Posts

Showing posts from December, 2019

...  ఎవరిగోల వారిది

వంశీ కలుగోట్ల // ...  ఎవరిగోల వారిది //  *********************************              వ్యాపారం చేయాలనుకునేవారికి ఉచిత సలహా ఒకటి ఇస్తాను - ఇది ఖచ్చితంగా వర్కౌట్ అయ్యే అవిడియా, నాకు ఫీస్ ఏమీ వద్దు. మీరు తక్కువ ఖర్చుతో ఎక్కువ మరియు నిరంతర ఆదాయం పొందాలనుకుంటే - రెండు వ్యాపారాలు ఉన్నాయి.  ఒకటి              సారా వ్యాపారం. దీనికి మొదట్లో ఖర్చు కాస్త ఎక్కువే అవ్వొచ్చు. ఆ తరువాత మాత్రం అంతా ఆదాయమే. బాధతోనో. దిగులుతోనో, సంతోషంతోనో, కోపంతోనో, ఆవేదనతోనో, మనసు బాలేదనో, ఇంట్లో గొడవ పడ్డారనో ... ఇలా కారణమేదైతేనేం తాగడానికి. అంతేకాదండోయ్ మీరు గమనించారో లేదో - మనదేశంలో నేరాలు చేసినవారిలో దాదాపు 70% దాకా నేరస్థులు మద్యం మత్తులో ఉండగా నేరం చేశారు లేదా నేరం చేయటానికి మద్యంతాగి ఉంటారు. (70% అన్నది కాస్త అటూ ఇటూగా ఉండవచ్చు) ఈ విషయం తెలిసినప్పటికీ ప్రభుత్వాలు మద్యనిషేధం లేదా మద్యం అమ్మకాలపై నియంత్రణ వంటి చర్యలు చేపట్టే ఆలోచన మాత్రంచేయడం కష్టం ఎందుకంటే దానిద్వారా వచ్చే ఆదాయం ఒకానొక ప్రధాన ఆదాయవనరు కాబట్టి. ...

... మూడు బెత్తం దెబ్బలు

వంశీ కలుగోట్ల // ... మూడు బెత్తం దెబ్బలు // ***************************************           ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూడు రాజధానులు ఉండవచ్చు అనగానే చాలామంది ఉలిక్కిపడ్డారు, మరికొంతమంది వెటకారాలు మొదలు పెట్టారు. ఇందులో చాలామంది గతంలో చంద్రబాబు అధికర మరియు అభివృద్ధి కేంద్రీకరణ చేస్తున్నాడని, అన్నీ అమరావతిలోని పెడుతూ మళ్ళీ మిగతా ప్రాంతాలకు అన్యాయం చేస్తున్నాడని అన్నవారే. జగన్ ముఖ్యమంత్రి కాకముందు హై కోర్ట్ కర్నూలుకు లేదా రాయలసీమలోని మరో ప్రాంతానికి (అనంతపూర్ వంటి వెనుకబడిన) ఇస్తే బావుంటుందని అలాగే తిరుపతి వంటి ప్రాంతాన్ని పాలిత కేంద్రంగా చేస్తే బావుంటుందని సూచనలు, సలహాలు ఇచ్చినవారే. ఇపుడు ఆ మేధావుల గత సూచనలకు తగినట్టుగానే అధికార మరియు అభివృద్ధి వికేంద్రీకరణ జరుగబోయే సూచనలు కనబడుతుంటే ఈ  కావడం లేదు.  - ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రానికే మూడు రాజధానులు అంటే మరి భారతదేశానికి 29 రాజధానులా అంటూ కొందరు వ్యాఖ్యలు చేస్తున్నారు. అయ్యా నాకు బట్టతల వచ్చింది కాబట్టి దువ్వెన అవసరం లేదు, అలాగని ఇంకెవ్వరికీ దువ్వెన అవసరం లేదని తీర్మానించేస్తే ఎలా? ప్ర...

వంశీ వ్యూ పాయింట్ - వెంకీమామ

వంశీ కలుగోట్ల // వంశీ వ్యూ పాయింట్ - వెంకీమామ //  ****************************** ***************             మనలో చాలామందిమి వేదికనెక్కి మాట్లాడాలంటే చాలా భయపడతాం. క్రింద ఉండగా అనర్గళంగా గంటలకొద్దీ మాట్లాడేవాళ్ళం, వేదికనెక్కగానే నాలుకను ఎవరో లాగేసినట్టు మాటలు బయటకు రావు.నువ్వు స్టేజి మీద బాగా మాట్లాడతావు అనేవారితో నేను ఒకటే చెబుపుతుంటాను 'నీకు స్టేజి ఫియర్ అనేది లేకపోతే, నీముందు నేను సోదిలోకి కూడా రాను' అని. ఇపుడు పాటలు బాగా రాసేవారు, బాగాపాడలేకపోవచ్చు కదా అలాగన్నమాట. అలానే కథలు రాసేవారు (లేదా బాగా కథలు రాసేవారు), సరిగా తీయలేకపోవచ్చు. ఈ సోది అంతా ఎందుకంటే, 'వెంకీమామ' అనే సోది సినిమా గురించి చెప్పటానికి. ఈ సినిమా దర్శకుడు బాబీ అనే కథారచయిత కాబట్టి. నిజజీవిత మామా అల్లుళ్ళు వెంకటేష్ - నాగచైతన్య మామా అల్లుళ్ళుగా నటించిన చిత్రం కావడంతో సహజంగానే 'వెంకీమామ' చిత్రంపై కాస్త ఆసక్తి ఏర్పడింది. ఎఫ్2 వంటి హిట్ చిత్రం తరువాత వస్తున్న వెంకటేష్ సినిమా కావడం కూడా ప్లస్ పాయింట్.                ముందుగా కథ పరంగా చెప్పుక...

