... మొలకలొస్తాయ్

వంశీ కలుగోట్ల // ... మొలకలొస్తాయ్ //
********************************
సుబ్బిగాడు: ఒరేయ్ అప్పిగా, ఇంక భయం లేదురా. మన పొలాల్లో మొలకలొస్తాయిరోయ్ ...
అప్పిగాడు: అదేంట్రా సుబ్బిగా, అసలు వానలే పడలేదు; బోర్లల్లో నీళ్లు లేవు. మొలకలెక్కడినుండి వస్తాయి ...!?
సుబ్బిగాడు: అది గాదురా అప్పిగా, అక్కడెక్కడో మహారాష్ట్రలో వానలు బడినాయని నిన్న వార్తల్లో సెప్పినారు.
అప్పిగాడు: అక్కడ వానలు బడితే, ఇక్కడ మొలకలెట్టా వస్తాయిరా సన్నాసీ ...
సుబ్బిగాడు: ఎందుకు రావురా!? అక్కడ మర్దర్లు జరిగితే ఇక్కడ జరుగుతన్నయ్, ఆడ ఎక్కడనో ఎదో సేస్తే ఇక్కడోల్లు ఓట్లేత్తన్నారు. అట్టాటియి జరిగినపుడు ఆడెక్కడనో వాన బడితే ఈడ మొలకలు రావా!? సూత్తా ఉందురోయ్ ... మన పొలాల్లో మొలకలొత్తాయ్

Comments

Popular posts from this blog

... మూడో కూటమి

... కరోనా కంటే ఎక్కువగా భయపెడుతున్న అంశం?

... 2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు - జనసేన