... ఉదయపు కాంతులు

వంశీ కలుగోట్ల // ... ఉదయపు కాంతులు //
*************************************
చిన్నప్పుడు, మాకు తెలిసినవాళ్ళ బంధువు కుటుంబం మా ఊరికి వలస వచ్చింది, వాళ్ళున్న ఊరిలో చేసిన అప్పులకు ఉన్న కొద్దిపాటి ఆస్థి కరిగిపోయి, వేరే దిక్కు లేక మా ఊళ్ళో ఉన్న బంధువు ఆదుకుంటాడని వచ్చారు. ఆ తరువాత అతను ప్రతిరోజూ ఉదయం ఊరిలో తిరుగుతూ
ఇడ్లీలు అమ్మేవాడు. అలాగే సాయంకాలం బజ్జీలు గట్రా. వాళ్ళ బంధువుల ఇంటికి పక్కనే ఒక చిన్న రూమ్ లో ఉండేవారు. అలా కొన్ని సంవత్సరాలు గడిచేసరికి అతను తను ఉంటున్న రూమ్ కొని, మరొక గది కట్టించుకున్నాడు. పాత అప్పులు తీర్చి, మా ఊరిలో వాళ్లకు తనే అప్పులు ఇచ్చాడు. అలా కొంత స్థాయికి బాగానే ఎదిగాడు. (కాకపొతే ఆ ఎదుగుదల విపరీతం కాలేదు - ఒక స్థాయికి ఆగింది.) ఆ తరువాత వాళ్ళు మళ్ళీ నంద్యాలకో లేక కర్నూలుకో వలస వెళ్లి అక్కడ భోజనం హోటల్ పెట్టుకున్నారని విన్నాను. వారు మా ఊరికి వలస వచ్చేసరికి వారి పరిస్థితి అత్యంత దయనీయంగా ఉండేది - సినిమా కష్టాలు అంటామే అలా. కానీ, ధైర్యం కోల్పోకుండా నిలబడి పోరాడిన తీరు నాకు నచ్చింది. నేను ఇప్పటికీ అతడి గురించి కొందరికి చెబుతుంటాను - కష్టాలను ఒలకబోసుకుని సానుభూతి కోరుకునేవారికి. ఈ మధ్యన ప్రతి చిన్న కష్టానికి విపరీతంగా స్పందిస్తూ అఘాయిత్యాలు చేసేవారిని చూస్తుంటే నాకు అతడే గుర్తొస్తున్నాడు. (అతడి పేరు గుర్తు లేదు, ప్రస్తుతం వారెక్కడ ఉన్నారో తెలీదు) ఎక్కడో చదివాను 'రాత్రి చీకటి ఉందని ఏడవకూడదు, వేచి చూడగలిగితే ఉదయపు కాంతులను చూడవచ్చు' అని. ఇది కథ కాదు, నేను చూసిన ఒక జీవితం.

Comments

Popular posts from this blog

... మూడో కూటమి

... కరోనా కంటే ఎక్కువగా భయపెడుతున్న అంశం?

... 2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు - జనసేన