వంశీ కలుగోట్ల // ... తడిసిపోతారు //

వంశీ కలుగోట్ల // ...  తడిసిపోతారు // ****************************** ** వాడు: అది పరిష్కారం కాదు  వీడు: మరి ఏది పరిష్కారం  వాడు: పరిష్కారం చెప్పడం అంత సులువు కాదు  వీడు: మరలాంటప్పుడు ఏం చెయ్యాలి  వాడు: ఏమో నేనెలా చెప్పగలను? అయినా నేను చెపితే వింటారా?  వీడు: మరి వాళ్ళకు చెప్పటానికి ట్రై చెయ్యాల్సి ఉండేది, వినేవారేమో  వాడు: వాళ్ళు వీళ్ళకంటే ఘోరం, ఆ టైంలో చెప్తే వింటారా - నన్ను కూడా అదే చేసేవారేమో  వీడు: మరి అలాంటి వాళ్ళను ఇలా చేస్తే తప్పేముంది?  వాడు: నువ్వెన్నైనా చెప్పురా కానీ వాళ్ళది, వీళ్ళదీ ఇద్దరిదీ తప్పేరా  వీడు: నువ్వొకటి గుర్తించటం లేదురా - వాళ్ళది చర్య, వీళ్ళది ప్రతిచర్య. మొదట వాళ్ళు తప్పు చేసుండకపోతే, వీళ్ళు తప్పు చేయాల్సిన అవసరమే ఉండేది కాదు. వాళ్ళు ఘోరమైన తప్పు చేసి, వీళ్ళను తప్పు చేయకతప్పని పరిస్థితుల్లోకి నెట్టారు.  వాడు: నువ్వు భావోద్వేగపరిస్థితిలోనుండి బయటకు రాకుండా, ఆలోచిస్తున్నావు  వీడు: కరెక్టేరా, కొన్నిసార్లు మిగతా అన్నిటికంటే భావోద్వేగాలే మేలనిపిస్తాయి  వాడు: ఇలా మాట్లాడితే ఏం చెప్తాం  వీడు: చెప్...

వంశీ కలుగోట్ల // ... చదువది ఎంత గల్గినను //

వంశీ కలుగోట్ల // ... చదువది ఎంత గల్గినను //  ***************************************             నేను మా ఊరికి వెళ్ళినప్పుడంతా చాలామందిని కలిసి మాట్లాడుతుంటాను - పెద్దవారు, నా వయసువారు, విద్యార్థులు ఇలా వివిధ వర్గాలవారితో. ముఖ్యంగా నేను వీలు చేసికునైనా సరే పాఠశాల దగ్గరకు వెళ్ళి - ఉపాధ్యాయులు, విద్యార్థులతో కలవటానికి ప్రయత్నిస్తాను. ఇక చదువు పూర్తి చేసినవారు మరియు ఉద్యోగార్థులతో ఇంటి దగ్గరే కలుస్తుంటాను. విద్యార్థులు, నాకంటే చిన్నవారిలో ప్రత్యేకించి నేను గమనించిన అంశం ఒకటి ఉంది. చదువుకుంటున్నవారిలో ఒకరకమైన భయం ఉండటం గమనించాను - ఏమవుతుందో, ఏం చెయ్యాలి/చదవాలి?, ఎలాంటి ఉద్యోగమొస్తుందో, ఎలా బతుకుతామో... ఇలా ఎన్నోప్రశ్నలు, భయాలు. అదే సమయంలో అరకొర చదువులతో ఆపేసినవారు, చదవని వారిలో అలాంటి భయం లేకపోవడం గమనించాను. ఎక్కడికెళ్ళినా, ఎలాగైనా బతకగలమనే ధీమా వారిలో కనబడింది. ఇక్కడ కాకపొతే మరోచోట, ఈ పని కాకపొతే మరోటి చేసుకుని బతకగలమనే నమ్మకం; ఎన్ని కష్టాలు, నష్టాలు ఎదురైనా తిరిగి నిలబడగలమనే ధైర్యం అలాంటివారిలో (చాలామందిలో) గమనించాను. మన చదువులు ధైర్యా...