... రెండు ప్రశ్నలు
వంశీ కలుగోట్ల // ... రెండు ప్రశ్నలు // ******************************** ఇవాళ రెండు ప్రశ్నలు ఎదురయ్యాయి - రెండు విభిన్న పోస్ట్ లలో. మొదటిది నిజానికి ప్రశ్న కాదు, దాదాపు 98% మంది మీడియా పట్ల కలిగి ఉండే స్థిరాభిప్రాయం. రెండవది అమాయకత్వం అనిపించింది. నాకు తెలిసిన/అనిపించిన వివరణ ఇస్తున్నాను. * ఒక పత్రికలో లేదా మీడియా గ్రూప్ లో వచ్చేవన్నీ అబద్ధాలే అవుతాయా? మన దగ్గర ఒక్కో మీడియా గ్రూప్ కు సంబంధించిన యాజమాన్యానికి ఒక పార్టీ లేదా సిద్ధాంతం పట్ల అభిమానం ఉంటుంది. ఆ మీడియా గ్రూప్ లో పనిచేసే సిబ్బందికి, వారి వ్యక్తిగత ఇష్టాయిష్టాలు, పత్రికా విలువలు కంటే యాజమాన్యం అభీష్టానికి అనుగుణంగా పనిచేయడమే రావాలి. అలాంటివారే ఉంటారు. అయితే ఇదంతా మాక్సిమం స్థానిక రాజకీయాల వరకే పరిమితమై ఉంటుంది, కొన్నిసార్లు స్థానికంగా ప్రభావితం చేయగల జాతీయ రాజకీయ అంశాలు/పార్టీల పట్ల కూడా అది కనబడుతుంది. అవి కాక మిగతా అంశాలు అవి తాము అభిమానించే పార్టీలను ప్రభావితం చేస్తాయని అనుమానపడనంతవరకూవాటిపట్ల ఒక ప్రత్యేకధోరణి కనబడదు - వార్తల్లాగానే అంది...