... ఓ రెండు మాటలు

వంశీ కలుగోట్ల // ... ఓ రెండు మాటలు //
***********************************
            సరదాగా ఓ రెండు అంశాల గురించి కాసిని మాటలు మాట్లాడుకుందాం. ఆ రెండు అంశాల గురించి నా దృక్కోణం ఏంటనేది క్రింద వివరించాను, మీ అభిప్రాయాలను వ్యాఖ్యల రూపంలో తెలియజేయవచ్చు. 
       డైటింగ్ గురించి కాస్త చెప్పుకుందాం. డైటింగ్ అనగానే అత్యధికులు తిండి తగ్గించడం/మానేయడం అనే అపోహలో ఉంటారు లేదా ఆయిల్ ఫుడ్ లాంటివి పూర్తిగా తగ్గించడం లాంటివి. కానీ అది సరికాదు. డైటింగ్ అన్నది అందరికీ ఒకేలా ఉండదు. శరీరబరువు మీద అదుపు సాధించడం అన్నది పలు ఇతర విషయాల మీద ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా తినే తిండి మీద అదుపు, సమయపాలన లాంటివి. మనకు ఇష్టమైన ఫుడ్ ఉన్నపుడు విపరీతంగా తినెయ్యడం, మిగతావి తక్కువగా తినడం లాంటివి సరికాదు. ఇష్టమైనదైనా లేనిదైనా మితంగా తినాలి. తినేపుడు, తిన్న తరువాత ఇబ్బంది పడనటువంటి ఫుడ్ ను ప్రిఫర్ చేయాలి. సాధారణంగా బరువు పెరగడం అన్నది ఒక్కోవ్యక్తి బాడీ మెటబాలిజం బట్టి, అనేక ఇతర అంశాలను బట్టి ఉంటుంది. న్యూట్రిషనిస్ట్ ని సంప్రదించి, మనకు ఏది సరైనదో తెలుసుకుని అది చేయాలి. ఆలా కాకుండా టీవీలలో, పేపర్స్ లో, సోషల్ మీడియాలో ఎటువంటి ప్రామాణికత లేకుండా చెప్పేబడే సలహాలను పాటించడం చేసి అనేక ఇతర సమస్యలను తెచ్చుకున్నవారు లెక్కకు మిక్కిలి. శరీర బరువును అదుపులో ఉంచుకోవడం అన్నది కేవలం ఆహారం మీద మాత్రమే ఆధారపడి లేదు - ఆహారంతో పాటు ఇతర అలవాట్లు కూడా కీలక పాత్ర పోషిస్తాయి. న్యూట్రిషనిస్ట్ మరియు వైద్యులను సంప్రదించిన తరువాత మనకు ఏది సరైనదో తెలుసుకుని, అది పాటించడం ద్వారా శరీర బరువును అదుపులో ఉంచుకోవడంతో పాటు, ఆరోగ్యంగా ఉండవచ్చు.
            ఇక ధ్యానం విషయంగా కూడా అంతే అని నా అభిప్రాయం. ధ్యానం కూడా యూనివర్సల్ గా అందరికీ ఒకే పధ్ధతి ఫలితాలను ఇవ్వదు. ధ్యానంలో కీలకమైనది ఏకాగ్రత, దాన్ని సాధించడానికి వ్యక్తిని బట్టి పద్ధతిని మార్చుకోవాలి అంతే తప్పించి జనరల్ గా చెప్పబడిన ధ్యానం విధానాలు గుడ్డిగా ఫాలో కాకూడదు. ఎందుకంటే ధ్యానం అంటే మానసిక ప్రశాంతత చేకూర్చేది మాత్రమే కాదు, అది శారీరక ప్రక్రియల మీద ప్రభావం చూపగల అంశం - ఉదా. జీర్ణక్రియ, అందుకే ఏదైనా ఆహారం తీసుకున్న వెంటనే ధ్యానం చేయవద్దని చెపుతారు. ధ్యానంలో పోశ్చర్ తో పాటు పరిసరాలు, శబ్దం, శ్వాస వంటివి అత్యంత ముఖ్యమైనవి. ధ్యానం చేయాలంటే ఏకాగ్రత కుదరాలి - ఆ ఏకాగ్రతను ప్రభావితం చేసే అంశాలు అనేకం. ధ్యానం పద్ధతి కూడా వ్యక్తి వ్యక్తికీ విభిన్న అంశాలను పరిశీలించిన తరువాత సూచించవలసినది. అలా కాకుండా గుడ్డిగా, ఊరుమ్మడి మార్గాలను అనుసరించి సరైన ఫలితాలను సాధించలేక - ధ్యానమే వేస్ట్ అని అనుకోవడం సరికాదు. 
            ఇక్కడ ప్రస్తావించబడిన డైటింగ్, మెడిటేషన్ అని మాత్రమే కాదు - అనేక అంశాలు ప్రతి ఒక్కరి విషయంలో ఒకేలా ఉండవు. అనేక అంశాలలో నిపుణుల సంప్రదింపు, సలహాలు లేకుండా గుడ్డిగా ఏదీ అనుసరించకూడదు అన్న విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఒక సామెత ఉంది 'కొండ నాలుకకు మందు వేస్తే, ఉన్న నాలుక ఊడిపోయింది' అని. అది ఇలాంటి వారిని చూసే చెప్పుంటారు కాబోలు. 

Comments

Popular posts from this blog

... మూడో కూటమి

... కరోనా కంటే ఎక్కువగా భయపెడుతున్న అంశం?

... 2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు - జనసేన