... ఇవాళ్టి రాజకీయాల్లో నేరారోపణలు
వంశీ వ్యూ పాయింట్ // ... ఇవాళ్టి రాజకీయాల్లో నేరారోపణలు // *************************************************************** రాజకీయాల్లో నేరారోపణలు అన్నది ఒక రకంగా క్లిష్టమైన అంశం - ఎందుకంటే ఇవాళ రాజకీయాలు పూర్తిగా భ్రష్టు పట్టిపోయాయి. కేవలం అవినీతి అన్నది ఒక్కటే అంశం కాదు ఇపుడు. కేసుల విషయం అంటే - అవతలి వ్యక్తిని దెబ్బ తీయటానికి, ఇవతలి పక్షం వారు లేదా అధికారంలో ఉన్నవారు ఏదో ఒక కేసు పెట్టి, అధికార వ్యవస్థలను మేనేజ్ జైలు లో ఉంచవచ్చు. అతగాడి మీద నిజంగానే అబద్ధపు ఆరోపణలు చేయబడి ఉండవచ్చు, కొన్నాళ్ళ తరువాత అవి నిక్కంగా అబద్ధం అని తేలితే? మనం నమ్మే పరిస్థితుల్లో లేము ఎందుకంటే, ఇపుడు మనమెవరమూ నిజాయితీగా లేము, పార్టీలను/వ్యక్తులను అభిమానించే వారిగా విడిపోయాము. నిందారోపణలు నిరూపించబడి, శిక్షను అనుభవించిన (శిక్షకు, నిర్బంధానికి తేడా తెలుసుకోవాలి) వారిని కూడా అభిమానిస్తున్న రోజులివి. రేప్పొద్దున ఇవాళ సచ్చిలుడుగా పేరొందిన వారు ఎవరైనా, నిందలు నిరూపింపబడి జైలుకెళ్ళినా అది మనం రాజకీయ కక్ష సాధింపుగానే చూస్తాం. ఎందుకంటే సాధారణం...