... పోరాడమని చెప్పండి
వంశీ కలుగోట్ల // ... పోరాడమని చెప్పండి // ****************************** ******* 'ఆ గొంతు, ఆకారం - వీడేంటి, హీరో ఏంటి?' అని చీత్కారాలెదుర్కొన్న వ్యక్తి ఇవాళ ఒక స్ఫూర్తివంతమైన నటుడు, తిరుగులేని మెగాస్టార్ అయ్యాడు. ఒక దిగ్గజంగా వెలుగుతున్న అమితాబ్ బచ్చన్ అయ్యాడు. అతడిప్పుడు భారతీయ సినీ రంగానికి భీష్ముడు లాంటి వ్యక్తి. 'ఈ ... మొఖపోడికి హీరో అవకాశం ఇవ్వాలంట, అది కూడా నా సినిమాలో' అని ఛీత్కారం చేసిన దర్శకాగ్రేసరుడే, తన కాల్షీట్స్ కోసం వారం రోజులు తిరిగే స్థాయికి ఎదిగాడు చిరంజీవి. తెలుగు సినిమా గతిని మార్చిన మెగాస్టార్ గా ఇంకా వెలుగొందుతున్నాడు. అనిల్ కపూర్, షారుఖ్, , ఆమీర్, సల్మాన్, హృతిక్ లాంటివారందరూ అవమానాలు, తిరస్కారాలు ఎదుర్కోలేదా? రజనీకాంత్, అర్జున్, అజిత్, విక్రమ్, రవితేజ, నాని, వీడి కొండా లాంటివారు అవమానాలు, తిరస్కారాలు ఎదుర్కోలేదా? (ఇక్కడ పేర్లు ప్రస్తావించబడని అనేకమంది కూడా) బంధుప్రీతి (నెపోటిజం) ఖచ్చితంగా ఉంది, ఉంటుంది కూడా అది బాలీవుడ్ అయినా, టాలీవుడ్ అయినా? మరింకో వుడ్అయినా. మనకు పెద్దగా పరిచయం లేదు కానీ హాలీవుడ్ లో కూడా ఎంతోకొంత స్థాయిలో ఖచ్చితంగా ఉంటుంది....