనుభవం అంటూ ప్రతిసారీ ప్రస్తావించకండి బాబు గారు ... క్రింద పేర్కొన్న అతి కొన్ని అంశాలను పరిశీలించుకున్నపుడు అది అనుభవమా ఆక్కూర కట్టా అనుకోవాల్సిందే 

-> 23 మంది ఎమ్మెల్యేలను, ముగ్గురు ఎంపీలను వేరే పార్టీ ద్వారా సంక్రమించిన వారి సభ్యత్వాలకు రాజీనామా చేయకుండానే మీ పార్టీలోకి తీసుకున్నపుడు; అందులో నలుగురికి మంత్రి పదవులిచ్చినపుడు 
-> ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి రాయలసీమ రౌడీలు, పులివెందుల గూండాలు అంటూ ప్రాంతాలను కించపరిచేలా మాట్లాడినపుడు 
-> దళితులుగా పుట్టాలని ఎవరూ కోరుకోరు అంటూ దళితుల మనోభావాలను కించపరిచేవిధంగా మాట్లాడినపుడు 
-> వాస్తవాస్తవాలు తెలుసుకోకుండా ఘటన జరిగిన గంటలలోపే ప్రతిపక్షం వారి హత్యారాజకీయాలను సహించను అంటూ చిత్తూరు మేయర్ హత్య ఘటనలో మాట్లాడి, ఆ తరువాత హత్య చేసినది తెదేపా సభ్యుడు మరియి స్వయానా మేయర్ మేనల్లుడు అని తెలిసినపుడు స్పందించకుండా ఉన్నపుడు 
-> అక్రమ ఇసుకరవాణాకు పాల్పడుతున్న మీ ఎమ్మెల్యేను అడ్డుకుంటే, అతగాడు ఆ ఎమ్మార్వోనుకొట్టిన ఘటనలో ఆ ఎమ్మార్వోనే పిలిపించుకుని మందలించినపుడు   
-> కాపు ఉద్యమ ఘటన సమయంలో రైలు తగలబెట్టబడినపుడూ వాస్తవాస్తవాలను తెలుసుకోకుండా రాయలసీమ రౌడీలు చేశారు అంటూ వ్యాఖ్యానించినపుడు  
-> రిషితేశ్వరి ఘటన, కాల్ మనీ సెక్స్ రాకెట్, బాక్సయిట్ నిర్వాసితుల ఉద్యమం వంటి పలు ఘటనలో వ్యవహరించిన తీరు 
-> ప్రతిపక్ష నేతపై హత్యాయత్నం జరిగితే కనీసం పరామర్శించకుండా కోడికత్తి అంటూ ఎగతాళి చేసినపుడు 
-> మీరే అక్రమ కట్టడం అని ఆరోపించిన కరకట్ట నిర్మాణాన్ని అధికారిక నివాసంగా మార్చుకున్నపుడు 
-> నిండు సభలో అచ్చెన్నాయుడు, దేవినేని ఉమా, అనిత వంటివారి దుష్ప్రవర్తనను ఖండించక, కేవలం ప్రతిపక్ష సభ్యురాలిపై మాత్రమే నిషేధం విధించినప్పుడు; సుప్రీం కోర్ట్ తీర్పును కూడా గౌరవించకుండా ప్రతిపక్ష సభ్యురాలిని సభకు రానివ్వకుండా అడ్డుకున్నపుడు 
... 
... 
... 

            ఎన్నని? కేవలం గత అయిదేళ్ళ కాలంలో జరిగిన అనేకానేక అంశాలను మాత్రమే రాస్తూ పొతే కూడా రామాయణం అంత అయ్యేట్టుందిలెండి, కాబట్టి ఇక్కడితో ఆపేద్దాం. (హోదా, రాజధాని నిర్మాణం విషయాలు ప్రస్తావించనే లేదు) ఇదా అనుభవం, ఇదా నాలుగు దశాబ్దాల అనుభవం నేర్పిన జ్ఞానం అనిపించేలా చేశారు కదా. అయినా దేవుడున్నాడో లేదో తెలియదు. కానీ ప్రజలు చూశారు - వారికి అవకాశం వచ్చినపుడు, వారు చెయ్యగలిగింది చేశారు. మీకు ప్రజలు అందించిన ఈ ఘోర ఓటమి, నూతన ముఖ్యమంత్రి జగన్ గారికి కూడా ఒక హెచ్చరిక అయ్యి ఒళ్ళు దగ్గర పెట్టుకునేలా చెయ్యాలి. 

