సర్దార్ గబ్బర్ సింగ్ ...

సర్దార్ గబ్బర్ సింగ్ ...
**********************
గబ్బర్ సింగ్ మొదటి భాగంలో అంత్యాక్షరి సన్నివేశంలో ఒక తమాషా సంభాషణ ఉంటుంది. గబ్బర్ సింగ్ ఒక రౌడీని పాటలో బేస్ లేదు అని అంటే 'బ్రెయిన్ కాడ గన్ను పెట్టి బేస్ అంటే ఎట్టా వస్తాది సారూ' అంటాడు. 'సర్దార్ గబ్బర్ సింగ్' చిత్రరాజానికి పని చేసిన అందరి పరిస్థితి బహుశా ఆ రౌడి పరిస్థితి లాంటిదే అయినట్టుంది.
కథ రాసింది ఎవరు? పవన్
చిత్రానువాదం (స్క్రీన్ ప్లే) ఎవరు? పవన్

నిర్మాత ఎవరు? పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ మరియు పవన్ స్నేహితులు
'కథ ఎలా ఉంది?' అని అడిగితే ఎవరైనా ఏం చెప్పగలరు? 'మీరు రాసిన కథ బాలేదు, ఇది ఇక్కడ మార్చాలి, అది అక్కడ మార్చాలి' గట్రా ఎవరైనా చెప్తే వారినే మార్చేస్తారు. కాబట్టి చిత్రరాజం ఈ విధంగా తయారైనది అని భావించవలసివస్తోంది. ఎవరి పని వారిని చేయనిచ్చి ఉంటే ఇది తప్పకుండా మరో 'గబ్బర్ సింగ్' లాగా అభిమానులను, ప్రజలను, కొన్నోళ్ళను అందరినీ అలరించి ఉండేది.
(పూర్తి రివ్యూ త్వరలో హ హ హ - రాజా సర్దార్ గబ్బర్ సింగ్ కంటే ముందే ఉంటుంది, ఎం చేస్తాం నాక్కూడా రాజకీయాల్లోకి వెళ్లాలని ఉంది, ఇంకో కొన్ని రివ్యూలు, రాతలు రాసాక అప్పటి రాజకీయ పరిస్థితులు చూసి నిర్ణయం తీసుకుంటా)

Comments

Popular posts from this blog

... కరోనా కంటే ఎక్కువగా భయపెడుతున్న అంశం?

... మూడో కూటమి

... 2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు - జనసేన