Posts

Showing posts from May, 2020

... నన్ను చూసి ఏడవకురా

వంశీ కలుగోట్ల // ... నన్ను చూసి ఏడవకురా //  ***************************************           ఈ మద్దెన శకుంతలాకియా కోర్ట్ తీర్పుల గురించి, కొందరి మాటల గురించి తెగ వర్రీ అయిపోతాంది. 'ఏందే ఇది? ఇయన్నీ ఆటలో అరటిపండులెక్కటివి' అని అక్కడికీ సెప్తిని. అయినా "ఒక పార్టీ ఎమ్మెల్యేల చర్యల పట్ల తీవ్రంగా వ్యాఖ్యానిస్తూ 'ఎంక్వయిరీ ఎందుకు వేయకూడదు?' అని ప్రశ్నించినవారు, ఇపుడు అదే తరహాను వందలమందితో ఆహ్వానమందుకున్న మరొకరి పట్ల చేయగలదా? ఏమిటీ ఈ దారుణం. కనీసం ఆయనకన్నా తెలియదా? అట్టా వందలమంది వస్తే, సెప్పొద్దూ. అనుభవం యాడికి బోయింది. ఇట్టా అయితే ఎట్టా." అని శకుంతలాకియా తన ఆవేదనను వెలిబుచ్చింది.           ఫాఫమ్ శకుంతలాకియా ఆవేదన చూస్తే జాలేసింది. తనకు కాస్త స్వాంతన చేకూర్చటానికి నేను ఇలా చెప్పాను - "ఇద్దో శకుంతలాకియా మనం ఎన్నైనా అనుకోవచ్చు. కొందరు సైన్యాన్ని నమ్ముకుంటారు, కొందరు శతృశిబిరంలోని ద్వారపాలకులను (ప్రత్యేకించి రాత్రిపూట ఉండే) వారిని నమ్ముకుంటారు. కొన్ని వందలేళ్ళ క్రితం ఒక బలమైన రాజ్యంపై అంతకంటే బలమైన మరొక రాజ్యపు రాజు దండయాత్ర చేశాడు. కొన్ని ...

... జగన్ సంవత్సరం పాలన - మరింత మెరుగ్గా పని చేయాలి

వంశీ కలుగోట్ల // ... జగన్ సంవత్సరం పాలన - మరింత మెరుగ్గా పని చేయాలి // ****************************** ***********************************             అష్టకష్టాలూ పడి, అనుకున్నది సాధించిన జగన్మోహన్ రెడ్డి గారు నవీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రెండవ ముఖ్యమంత్రిగా అత్యధికశాతం ప్రజలచే ఎన్నుకోబడి సంవత్సరం ముగిసింది. ఎన్నో ఆశలు, నమ్మకాలతో ప్రజలు అధికారం అప్పగించారు. సరిగ్గా సంవత్సరం క్రితం ఇదే రోజున ఉదయాన్నే టీవీల ముందు కూచున్నాం - బహుశా ఇంత ఉత్కంఠత గతంలో ఎపుడూ లేదేమో. చంద్రబాబు ప్రభుత్వం పట్ల తీవ్ర వ్యతిరేకత ఉందని తెలుసు, అయినా సరే వైఎస్సార్సీపీ అభిమానులలో గెలుపు పట్ల ఏదో అనుమానం - ఎందుకంటే అవతల అపర కౌటిల్యుడుగా పేరొందిన చంద్రబాబు. ఏదో ఒకటి చేసి, మళ్ళీ అధికారంలోకి వస్తాడేమో అని భయం. ఇపుడూ రాకపోతే ఇక జగన్ పని ముగిసినట్టే అని నర్మగర్భవ్యాఖ్యలు. అవతల చంద్రబాబు శిబిరంలో ఓటమి తప్పదని అనిపించేలా ఉన్నా కూడా మేకపోతు గాంభీర్యం. నేర చరిత ఉందని ప్రచారం పొందిన జగన్ పట్ల జనాలు సానుకూలత చూపారని ఆశ. అనుభవం, దార్శనికత పేరుతో, అమరావతి ఆశతో మళ్ళీ అధికారం అప్పగిస్తారులే అని క...