* .           * .           *

            ఛీ దీనమ్మ జీవితం, ప్రతిచోటా అనుభవం అనుభవం అన్నమాట విని చిరాకు దొబ్బుతోంది. అసలు నేను ఐటీ ఇండస్ట్రీలో ఉద్యోగ ప్రయత్నాలు మొదలెట్టినపుడు - ఉద్యోగం కోసం వెళ్లిన ప్రతిచోటా రెండేళ్ళో, మూడేళ్ళో అనుభవం కావాలంటారు. ఎవడో ఒకడు ఉద్యోగం ఇవ్వకపోతే అనుభవం ఎక్కడినుండి వస్తుంది? ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టుకుని పొతేనేమో బాక్గ్రౌండ్ వెరిఫికేషన్, తొక్కా అని బెదిరిస్తారు. ఎలాగోలా ఉద్యోగంలో చేరాక జరిగిందేమిటి అంటే అనుభవం ఉన్న చాలామందికంటే మనమే బెటర్ అని ప్రూవ్ చెయ్యడం. నా తరువాత వచ్చిన వాళ్ళు కూడా అదే చేశారనుకోండి, అంటే అదే నాకంటే బెటర్ అని ప్రూవ్ చెయ్యడం. అపుడు కూడా తృప్తి అనిపించేది, అనుభవం మాత్రమే కాదు సమర్థత కూడా ముఖ్యం అని మరొకమారు నిరూపించబడింది అని. అనుభవం అవసరం లేదని చెప్పట్లేదబ్బా, అనుభవం లేదని చెప్పి సమర్థులను దూరం చేసుకోకూడదని చెప్తున్నా అంతే. అర్థం కాకపొతే మింగెయ్యండి తప్పించి నామీద ముద్రలెయ్యకండి.

Comments

  1. యాభై ఏళ్ల అనుభవం ఉన్న అమితాభ్ బచ్చన్ నేనే హీరో కావాలని పట్టు పట్టకుండా తన వయసుకు తగ్గ పాత్రలు చేస్తున్నాడు. విరాట్ పుట్టకముందే సెంచరీలు దంచిన గవాస్కర్ ఆట నుండి హుందాగా తప్పుకొని కామెంటరీ చెప్తున్నాడు.

    తాటిచెట్టుకు కూడా వందేళ్ళుంటాయి ఏమి చేసుకోనూ!

    ReplyDelete
  2. అంత అనుభవం ఉన్న చంద్రబాబుగారు 18 రోజులు కూడా జైలులో ఉండకపోవడం ఎంత నేరం ?

    ఏదో జైలుపక్షి, కుర్రకుంక అని ఊరుకోకుండా సభా సంప్రదాయాలు నేర్పాలనుకోవడం మరింత ఘోరమబ్బా !

    ReplyDelete
    Replies
    1. జైలు విషయంలో మీ కోరిక శీఘ్రమే నెరవేరుగాక, ఆ నేరం అనగా తప్పిదం సరి చేయబడుగాక. ఇక సభ సంప్రదాయాల గురించి చంద్రబాబు గారు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఎన్టీఆర్ గారికి వెన్నుపోటు పాడించిన నాటి నుండి, సభ రికార్డ్స్ తిరగేసుకోండి కావాలంటే, ఎన్టీఆర్ గారికి సభలో మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకపోవటం దగ్గరనుండి, రోజా గారి విషయంలో వ్యవహరించిన తీరు వరకూ (రోజా గారి పేరే ఎందుకు అంటే ఆమె కంటే అసభ్యకరమైన భాష, దురుసుతనం చూపిన అచ్చెన్నాయుడు గారు, దేవినేని ఉమా గారు వంటి వారిని సమర్థించుకుంటూ రోజాపై నిషేధం విధించటమే కాక, సుప్రీం కోర్ట్ తీర్పును పట్టించుకోని తీరు చూపారు కాబట్టి) ఆయన అనేకమార్లు సభ సంప్రదాయాలను, విలువలను తుంగలో తొక్కిపారేశారు. అంతెందుకు 2014 నుండి సభ సమావేశాల వీడియోస్ యూట్యూబ్ లో దొరుకుతాయి చూడండి ... అంతకుమించి నేను చెప్పాల్సినదేమీ లేదు.

      Delete
    2. వంశీ గారూ, అసలే ఆయన స్టేల చక్రవర్తి. ఉపరాష్ట్రపతి భవన్, సుప్రీం కోర్ట్, సీబీఐ ఒకటేమిటి అన్ని వ్యవస్థలలో సమయం దొరికినప్పుడు అసమదీయులను నింపేసుకున్నాడు. ఇంకా కుదరకపోతే శరణు ఇవ్వడానికి సింగపూరు ఈశ్వరుడు ఉండనే ఉన్నాడు కనుక ఆయన చిక్కడు, దొరకడు.

      Delete
  3. నీక్కూడా 50 ఏళ్ళు వచ్చాయి ఏం పీకావ్ ?
    మీ తాత నేతులు తాగారని మాత్రం చెప్పకు.

    ReplyDelete
    Replies
    1. ఇది మీరు నన్నీ అన్నారనుకుంటున్నాను - మొదటగా మీకున్నంత గొప్ప సంస్కారం నాకు లేదు కాబట్టి, కనీస పరిచయం కూడా లేని మిమ్మల్ని మీరు అనే అంటాను. నన్నే అడిగి ఉంటే చెప్పండి, నేనేం పీకానో చెబుతాను ... మీ ఆసక్తిని నేనెందుకు కాదనాలి.

      Delete
    2. పిట్టకు కడు కడుపుబ్బా !
      మెట్టు దిగిచి అడుగ నేల? ఛ, అడిగెను పో ,
      ఎట్టా ! సైకిలు బాబాయ్
      ఒట్టి తలను రెట్ట వేయ నవసరమ? మహా !

