... మాది రాయలసీమ
వంశీ కలుగోట్ల // ... మాది రాయలసీమ //
************************ ******************
రాయలసీమ రౌడీలు
కడప రౌడీలు
పులివెందుల గూండాలు
ఇవీ మన గౌరవ మాజీ ముఖ్యమంత్రివర్యులు మరియు మహా ప్రముఖ నటులు, జనసేనాని అనేక సందర్భాలలో వాడిన పదాలు. నిజంగా రాయలసీమవాసులు వారు పేర్కొనేంతటి కరడుగట్టిన రౌడీలు అయ్యుంటే, రాయలసీమలోకి వచ్చాక సరిహద్దులు దాటి అడుగు బయటకు పెట్టగలిగేవాళ్ళు కాదు. కానీ, తన మీద హత్యాయత్నం చేసిన ప్రాంతం వారిని జగన్ ఏనాడూ రౌడీలనో, హంతకులనో అనలేదు. ఒక్కరి/కొందరి చర్యలకు, ప్రాంతానికి సంబంధం లేదన్న కనీసపాటి విజ్ఞత లేని వాడిలా ప్రవర్తించలేదు. జరిగిన ప్రతి ఘటననూ ప్రతిపక్షానికే ఆపాదించి, రాయలసీమ రౌడీలని (తనదీ రాయలసీమేనన్న ఇంగిత జ్ఞానం కూడా లేకుండా) ఆయన అనటం; ఆ తరువాత కొన్నాళ్ళకు పులివెందుల గూండాల చర్యలను సహించనని జనసేనాని తందానా తాళమేయడం. ఇంతా చేసి ఆ ఇద్దరి మీదా ఎటువంటి వ్యక్తిగత దాడి కూడా వారు పేర్కొంటున్న ప్రాంతాల వారు చెయ్యలేదు, ఇక ఆ నటుడిపై జరుపడిందని చెప్పబడుతున్న దాడి కూడా ఇప్పుడాయన తందానా తాళమేస్తున్న పార్టీకి చెందినవారే చేశారని గాలివార్తలు.
అయినా అపుడంతా మౌనం వహించిన వాళ్ళందరూ ఇపుడు రౌడీ రాజ్యం వచ్చింది అని బాధపడుతున్నారు. ఇంకా జగన్ ప్రమాణ స్వీకారం కూడా చేయలేదు. అయినా ఒకసారి కావాలంటే ఆర్టీఐ ఉపయోగించి, ఎవరి హయాంలో ఎక్కువ క్రైమ్ రేట్ ఉండిందో తెలుసుకోవచ్చు. అమావాస్య తెలివి ముఖాలకు అంతటి యోచన ఎలా వస్తుందిలే, ఏదో ఏ చంద్రజ్యోతివాడో లేక ఈనాడులోనో రాస్తే అదే నిజమని నమ్మే గొప్పవారు కదా. పోలింగ్ రోజుకు ముందువరకూ జరిగిన ప్రచార వీడియోస్ ఒకసారి తిరగేస్తే తోలు తీస్తా, తాట తీస్తా, తరిమి కొడతా, అదీ ఇదీ అంటూ పట్టలేనంత ఆవేశంతో వేదికలపై ఊగిపోయినదెవరు? కులం పేరును ప్రస్తావిస్తూ 'అతడేం రెడ్డి' అంటూ రెచ్చగొట్టటానికి ప్రయత్నించిందెవరు? మగతనం, కులం ప్రస్తావన తెచ్చిందెవరు? రాయలసీమ రౌడీలు, పులివెందుల గూండాలు అంటూ ఊగిపోయిందెవరు? సమాధానాలున్నాయా?
