... వాడు - వీడు: మనోభావాలు

వంశీ కలుగోట్ల // ... వాడు - వీడు: మనోభావాలు // 
***************************************************
వాడు: అరేయ్ ఇట్రా 

వీడు: అరేయ్, ఒరేయ్ అనకు. మా మనోభావాలు దెబ్బతింటాయి 

వాడు: ఉన్నట్టుండి ఏమైంది? తిక్కతిక్కగా ఉందా? 

వీడు: అలా అనకు, తిక్కోళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి 

వాడు: అసలు ఏమనుకుంటున్నావురా?

వీడు: అలా అనకు, ఏమీ అనుకోని వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి 

వాడు: ఓరి దేవుడో, ఏందీ ఈ గోల 

వీడు: అలా అన్నావంటే, దేవుడిని నమ్మేవాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి 

వాడు: నీ ... వద్దులే, ఈ పెంటతో నాకెందుకు

వీడు: అలా అన్నావంటే అస్సలు బావోదు. పెంట సంబంధిత పనులు (లెట్రిన్ గుంతలు క్లీనింగ్ గట్రా చేసేవారు) చేసేవాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి. వాళ్ళు పనిమానేస్తే కష్టం. 

వాడు: అసలేమైంది నీకు? ఈ మధ్య ఆర్జీవీ సినిమా ఏమైనా చూశావా? 

వీడు: నీకు దండం ఉంటాది. ఈ ప్రపంచంలో ఎవరి మనోభావాలనైనా దెబ్బ తియ్, పర్లేదు. మహా అయితే కేసులు పెడతారు, దాడులు చేస్తారు. కానీ ఆర్జీవీ మనోభావాలను దెబ్బ తీయకు. దెబ్బ తిన్న మనోభావాల కోసం, ఆ మనోభావాలను దెబ్బ తీసిన వారి మనోభావాలు దెబ్బతినేలా సినిమాలు తీసి, సావదొబ్బుతాడు. 

వాడు: 😇😇😇

గమనిక: ఇందంతా ఊరికినే, తూచ్ అన్నమాట - నా మనోభావాలు దెబ్బతినలేదని, మనోభావాలు దెబ్బతిన్నవాళ్ళ మనోభావాలు ఎలా ఉంటాయోనని, దెబ్బతినని నా మనోభావాలను చెప్పలేక, దెబ్బతిన్న వాళ్ళ మనోభావాలను దెబ్బతినకుండానే దెబ్బతిన్నట్టు ఉంటే ఎలా ఉంటుందోనని ఊహించి రాసిన ఈ రాతలుఎవరో ఒకరి మనోభావాలను దెబ్బతీయాలని నేను అనుకున్నానని మీరనుకుంటే అపుడైనా నా మనోభావాలు దెబ్బతింటాయని ఒక చిన్న ఆశ
 

Comments

  1. మీ టపా వలన నా మనోభావాలు దెబ్బతిన్నాయి. ఆ విషయం చెప్దామని కామెంట్ రాయడం మొదలెట్టా. నా కామెంటుతో మీ మనోభావాలు దెబ్బ తింటాయేమోనని ఇంతటితో ఆపేస్తున్నా. ఇంతే సంగతులు చిత్తగించవలెను. ఇట్లు: ఎల్లప్పుడూ మీ మనోభావాలను గౌరవించే మీ "మనోజ్".

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

... మూడో కూటమి

... కరోనా కంటే ఎక్కువగా భయపెడుతున్న అంశం?

... 2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు - జనసేన