      Delete
    3. I think niharika is addressing Jai gottimukala.

      Delete
    4. పిట్టకు కడు కడుపుబ్బా - Only Jilebi is capable of writing such paikus.

      Delete
    5. నేను వివరం అడిగాను, ఒకవేళ నన్నే అడిగుంటే నేనేం పీకానో చెప్పగలను అని. (వారి భాషలోనే చెప్పినందుకు మన్నించగలరు)

      Delete
    6. >>>తాటిచెట్టుకు కూడా వందేళ్ళుంటాయి ఏమి చేసుకోనూ!>>>

      నీక్కూడా 50 ఏళ్ళు వచ్చాయి ఏం పీకావ్ ?
      మీ తాత నేతులు తాగారని మాత్రం చెప్పకు.

      Delete
    7. మీ వ్రాతలు చదివితే మీరేవిటో అర్ధం అవరా ? మీ ధింకింగ్ ఏవిటా అని చదువుతాను. మీ వ్రాతల్లో రాయలసీమ పౌరుషం కనిపించదు కానీ అభిమానం కనిపిస్తుంటుంది. మీరేం పీకారో నాకు అనవసరం.(క్షమించాలి....కొందరు బ్లాగర్ల ప్రభావం వల్ల వ్రాయవలసి వస్తోంది )

      Delete
    8. అర్థం కావటానికి ఈ అక్షరాలు మాత్రమే నేను కాదు. ఈ రాతలు నాలో ఒక భాగమే తప్పించి, మొత్తం నేను కాదు. నా థింకింగ్ లో కాసింత మాత్రమే రాతల్లో కనబడుతుంది. ఇక పోరుషం, అభిమానం అన్నవి మీ దృష్టికోణం నుండి మీరు నిర్ధారించుకున్నవి. పోరుషం కనబడలేద అన్నారు అంటే, రాయలసీమ పౌరుషం అంటే బహుశా మీరు సినిమాల స్థాయిలో అనుకుంటున్నారేమో నాకు తెలియదు. పౌరుషం, అభిమానం అనేవి ఎమోషనల్ ఫీలింగ్స్, అవి అవసరార్థం సందర్భానుసారం ప్రకటితమవుతాయి. కొందరు బ్లాగర్స్ ప్రభావం ఇక్కడ ఎందుకు చూపవలసి వచ్చిందో నేను అడగను, చెడును విమర్శించి మంచిని స్వీకరించడం మంచిది అని మాత్రం తెలుసు. సద్విమర్సలకు, విషయసంబంధిత విమర్శలకూ ఎపుడూ సవివరణాత్మక సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాను.

      Delete
  4. నలభై ఏళ్ల అనుభవం కల నాయకుడు, రాజవంశీకుడు, నిత్యం సింహాద్రి అప్పన్న సేవలో తరించే భాగ్యం కలిగించే ధర్మకర్త హోదా, పైగా కేంద్రపౌరవిమానయాన మంత్రి. అంతటి పూసపాటి అశోక గజపతిరాజు గారు అందరికీ మల్లె లైనులో నిలబడి, సెక్యూరిటీ తణిఖీలు చేయించుకొని & సాటి ప్రయాణీకులతో కలిసి బస్సులో వెళ్లి విమానం ఎక్కేవారు. That is called simplicity.

    చట్టసభలలో & పార్టీలో ఉన్న మీ జూనియర్లకు మీరే ఆదర్శం కావాలి రాజు గారూ.

    ReplyDelete
  5. బ్లాగులు ఎంత చెడ్డవి.. మా టి.డి.పీ వాల్లకు తమ వంకర ప్రచారాన్ని చేసుకోనివ్వకుండా అడ్డుకుంటున్నాయి.

    జాగ్రత్త బాబయ్యా.. టి.డి.పీకి జై కొట్టకపోతే ఆంధ్రా ద్రోహులయ్యే ప్రమాదం ఉంది. వాల్లు ఆంధ్రా భక్తులు వాల్లను కాదంటే.. ఆంధ్రా ద్రోహులు.

    ReplyDelete
  6. ఆంధ్రజ్యోతిలో శ్రీమాన్ చంద్రబాబు గారు ఒక సామాన్యుని వలె లైన్లో నిలబడి, అందరితో పాటు బస్సెక్కి ఆపై విమానమెక్కిన 8th వండర్ గురించి, వారి యొక్క అసామాన్య గొప్పదనాన్ని గొలిపే విషయాన్ని ముచ్చట గోలిపేట్లుగా బాక్స్ కట్టి భజన చేస్తే, లోకమంతా ఈ కారుకూతలేంటి, వారికేదో మహా అన్యాయం జరిగినట్లు, లోకంలో ఒక మహాపరాధం జరిగిపోయినట్లు?
    చూస్తుంటే వారి ఐటీ బంట్లలో ఏదో సమన్వయం లోపించినట్లుగా ఉంది!

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

... మూడో కూటమి

... కరోనా కంటే ఎక్కువగా భయపెడుతున్న అంశం?

... 2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు - జనసేన