... కొత్తవంట

వంశీ కలుగోట్ల // ... కొత్తవంట //
*****************************
          అప్పుడప్పుడూ మనమూ గరిట పడతామండోయ్, మరీ నలభీమపాకం అని కాకపోయినా తినబుల్ గా ఉండే స్థాయిలో వండుతాం అనుకోండి. అయినా మానవన్నీ కొన్ని ఫిక్స్డ్ ఐటమ్స్, అవి దాటి చెయ్యం - అంటే ఏదో సాంబార్, రసం, పప్పు, వేపుళ్ళు, కొన్ని టిఫిన్ ఐటమ్స్ అన్నమాట. మొన్నీమధ్య అలానే ఒకసారి సాంబార్, వేపుడు చేశాను చాలా రోజుల తరువాత. అందరూ తినడం మొదలెట్టినప్పటినుండి, ఇక 'ఎలా ఉంది?' అని అడగటం మొదలెట్టాను. బావుంది, బావుంది అని చెప్పి చివరకు విసుగొచ్చి 'ఏరా అక్కడికి నువ్వేదో నవకాయ పిండివంటలు కొత్తగా చేసినట్టు అలా ఆడుతావేంటి? చేసింది అదే సాంబార్, ఆలుగడ్డ వేపుడు అంతే కదా. ఎప్పటిలానే ఉన్నాయి' అన్నారు. 'అదేంటి నేను ఎప్పటిలా ఎంటీఆర్ సాంబార్ పొడి కాకుండా, ఆచి సాంబార్ పొడి; ఎంటీఆర్ కారంపొడి కాకుండా ఆశీర్వాద్ కారంపొడి వాడానే' అన్నాను. 'అరేయ్ ఎదవ సాంబార్ పొడి, కారంపొడి బ్రాండ్స్ మారిస్తే పెద్ద కొత్త వంట చేసినట్టా? నువ్వూ, నీ వెధవ బిల్డ్ అప్పూనూ' అనలేదు కానీ, అదే ఫీలింగ్ తో ఒక లుక్ ఇచ్చి, తినడం ముగించారు. 
*
          మొన్న సెలవులకు ఫ్రెండ్ వచ్చాడు. సినిమాల్లో పని చేస్తుంటాడు లెండి దర్శకత్వ శాఖలో. ఫాఫమ్ డల్ గా ఉంటే వివరం అడిగాను. కొత్త సినిమాలన్నీ పాత కథలే అంటున్నారని తెగ ఫీలవుతున్నాడు వాడు. 'మా డైరెక్టర్స్ కష్టాలు మీకేం తెలుసురా? మేమెలా తీసినా, పేర్లు పెడతారు. పెద్ద హీరో, క్రేజీ హీరోయిన్, సీనియర్ ఆర్టిస్ట్స్ అందరినీ పెట్టి తీసినా సినిమా సూడడం మానేసి ఏవేవో అంటారు. మా కష్టాలు మీకేం తెలుసు?' అని తెగ ఇదైపోయాడనుకోండి. 
*
రెండు వేర్వేరు అంశాలుగా చదవవలసిందిగా మనవి. 

Comments

Popular posts from this blog

... కరోనా కంటే ఎక్కువగా భయపెడుతున్న అంశం?

... మూడో కూటమి

... 2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు - జనసేన