... మూడు బలిపశువుల కథలు

వంశీ కలుగోట్ల // ... మూడు బలిపశువుల కథలు // ****************************** ************** 1             అనగనగా కథల్లో, పురాణాల్లో చదువుకుని ఉంటాం - ఎవరో ఒకరు ఏదో ఒక దాన్ని ఆశించి ఘోరతపస్సు చేస్తారు. అలా ఎవరు తపస్సు మొదలుపెట్టినా మొదట ఉలిక్కిపడేది ఇంద్రుడు. బహుశా పదునాలుగు లోకాలలో (నిజమా, అబద్ధమా అనేది వేరే విషయం) అత్యంత అభద్రతాభావంతో ఉండేది ఇంద్రుడు మాత్రమేనేమో (ఇపుడూ ఎవరో ఒకరు ఉండే ఉంటారు). ఎందుకంటే ఆ తపస్సు చేసేవారి కోరిక స్వర్గాధిపత్యమేమో లేకపోతే వారు కోరే వేరే కోరికల వల్ల తన పదవికి ముప్పు వస్తుందేమో అనే అనుమానాలు. ఇంద్రుడి తక్షణ కర్తవ్యం ఆ తపస్సును భగ్నం చేయడం - తనకు తెలిసిన అన్ని మార్గాలూ ప్రయత్నిస్తాడు. అవతలి వాడు గట్టి వాడైతే (ఎందుకంటే అప్పట్లో తపస్సులు చేసినోళ్ళందరూ మగోళ్ళే పురాణాల లెక్కల ప్రకారం) అన్నీ తట్టుకుని నిలబడతాడు. అపుడు ఇంద్రుడు చివరి అస్త్రం తీస్తాడు - అదే అప్సరసలను పంపడం. ఆ అప్సరసల మాయలో పడకుండా ఉన్నోళ్ళు బహు అరుదు. ఇక వాళ్ళ తపస్సు భగ్నం, ఇంద్రుడు హ్యాపీ. అప్సరసలతోనూ పని జరక్కపోతే - శివుడు ఏదొక వరం ఇవ్వడం, తరువాత విష్ణువు ఆ సమస్యను పరిష్...

... కవిత్వానికి ఖాళీ కావాలి

వంశీ కలుగోట్ల // ... కవిత్వానికి ఖాళీ కావాలి // ***************************************           కథలు, నవలలు లాంటి వచన పుస్తకాలలో సాధ్యమైనంత వరకూ పుటల్లో ఖాళీ లేకుండా చూసుకుంటారు. కానీ, కవిత్వ పుస్తకాలలో అలా కాదు. ఒక్కో పుటలో దాదాపు సగభాగం ఖాళీగానే ఉంటుంది. కవిత నిర్మాణమే వాక్యాన్నిఅర్థపూరితంగా, భావవంతంగా విడగొట్టడంలోనే ఉంది కదా అనిపిస్తుంది. ఇక ఈ కవిత్వ పుస్తకాలలో ఖాలీ గురించి, మరీ ఎక్కువగా ఆలోచించకపోయినా నేను అప్పుడప్పుడూ అనుకునేవాడిని 'ఇంత స్థలం వృధాగా పోతోంది కదా' అని. కవిత్వ పుస్తకాలు అనే కాదు, కాగితాల్లో కవితలు రాసుకునేపుడు - రాసిన కవిత చూసుకున్న సంతృప్తితో పాటు, ఖాళీగా మిగిలిన జాగా చూసినపుడు ఏదో తెలియని అసంతృప్తి, ఇదమిద్ధంగా ఇదీ అని చెప్పలేనిది.           ఇపుడు శ్రీశ్రీ గారి ఆత్మ చారిత్రాత్మక చారిత్రిక నవల 'అనంతం' చదువుతున్నాను. అందులో నిన్నచదివిన భాగంలో శ్రీశ్రీ గారు ఈ అంశానికి సంబంధించి ఒక వివరణ ఇచ్చారు "'... ప్రతి పేజీలోనూ గీతం ఆక్రమించిన జాగా కొంచమూ, ఖాళీ స్థలం బోలెడూనూ! ఈ ఖాళీ జాగాల్లోనే సి...

