... "పింక్" గురించి రెండు మాటలు

వంశీ వ్యూ పాయింట్ // ... "పింక్" గురించి రెండు మాటలు //
**************************************************
            కొన్నేళ్ళక్రితం బాలీవుడ్ లో "పింక్" అనే సినిమా వచ్చింది. అందులో ప్రస్తావించబడిన అంశం చర్చనీయాంశం, ఆ సినిమా ఒక అద్భుతం. ప్రత్యేకించి అందులో ముఖ్యపాత్రలు పోషించిన తాప్సి, అమితాబ్, కృతి కుల్హరి, ఆండ్రియా తరియాంగ్, పీయూష్ మిశ్రా, అంగద్ బేడీ వంటివారు తమ పాత్రోచిత నటనతో సినిమాను మరో లెవెల్ కు తీసుకెళ్ళారు. ముఖ్యంగా అమితాబ్ గురించి చెప్పుకోవాలి - కోర్ట్ సన్నివేశాల్లో ఆ పాత్రలో అమితాబ్ కాకుండా మరొకరిని ఊహించడం కష్టం. బాధ, నిస్సహాయత, కోపం, నిర్లిప్తత, సానుభూతి లాంటి భావాలన్నీ ఒకేసారి పలికించగలగడం - హాట్స్ ఆఫ్ అమితాబ్ జీ. ఒక నటుడిగా ఆయన మీద గౌరవం రెట్టింపయ్యేలా నటించారు దీపక్ సెహగల్ పాత్రలో.
            ఇక సినిమాలో చర్చింపబడిన అంశం - స్త్రీ ఎటువంటిదైనా, తన ప్రవర్తన ఎటువంటిదైనా, తన వస్త్రధారణ ఎటువంటిదైనా - తాను నో అంటే నో (శృంగారానికి). కాస్త కలివిడిగా ఉంటే, ఆల్కహాల్ తాగితే, పొట్టి బట్టలేసుకుని పబ్ లకు వెళితే - దాని అర్థం తన శరీరాన్ని నీకు అప్పగించడానికి సిగ్నల్ ఇచ్చినట్టు కాదు. తనకు ఇష్టం లేకపోతే నో అంటే నో. ఆ అంశాన్ని చెప్పిన తీరు నభూతో, బహుశా న భవిష్యత్ కూడానేమో. బాధితురాళ్ళుగా తాప్సి, కృతి, ఆండ్రియా అద్భుతంగా నటించారు. కథతో పాటు, నటీనటులందరూ కలిసి "పింక్" సినిమాను ఒక అద్భుతంగా, క్లాసిక్ గా నిలబెట్టారు. అమితాబ్ లాంటి స్టార్, తాప్సి లాంటి అందాలనటి ఉన్నా కూడా మూలకథకు కట్టుబడి తీశారు తప్పించి, ఎలాంటి గిమ్మిక్స్ చేయలేదు. ఇంకా చూడనివారెవరైనా ఉంటే డిస్నీ హాట్స్టార్ లో ఉంది, బహుశా యూట్యూబ్ లో కూడా ఉండొచ్చు.

Comments

Popular posts from this blog

... మూడో కూటమి

... కరోనా కంటే ఎక్కువగా భయపెడుతున్న అంశం?

... 2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు - జనసేన