ఇపుడు జగన్ గెలుపు గురించి బాధ పడుతూ, రౌడీ రాజ్యం వచ్చిందని బాధపడుతున్న మహానుభావులందరూ ఎన్నికలకు ముందు ఏం చేస్తున్నారు? మీ ప్రయత్నం మీరు చెయ్యాల్సింది అతడికి గెలుపు దక్కకుండా. కనీసం పోరాడామన్న ఆనందమన్నా దక్కుండేది మీకు. అయినా దాదాపు 85% కి పైగా సీట్లను, 50% కి పైగా ఓట్లను సాధించాడంటే ఏమిటర్థం? మీరు సమర్థించే పార్టీ/వ్యక్తి మీరిప్పుడు ఇతడిని ఎలా భావిస్తున్నారో అంతకంటే దిగువన ఉన్నాడని అధిక సంఖ్యాక ప్రజలు అనుకున్నారు/నమ్మారు, నమ్మి ఇతడికి ఓట్ వేశారు అని అర్థం కావచ్చు కదా. ఎందుకంటే ఇదే మీరు 2014 లో జగన్ ను జనాలు ఎన్నుకోలేదంటే అతడి అవినీతిని నమ్మారు, అతడు రౌడీ అని నమ్మారు గట్రా చెప్పారు కదా. అది నిజమైనపుడు, ఇదీ నిజమే అవుతుంది కదా. ఇపుడు ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారు, వేచి చూద్దాం. అతడు రౌడీ రాజ్యమే చేస్తే, అరాచక పాలనే చేస్తే - ప్రత్యామ్నాయం లేకపోయినా సరే పాతరేస్తారు జనాలు. రాజకీయ నాయకులు తమదాకా రానంతవరకూ ఏం చేసినా పట్టించుకోరు జనాలు, అదే తమదాకా వస్తే తమదైన రోజున మడత పెట్టి, అస్సామ్ కు పార్సెల్ చేస్తారని ఈ ఎన్నికలు నిరూపిస్తున్నాయి. జనాలు మీరనుకున్నంత మూర్ఖులు కాదు. ఎన్నికల్లో కేవలం డబ్బు, మందు మాత్రమే ప్రభావం చూపవు. మంచితనం కంటే సమర్థులకే జనాలు పట్టం కడతారు.
* . * . *
మేమిక్కడ, రాయలసీమ గడ్డమీద
తినడానికి తిండి సరిగా లేకపోయినా
మొక్క మొలవని చేనులో
మా పోరాటం చేస్తూనే ఉంటాం
కురవని వాన దోబూచులాడుతున్నా
భూమినే నమ్ముకుని బతుకుతుంటాం
ఈ సీమ బతుకునిచ్చింది, బతకనిచ్చింది
కానీ, నువ్వు మాత్రం అక్కడెక్కడో ఉండి
మా గురించి కథలల్లుతావు
కత్తులు పట్టకపోతే తిరగలేమని
నీరు పారకపోయినా
రక్తాలు పారించుకునే కక్షలు మావని
కన్నబిడ్డలను చంపుకునే పగలు మావని
మీరు సినిమాలు తీస్తారు
రాయలసీమ రౌడీలు అంటారు
పులివెందుల గూండాలంటారు
కడప రౌడీలు అంటారు
ఈ సీమ గడ్డమీద నిలబడి
సీమోళ్ళనే నోటికొచ్చిన మాటలు అన్నా
నిన్నెవరూ ఏమీ అనరు ... నువ్వు క్షేమమే
ఇక్కడ అలవాటైపోయిన బతుకులు నీకు తెలుసా
ఒక్క చుక్క వర్షం పడినా పంట వేస్తారు
వర్షం పడేవరకూ ఎదురు చూస్తారు
ఆకాశం మీద అరుస్తామా, పొలం మీద కోప్పడతామా చెప్పు
అందుకే, నీమీద కూడా కోపం ఏమీ లేదబ్బా
నువ్వన్నదానికంతటికీ కలిపి ఒకటే సమాధానం చెప్పేశాం - ఓటుతో
మాది రాయలసీమే ... కానీ, చంపుకోవడాలు మా వృత్తి కాదబ్బా
నువ్వెప్పుడొచ్చినా, మాకున్నదాం ట్లో ఇంత తిండి పెడతాం ... రా
ఓట్ల శాతం 50 % అని ఒప్పుకున్నందుకు సంతోషం. పోయినసారి బీజేపీ మరియు పవన్ కళ్యాణ్ గార్ల దయాదాక్షిణ్యాలతో చంద్రబాబు గారికి 1 కోటి 57 లక్షల ఓట్లు వస్తే ఈసారి కేసీఆర్ గారి దయాదాక్షిణ్యాలతో జగన్ గారికి 1 కోటి 56 లక్షల ఓట్లు వచ్చాయి.
ReplyDeleteఎవరి సహాయమూ తీసుకోకుండా చంద్రబాబు గారికి 1 కోటి 23 లక్షల ఓట్లు వచ్చాయి. సామాన్యులెవరూ ఓట్ల లెక్క చూడరు కదా ?