... నాణేనికి రెండు వైపులుంటాయి డ్యూడ్

వంశీ కలుగోట్ల // ... నాణేనికి రెండు వైపులుంటాయి డ్యూడ్ // *************************************************** కొద్దిరోజులుగా ఈ మెసేజ్ వాట్స్ యాప్ లో చక్కర్లు కొడుతోంది, సంక్షేమపథకాల ఆవశ్యకత పెరుగుతున్న ఈ తరుణంలో మరీ ఎక్కువైంది. ఇది అంత సమంజసమైనదిగా అనిపించలేదు, అందుకే నాకు అనిపించింది చెప్పాను విషయం (వాట్స్ అప్ మెసేజ్ ద్వారా వచ్చినది) --------------------------------------------------- 40వేలు జీతంతో చావలేక బతుకుతున్న మధ్య తరగతి మనిషి... అంతరంగం.. నువ్వు నిజాయితీగా కట్టే TAX వల్ల... అమ్మ వడి 15000 నీకు రావు ఐటీఐ,డిగ్రీ చదివే పిల్లలువుంటే వసతి 15000 రావు... రైతు భరోసా 12000 రావు.... పంట కోసం రుణం తీసుకుంటే రుణమాఫీ నీకు రాదు..టైం బాగా లేక పంట సరిగా పండక పోతే మద్దతు ధర నీకు రాదు.... బియ్యం కార్డు నీకు రాదు (20kgx50rsx12months)--12000 పెట్టి బియ్యం కొనాల్సిందే ఉగాదికి ఇళ్ల స్థలం నీకు రాదు ఇల్లు కట్టాలంటే ప్రభుత్వం ఇచ్చే 2లక్షల రూపాయలు నీకు రావు డబుల్ బెడ్ రూమ్ ప్లాట్ నీకు ఇవ్వరు ఆరోగ్య శ్రీ కార్డ్ నీకు యివ్వరు ఎంత బిల్లు ఆయినా నువ్వు కట్టాల్సిందే నీకు ఇన్కమ్ సర్టిఫికెట్ ఎక్కువ ఉంది కాబట్టి ...

... రాజకీయాలే గెలుస్తాయి

వంశీ కలుగోట్ల // ... రాజకీయాలే గెలుస్తాయి // **************************************** భవిష్యత్తులో ... అనగా తరువాతి వీలయితే వర్షాకాల లేదంటే సీతాకాల శాసనసభాసామావేశాల సందర్భంగా అధికార ప్రతిపక్ష నేతల తీరు ఈ విధంగా ఉండవచ్చునని ఒక ఊహ - ఇందులో బల్ల చరచడాలు, అసభ్యపదాలు, అడ్డం తగిలేవారి ప్రస్తావన లేకుండా ఊహించడం జరిగింది అని గమనించగలరు సభాపతి: విశాఖ విషవాయువు లీకేజీ ఘటనపై చర్చకు అనుమతిస్తున్నాం. సభ్యులందరూ సభాసంప్రదాయల ప్రకారం నడుచుకుని, చర్చించండి ముఖ్యమంత్రి: అధ్యక్ష్యా మాకు సభా సంప్రదాయాలంటే ఎంతో గౌరవం. మేము మాట ఇస్తున్నాం అధ్యక్ష్యా, సభా సంప్రదాయాల ప్రకారం నడుచుకుంటామని. అధ్యక్ష్యా మేము మాట ఇస్తే మడమ తిప్పమని ఈ సందర్భంగా మనవి చేసుకుంటా ఉన్నాను అధ్యక్ష్యా. ఇక పొతే ... మనం ఒకటి గమనించాలి అధ్యక్ష్యా. విశాఖపట్నంలోని ఎల్జి పొలిమెర్స్ లో జరిగిన గ్యాస్ లీకేజీ ఒక దురదృష్టకర సంఘటన. అధ్యక్ష్యా ఈ ఘటనలో మేము వెంటనే స్పందించి చర్యలు తీసుకుని, బాధితులకు అండగా ఉన్నామని తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష్యా. గతంలో ఎపుడూ, ఎక్కడా జరగని విధంగా, ఎవరూ ఇవ్వని విధంగా మరణించిన వారికి కోటి రూపాయలు  ఇవ్వడం జరిగింది...

