... ఈ దేశంలో మహిళలకు రక్షణ లేదు

వంశీ కలుగోట్ల // ... ఈ దేశంలో మహిళలకు రక్షణ లేదు //
*********************************************************
ఒరేయ్ బడుద్ధాయిలూ, నేనిపుడు కొన్ని ప్రశ్నలు వేస్తాను సమాధానాలు సెప్పండి 

-> ప్రపంచంలోనే అత్యధికకాలం ఒక (ప్రజాస్వామ్య) దేశానికి నిర్ణాయక పదవిలో అనగా ప్రధాని లాంటి పదవిలో ఒక మహిళ కొనసాగినది ఏ దేశంలో?

-> అత్యధికంగా మహిళలు పాలనపరమైన అత్యున్నతపదవులలో (దేశం మరియు రాష్ట్రాలలో) ఉండిన దేశం ఏది? (ఇది కూడా ప్రజాస్వామ్య వ్యవస్థలోనే)

-> బహుశా, ప్రపంచంలోనే అత్యధికంగా మహిళలు పోరాటంలో పాల్గొనేది ఏ దేశంలో? (అంటే నక్సలిజం మరియు ఇటీవల శబరిమల వివాదం గట్రా అన్ని పోరాటాలు అన్నమాట)

-> స్త్రీవాదం అనగానే తలాతోకా తెలీకుండా కూడా ఊపుకుంటూ అత్యధికులు (అదికూడా స్త్రీలు కాదు) మద్దతుగా గొంతు చించుకునే దేశం ఏది? 

-> మహిళలు వెనుకబడ్డారు, లైంగిక మరియు అనేక ఇతర అణచివేతలకు గురవుతున్నారు అని చెప్పుకుంటున్న భారత్, బాంగ్లాదేశ్, శ్రీలంక, పాకిస్థాన్ తదితర దేశాలలో మహిళలు పాలనాపరంగా అత్యున్నత పదవులకు చేరుకోగలిగారు మరియు చట్టసభలలో రిజర్వేషన్స్ కు అతీతంగా సభ్యులుగా ఎన్నికవుతున్నారు మరియు ఉన్నతస్థానాలు చేరుకోగలుగుతున్నారు. మరి అమెరికా లాంటి దేశాలలో ...?

సింధు 'ఈ దేశంలో మహిళలకు రక్షణ లేదు' అని ఒక మాట అనగానే ఊపుకుంటూ బయల్దేరిన సమాజోద్ధరకులకు, ఈ సమాజంలో 'పురుషులకూ రక్షణలేదు' అని ఎవరైనా అంటే ఇదే స్థాయిలో స్పందించే గొప్పతనం ఉందా? రక్షణ లేదు, అనేకానేక సమస్యలు ఉన్నాయి - అవును నిజం. అయినా వాటన్నిటిని ఎదుర్కొని, ఇంతస్థాయికి ఎదిగిన సింధు పోరాటాన్ని వదిలేసి, ఆవిడ గౌను వెనుక పడ్డారే ఇటు అభ్యుదయవాదులు అటు సంస్కారవాదులూ? ఏ, సింధువి ఇంకా వేరే ఫొటోలే లేవా? లేక అది పెడితేనే లైక్స్ వస్తాయనా? ఏ పురుషులెవరూ లైంగికవేధింపులు ఎదుర్కోవటంలేదా? బాలీవుడ్, టాలీవుడ్ తదితర అనేక వుడ్ లతో పాటు అనేక ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలలో పురుషులు కూడా లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నారన్నది నిజం - కానీ, బయటపెడితే 'మగాడివి నీకేంరా?' అంటూ వెటకారాలు. ఈ దేశంలో మహిళ అవమానాలు ఎదుర్కుంటున్నట్టే, పురుషుడు వెటకారాలూ/అనుమానాలూ ఎదుర్కొంటున్నాడు. ఈ దేశంలోనే కాదు, అమెరికా, ఇంగ్లాండ్ తదితర దేశాలలో కూడా లైంగిక వేధింపులు మహిళలు ఎదుర్కొంటున్నారు - సంఖ్య తక్కువ అని అంటే, అక్కడ జనాభా కూడా తక్కువే అని గమనించండి ... 

ఇది అంతా స్త్రీలు ఎదుర్కొంటున్న సమస్యలను చిన్నబుచ్చడానికి అనో లేక సింధు మాటలను తప్పు పట్టటమో కాదు. సింధు బహుశా తన అనుభవాల ఆధారంగా ఆ మాట చెప్పి ఉండవచ్చు. అలాగే మరొక మహిళ వచ్చి 'ఈ దేశంలో స్త్రీలకూ ఉన్నంతటి ప్రోత్సాహం మరే దేశంలోనూలేదు' అంటే అపుడు ఏమంటారు? మొన్నామధ్య కాస్టింగ్ కౌచ్ వివాదం జరిగినపుడు అనేకమంది హీరోయిన్స్ 'మాకు అలాంటి అనుభవం ఎదురుకాలేదు, అందరూ అలాంటివారే ఉండరు, మాకు అందరూ తగిన గౌరవం ఇచ్చారు' గట్రా చెబితే వాటినెవరూ పట్టించుకోలేదు. ఇదీ తీరు అని ఊరకుండటమా లేక ఖండఖండాలుగా ఖండించి, ఖాండ్రించి ఉమ్మేసి ఊరకుండటమా లేక అది సరికాదని చెప్పుటయా ... 

అవునే శకుంతలాకియా ఇంతకీ సింధు ఆ గౌన్ వేసుకున్న ఫోటోలు పెట్టకుండా, ఆ విషయంలో ఎంతమంది రాసారంటావూ? 

Comments

Popular posts from this blog

... కరోనా కంటే ఎక్కువగా భయపెడుతున్న అంశం?

... మూడో కూటమి

... 2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు - జనసేన