నా పోస్ట్ కు మీ వ్యాఖ్యకు సంబంధమేంటి? అయినా ఓట్ల శాతం గురించి మాట్లాడారు కాబట్టి అడుగుతున్నాను - జగన్ ఒంటరిగా ఎన్నికలను ఎదుర్కొన్నాడు, వేరెవరినీ మద్దతుగా కనీసం ప్రచారానికి కూడా తెచ్చుకోలేదు. చంద్రబాబు అంటే నచ్చనివారు, జగన్ కి మద్దతిస్తాం అని ఉండవచ్చు. ఒవైసి జగన్ కోరితే, తానూ ఆంధ్రాలో ప్రచారం చేస్తానన్నాడు. కానీ, జగన్ ఎవరి సహాయం కోరలేదు. టీవీ9 మరియు ఎన్డీ టీవీ ఇంటర్వూస్ మీరు చూడలేదేమో. అదే చంద్రబాబు విషయానికి వస్తే మమత, కేజ్రీవాల్, దేవెగౌడ, ఫరూక్ అబ్దుల్లా తదితర జాతీయ నేతలను పిలుచుకొచ్చి ప్రచారం చేయించుకున్నారు. కెసిఆర్ సహాయం తీసుకున్నాడని మీలాంటి తెదేపా అభిమానులు అంటే సరిపోదు, ఒక్కచోటైనా కలిసి పోటీ చేసినట్టు, లేదా ఒక్క తెరాస నేత ఆంధ్రప్రదేశ్ కు వచ్చి జగన్ కు వోటెయ్యమని అడిగినట్టు ఆధారాలు చూపండి ఆ తరువాత మాట్లాడుకుందాం. ఇక మీరు ఇంకేమైనా చెప్పదలచుకుంటే పోస్ట్ లో ప్రస్తావించబడిన ప్రధాన అంశం గురించి వ్యాఖ్యానించండి.
Deletehttps://www.facebook.com/ysrcongressyatra/videos/327898817881125/
Delete2014 ఎన్నికలలో టీడీపీకి వచ్చిన ఓట్లు 12,916,773. నీహారిక గారు చెప్తున్న "1 కోటి 57 లక్షల ఓట్లు" కరెక్ట్ కాదు. ఆవిడ లెక్కలలో 34 లక్షల (అనగా 25%) పొరపాటు.
DeleteJai garu మనం చెప్పే ఇంతటి వివరణాత్మక విశ్లేషణ వారికి అనవసరం అండి, ఏదో ఈనాడు లేదా చంద్రజ్యోతిలో వస్తే అదే నిజం అనుకునే టైపు జనాలు చాలామంది ఉన్నారు.
Deleteఅవునండీ. వీళ్ళను చూస్తే మా చిన్నప్పుడు సోపతిగాళ్లు స్కూలుకు డుమ్మా కొడితే పిల్లకాయలు పాడుకునే పాట గుర్తుకు వస్తుంది.
Deleteపప్పూ రావు
బడికీ రావు
ఎందుకు రావు
లెక్కలు రావు
Everyone can have their own opinions but twisting facts is not acceptable.
:)
Deletehttps://en.m.wikipedia.org/wiki/2014_Andhra_Pradesh_Legislative_Assembly_election
DeleteI think the total number of votes for both TDP n YSRCP given in the link are from united AP, because elections happened in united AP and Telangana was officially formed on June 2nd.
DeleteYes but even this count is not very correct as it seems to be based on preliminary results, not final published ECI figure.
DeleteAnyhow 2014 Andhra (175 constituencies) vote count for major parties is as follows:
TDP: 12,916,773
YCP: 12,907,324
INC: 802,072
BJP: 632,599
Even in 2014, TDP got just 9,449 votes more than YCP
>>>అయినా దాదాపు 85% కి పైగా సీట్లను, 50% కి పైగా ఓట్లను సాధించాడంటే ఏమిటర్థం? >>
ReplyDeleteఇది మీరు అడిగిన ప్రశ్నేగా ? రాయలసీమ రౌడీలాగా మాట్లాడతానంటే నేనూ సిద్ధమే ! నా వ్యాఖ్యలు ప్రచురించడానికి దమ్ముండాలి కదా ?
