వంశీ వ్యూ పాయింట్ // ... 'ఆమిర్' (2008) //
క్వారంటైన్ ఫిలిం సజెషన్స్ - 1 ( క్వారంటైన్ అనే కాదు, జనరల్ గా కూడా) వంశీ వ్యూ పాయింట్ // ... 'ఆమిర్' (2008) // *************************************** నిద్దర్లో ఏదైనా పీడకల వస్తే, మెలకువ వచ్చాక తిరిగి నిద్రపోలేం - ఆ కల కలవరపెడుతుంది. జీవితంలో ఏదైనా అనుకోని షాకింగ్ ఘటన జరిగితే, కోలుకోవటానికి చాలాకాలం పడుతుంది. మనమెక్కడో దూరంగా ఉంటాం లేదా దూర ప్రాంతానికి వెళ్లి - తిరిగి మన ఊరు రాగానే - బస్సు స్టాండ్/రైల్వే స్టేషన్/ఎయిర్పోర్ట్ లో ఉండగానే ఎవరైనా ఫోన్ మీ కుటుంబ సభ్యులను కిడ్నాప్ చేశాం అని చెబితే ఎలా ఉంటుంది - బాధ, కోపం, ఉద్వేగం ఏమో మనం ఎన్ని రాసుకున్నా, అది అనుభవించేవాడికి ఒక తీవ్ర కష్టం. లండన్ నుండి కుటుంబాన్ని కలవడానికి వచ్చిన ఆమిర్ కు ఎయిర్పోర్ట్ లో ఉండగానే అలాంటి ఒక ఫోన్ కాల్ వస్తుంది. ఇక అక్కడి నుండి ఆమిర్ వాళ్ళు ఫోన్ లో చెప్పే రీతిలో చేయక తప్పని పరిస్థితులు కల్పిస్తూ, అతడి చేత తాము అనుకున్నపని చేయించాలని కనిపించని విలన్స్ చేసే ప్రయత్నమే ఆమిర్. ఇవాళ్టి రోజుల్లో మనం అన...