కొన్ని ప్రశ్నలు ...
కొన్ని ప్రశ్నలు ... ******************** గత రెండు సంవత్సరాలలానే ఈసారీ లక్షల కోట్ల కొద్దీ ఒప్పందాలు, లక్షల ఉద్యోగాల కల్పన అంటూ ఈ సంవత్సరం జరిగిన సదస్సులో కుదిరిన ఎంఓయూల గురించి సంకలు గుద్దుకునే ముందు కొన్ని ప్రశ్నలు వేసుకుందాం ... -> గత రెండు సదస్సులలో కూడా లక్షల కోట్ల మేరకు ఎంఓయూలు కుదిరాయి, లక్షలాది ఉద్యోగాలు వస్తాయి అంటూ ప్రచారం జరిగింది. వాటిలో ఎన్ని వాస్తవ రూపం దాల్చాయి లేదా యే స్థాయిలో ఉన్నాయి? -> ఎంఓయూలకు , పూర్తి ఒప్పందాలకు, కార్యాచరణకు ఉన్న తేడా నాకంటే మీకే బాగా తెలిసి ఉంటుందనుకుంటాను. మరి ఎంఓయూలకు ఇంతటి ప్రచారం, సంకలు గుద్దుకోవటం, అనవసర భ్రమలు కల్పించటం అవసరమా? -> లక్షలకొద్దీ ఉద్యోగాలు వస్తాయంటున్నారు. అవి ఇటువంటివి? అందులో ఎన్ని స్థానికంగా అర్హత ఉన్నవారికి వచ్చే అవకాశాలు కల్పిస్తున్నారు? -> ఉద్యోగాలు అంటే పరిశ్రమ నిర్మాణంలో కూలీలుగానా లేక పరిశ్రమ ఏర్పాటయ్యాక సాంకేతిక నిపుణులుగానా? -> ప్రతి ఏటా ఇన్ని పరిశ్రమలు, ఇన్ని ఉద్యోగాలు అంటున్నారు. అవి నిర్మాణం పూర్తయ్యేలోపు తత్సంబంధిత నైపుణ్యాన్ని సంపాదించే శిక్షణ స...