మేధావుల భయం సమాజానికి మంచిది కాదు ...
వంశీ కలుగోట్ల// మేధావుల భయం సమాజానికి మంచిది కాదు ... // ****************************** ****************************** *************** 'అతడు' సినిమాలో ప్రారంభంలో ఒక సన్నివేశం ఉంటుంది. సాయాజీ షిండే పాత్రధారి ఎన్నికల ప్రచార పర్వంలో తనమీద కాల్పులు జరిపించి సానుభూతి సంపాదించి తద్వారా ఎన్నికల్లో గెలిచి 'వీల్ చైర్ టు సిఎం చైర్' ప్రయాణం చెయ్యాలనుకుని పథకం రచిస్తాడు. సినిమాలో ఏమి జరిగిందనేది వేరే కథ. అలాగే బహుశా 'విజయానికి అయిదుమెట్లు' లో అనుకుంటాను యండమూరి వీరేంద్రనాథ్ గారు మరొక చక్కని ఉదాహరణ చెప్తారు. "ఒక పిల్లాడు పదవతరగతి పరీక్షలు తప్పిపోయాడనుకుందాం. వెంటనే అతడు ఇంటికి వస్తే తండ్రి చేతిలో తన్నులు, తిట్లు గట్రా. అదే ఆ పిల్లాడు దారి మధ్యలో ఏదో బావిలో దూకాడనుకుందాం. దారిన పోయేవారెవరో చూసి, రక్షించి, ఇంటికి తీసుకువస్తే అప్పుడు పరీక్ష తప్పాడన్న కోపం కన్నా కొడుకు దక్కాడన్న ఆనందం ఉంటుంది. అంతేకాక, పరీక్షలదేముందిలేరా మళ్ళీ రాయచ్చు అంటే ధైర్యం చెప్తారు. మొదటి అంశంలో అయితే కోపం ఉంటుంది అదే రెండో అంశంలో అయితే సానుభూతి ఉంటుంది." ఈ సానుభూతి అనేది ఉందే అది ఒ...