... ఓ సినిమా కథ - పార్ట్ 1

వంశీ కలుగోట్ల // ... ఓ సినిమా కథ - పార్ట్ 1//
***************************************
(బొక్కలెతక్కుండా ఎంజాయ్ చెయ్యండి)

            బాహుబలి మాతృ పెనిమిటి లాంటి సినిమాల రికార్డులు కూడా బద్దలు కొట్టగలిగే సినిమా కథ - ఎవరైనా ఫ్రీగా వాడుకోవచ్చు లేదా నా పేరు వేసుకొని మరీ వాడుకోవచ్చు. 
            హీరో ఒక తోపు, కానీ తాను తోపు అన్న సంగతి తెలియకుండా కాశ్మీర్ లో కూలీగా పని చేస్తుంటాడు. ఇక్కడ కూలీలతో ఒక సాంగ్. అలాగే కూలీలను బెదిరించటానికొచ్చిన ఉగ్రవాదులతో ఒక ఫైట్. అలా పగలు కాశ్మీర్ లో కూలీగా చేస్తూ, రాత్రి ఢిల్లీలో ఏదో విషయం మీద ఇఇన్వెస్టిగేషన్ చేస్తుంటాడు. సినిమాల్లో అది సాధ్యమే కాబట్టి, ఎలా అని అడక్కండి. హీరోయిన్ కూడా ఢిల్లీలోనే ఉంటుంది - ఆమె ఒకరోజు రాత్రి బాగా తాగి, రోడ్డు మీద పడిపోతే, అదే రోడ్డున పోతూ ఆమెను తీసికెళ్ళి తన రూమ్ లో పాడుకోబెడతాడు. హీరో ఔదార్యానికి హీరోయిన్ పడిపోతుంది. ఇక్కడ స్విట్జర్లాండ్ లొకేషన్స్ లో ఒక సాంగ్. తరువాత కట్ చేస్తే హీరో ఫోటో పట్టుకుని ఆంధ్రా/తెలంగాణాలో కొంతమంది సుమోలేసుకుని వెతుకుతుంటారు. 
            ముఖ్యమంత్రి మాత్రం తప్పిపోయిన (పారిపోయిన అనుకోండి) తన కూతురు కోసం వెతుక్కుంటూ ఢిల్లీకి వచ్చి, తన కూతురును కనుక్కుంటాడు. ఆమె మన హీరోయిన్. అదే సమయంలో ఆమె హీరోను ప్రేమిస్తోందని తెలిసి, హీరోను కలుస్తాడు. హీరోను చూసిన వెంటనే మూర్ఛపోయి, మళ్ళీ లేచి కాళ్లకు మొక్కుతాడు. అపుడు ఫ్లాష్ బ్యాక్. ఆంధ్ర/తెలంగాణకు ముఖ్యమంత్రిగా ఉన్న హీరో ఎన్నో మంచి పనులు చేస్తుంటాడు. ఇక్కడ 'దేవుడిని మించిన మానవుడివి నీవయ్యా' అంటూ వేలాది మందితో ఒక మాంటేజ్ సాంగ్. ప్రతిపక్ష విలన్ గ్యాంగ్ అన్నిటిని అడ్డుకుంటుంటుంది. ఇక్కడ వాళ్ళ మీటింగ్ లో ఒక ఐటెం సాంగ్. వారికి అంత ధైర్యం ఎలా వచ్చింది అని ఎంక్వయిరీ చేస్తే, వాళ్ళ వెనుక పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలు ఉన్నాయని తెలుస్తుంది. దాంతో తన నమ్మకస్తుడైన వ్యక్తిని (హీరోయిన్ ఫాదర్) ని ముఖ్యమంత్రిగా చేసి, తాను కాశ్మీర్ లో కూలీగా పని చేస్తూఆంధ్రా/తెలంగాణలో ప్రతిపక్షాలకు సహాయం చేస్తున్న ఉగ్రవాద సంస్థల ఆనుపానులు తెలుసుకుంటాడు; అలాగే ఢిల్లీలో వాళ్లకు మడ్దతుగా ఉన్నవారి గురించి కూడా. ఇక క్లైమాక్స్ లో ఉగ్రవాద సంస్థలన్నిటిని రూపుమాపి, తిరిగి ముఖ్యమంత్రి అవుతాడు. 
            మన హీరో గొప్పతనం, ధైర్యం, సాహసం, మంచితనం వంటివన్నీ తెలుసుకున్న ఉత్తరాది రాష్ట్రాల నుండి ముఖ్యమంత్రులు, జనాలు అందరూ వచ్చి 'నువ్వు దేవుడివయ్యా, నువ్వు ప్రధానివి కావాలి' అంటారు. అపుడు హీరో 'దేవుడు శాసిస్తే నేను కాదనను' అంటాడు. అదే సమయంలో హీరోకు అమెరికానుంది ఒక కాల్ వస్తుంది, హీరో సీరియస్ గా మారిపోయి 'ఆపరేషన్ స్టార్ట్ ...' అంటాడు. మిగతాది పార్ట్ 2 లో (... సీక్వెల్ లో హీరో ప్రధాని ఎలా అవుతాడు, దానికి కారణం ఏంటి అనేది ఉంటాయి) 

Comments

  1. This story is suitable for Mahesh Babu or Vijay.

    Our heroes descend as incarnations of God and can fix anything in a giffy.

    In the process they do have time for romance with dumb heroines and yes they can sing and dance weirdly.

    They can smash a posse of goons singlehandedly and sip coffee too.

    In short they are supernatural.

    This Story is fit for freemake.

    ReplyDelete
  2. Forgot one more faculty. Our heroes can slap and insult everyone around. This is stand up comedy.

    ReplyDelete
  3. Anna, nee kalmokta, Em rasinavanna

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

... మూడో కూటమి

... కరోనా కంటే ఎక్కువగా భయపెడుతున్న అంశం?

... 2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు - జనసేన