మొదటగా రాయలసీమ రౌడీ అన్న మీ వ్యాఖ్యను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. బహుశా, మీరాభిమానించే నేతలాగే మీరూ ఇంగితం లేకుండా మాట్లాడటం అలవాటు చేసుకున్నారేమో, కానీ నేను కాదు. నేను స్పష్టంగా వివరణ ఇచ్చాను, అలాగే పోస్ట్ లోని ప్రధాన అంశంపై చర్చించమని అడిగాను. అలా కాదని, మీరు కూడా పోస్ట్ కు పెద్దగా సంబంధం లేని విషయంపై కావాలని రెచ్చగొట్టే తీరున, ప్రాంతాల పేరును ప్రస్తావిస్తూ వ్యాఖ్యానిస్తున్నారు. నాకు ఏ ఇతర ప్రాంతం మీదా ద్వేషం లేదు. మీకు చేతనైతే, విషయం ఉంటే పోస్ట్ కు సంబంధించి వ్యాఖ్యానించండి, ప్రాంతాలను కించపరుస్తూ కాదు. న దమ్ము, ధైర్యం గురించి తెలుసుకోవాలంటే అది వేరే విషయం.
Deleteమాటిమాటికీ రాయలసీమ గూండాలు లేదా కడప రౌడీలు అంటారు. అందరికంటే ముందు ఫాక్షన్ తగాదాలు పెంచి పోషించింది డ్రామారావు & అతగాడి అల్లుళ్ళు. జమ్మలమడుగు శివారెడ్డి, ప్రొద్దుటూరు రమణా రెడ్డి, పరిటాల రవి, కోడెల శివప్రసాద రావు, మద్దూరి సుబ్బారెడ్డి లాంటి "పేరు మోసిన" ముఠాకోరులు 1983 తరువాతే పచ్చ పార్టీ ప్రోద్బలంతో ఎదిగారు.
ReplyDeleteరాయలసీమ ఆప్యాయతకు, అనురాగాభిమానాలకు, కళలకు, కవిత్వానికి పెట్టింది పేరు. తాము పస్తులున్నా అతిథి కడుపు నింపాలన్న సద్గుణం సీమ జనం ప్రత్యేకత. అంతటి పుణ్యభూమికి తమ పబ్బం గడుపుకుందామని చెడ్డపేరు తెచ్చారు నందమురికి & నారాసుర మూక.
మంచి వాక్యాలు, అభినందనలు మరియు కృతజ్ఞతలు. కొందరికి ఎంత చెప్పినా వృధా ...
Deleteమీ కవిత్వాన్ని ఎత్తి నా "గోడ"మీద పిడకేసుకున్నానండి. బాగా రాశారు. మీకు అభ్యంతరమయితే దాన్ని డిలీట్ చేయగల వాడను.
ReplyDelete==========================
రాయలసీమ అంటేనే ఫ్యాక్షన్, కొడును చంపిన తండ్రి, పెళ్ళాన్ని అస్సలు మనిషిగా చూడని "రౌడీ విలన్". అప్పుడు ఒక హీరో వస్తాడు. కొడుకును ప్రేమగా చూడడం ఎలానో నేర్పిస్తాడు. ఆ హీరో ఫెమినిస్టు కూడా.. వంట గదిలో బందీ అయిన ఆడోళ్ళందరినీ బయటకి తీసుకొచ్చి, వాల్లకు స్వేచ్ఛా ప్రపంచాన్ని పరిచయం చేస్తాడు.
ఇట్టాంటి స్టోరీలు ఎన్ని చూసుంటారు మీరు? బోలెడు అవునా ..? అలాంటి వాటికి అలవాటు పడీ పడీ వదిలేశాం. ఎల్లెహె చెప్పుకోపో.. మా గురించి మాకు తెలుసు, నీ సర్టిఫికేట్లు మాకక్కరలేదు అని. ఒకతను కొంచెం ఓపిక చేసుకుని కవిత రాశాడు.
ధన్యవాదాలు. ఒరిజినల్ రచయితకు క్రెడిట్స్ ఇచ్చినపుడు డిలీట్ చెయ్యాల్సిన అవసరం లేదు. ఫేస్ బుక్ లో ఆడ్ చేసుకోండి, నా ఫేస్ బుక్ ఐడి VamsiGayatriKalugotla
Deleteతవిక నచ్చి పెట్టుకున్నాడు. క్రెడిట్స్ దేనికి బయ్యా.
Deletenacchi pettukunte oddanalede ... kaanee, adi vaaru raasinattugaa kaaka original rachayita/kavi refernce to pettaalani maatrame soochinchaanu. meeku nacchakapoyi undavacchu kaanee, tavika anatam mee sabhyataku vadilestunnaanu. ayinaa bhaavam arthamaindane bhaavistunnaanu ...
Delete