... సంక్షేమ పథకాల ఆవశ్యకత

వంశీ కలుగోట్ల // ... సంక్షేమ పథకాల ఆవశ్యకత // *********************************************             చాలాసార్లు మనం అనుకుంటుంటాం - ఈ ప్రభుత్వాలేంటి సంక్షేమ పథకాల పేరిట టాక్స్ మనీ అంతా ఎవరెవరికో ఇస్తున్నాయి, ఏంటి ఈ ధోరణి అని. మొన్నామధ్య కెసిఆర్ గారు హెలికాప్టర్ మనీ అని ఒక విధానం గురించి ప్రస్తావించారు - అంటే ఏంటీ హెలికాప్టర్స్ లోంచి డబ్బులు చల్లుతారా ఏంటి కొంపదీసి అని డౌట్ వచ్చింది. దాని గురించి కాస్త చదివితే అర్థమయింది. ఆర్ధిక పరిస్థితి ఇలాంటి విషమ పరిస్థితిలోకి జారుకున్నపుడు, ప్రభుత్వాలు ప్రజల కొనుగోలు శక్తిని పెంచటానికి అనుసరించే ఒకానొక మార్గం అని. రాండమ్ గా ఎంపిక చేసిన కొన్ని అకౌంట్స్ లోకి ప్రభుత్వమే డైరెక్ట్ గా కొంత నగదును డిపాజిట్ చేస్తుంది, తద్వారా వారి కొనుగోలు శక్తిని పెంచుతుంది (ఇక్కడ వారు కొనేలా ప్రోత్సహించవలసిన ఆవశ్యకత కూడా ఉంది - అది కూడా చేస్తారు). ఆ డబ్బులో అధిక భాగం తిరిగి మళ్ళీ వివిధ మార్గాల ద్వారా ప్రభుత్వానికి వస్తుంది. ఇబ్బందుల్లో ఉంన్నామనుకున్నవారికి కాస్త ధైర్యం వచ్చి, నెమ్మదిగా పనిలో పడటమో లేదా మరోటో మొత్తానికి ఆర్ధిక వ్యవస్థ చక్రం ...

... నిర్లక్ష్యం ఖరీదు

వంశీ కలుగోట్ల // ... నిర్లక్ష్యం ఖరీదు // ****************************** * ఉపోద్ఘాతం: ప్రదేశం: ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు తేదీ/సమయం: మార్చ్ 17 లేదా 18, సాయంకాలం ఒక విషయం గురించి, కొందరు వ్యక్తుల మధ్య ఒప్పందం కురిరాక - ఇక వీడుకోలు తీసుకోబోయే ముందు అతడు: చేతులు కలపండి సార్ నేను: వద్దులే, ఇపుడు అసలే కరోనా భయం ఉంది కదా అతడు:  ఏ అది మనకాడికి రాదు సార్. వచ్చినా యాడ బతుకుతాది? ఈ ఎండలకు మనుషులు బతకడమే కష్టంగా ఉంటే, ఇంగ ఆ కరోనా మన కాడికి యాడ వచ్చేది, వచ్చినా ఎక్కువరోజులుండదు సార్. ఏమంటావ్ అన్నా (పక్కన ఉన్నతనితో) (షేక్ హ్యాండ్ - అంటే చెయ్యి లాక్కొని తీసుకోబడ్డది) *** జనతా కర్ఫ్యూ ప్రకటించటానికి కొన్ని రోజులు ముందు             ... కొన్ని వ్యక్తిగత పనుల నిమిత్తం కర్నూలు జిల్లాలోని మా ఊరు విద్వత్ ఖని (గని) కి వెళ్ళాను, అది మార్చ్ రెండవవారం బహుశా 13 లేదా 14 న అనుకుంటా వెళ్ళాను. అప్పటికే కరోనా భయం మన దేశంలో కూడా వ్యాపిస్తోంది. అప్పటికే సూపర్ మర్కెట్స్ లో, మెడికల్ షాప్స్ లో శానిటైజర్లు, మాస్క్స్ కొరత ఏర్పడింది. కానీ, నేను చూసినంతవరకూ బయట ఎవరూ మాస్క్ పెట...