Posts

Showing posts from June, 2019

... పవనన్నయ్యా, ఇవి విన్నావా?

వంశీ కలుగోట్ల // ... పవనన్నయ్యా, ఇవి విన్నావా? // ************************************************** ఇదిగో పవనన్నయ్యా ఇవన్నీ విన్నావా  -> కిడ్నీ బాధితులకు (ఉద్దానం) నెలకుఅండ్ ఆర్ధిక సహాయం పదివేల రూపాయలకు పెంచారు    -> ఏజెన్సీ ప్రాంతాల్లో బాక్సయిట్ తవ్వకాలకు సంబంధించి గత ప్రభుత్వం ఇచ్చిన జీవోను ఉపసంహరించుకుంటున్నట్టు ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ గారు ప్రకటించారు. తమరికి గుర్తుందో లేదో, ఒకసారి తమరు వెళ్ళి ఆ ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజనులను కలిసి, సంఘీభావం తెలిపి మరీ వచ్చారు  -> అలాగే ఆ అగ్రి గోల్డ్ వ్యవహారానికి సంబంధించి త్వరితగతిన 1150 కోట్లు పరిహారం బాధితులకు అందేలా చర్యలు చేపడుతున్నారు -> హోదా ఉద్యమకారులపై కేసులు ఎత్తివేయాల్సిందిగా కూడా ఆదేశించారు ... ఇవి కొన్నే సుమీ  ఇపుడు వీలయితే ప్రశంసించండి.    ఊరికే ప్రశ్నిస్తా, ప్రశ్నిస్తా అని మాత్రమే కాదు ప్రశంసించడం కూడా నేర్చుకుంటే బావుంటుంది ...              అయినా ఏదో వందరోజుల టైం ఇస్తా అన్నారు, దేనికో కనీసం తమరికైనా క్లారిటీ ఉందా? ...

... అమ్మఒడి పథకం గురించి

వంశీ కలుగోట్ల // ... అమ్మఒడి పథకం గురించి //  ****************************** ***************             అమ్మఒడి పథకం అమలు గురించి పలు రకాల వ్యాఖ్యలు, వ్యాఖ్యానాలు వస్తున్నవి. ముఖ్యంగా, దాదాపుగా అందరూ ఏక కంఠంతో ఖండిస్తున్నది ఈ పథకాన్ని ప్రైవేట్ పాఠశాలలకు కూడా వర్తింపజేయడం గురించి. వ్యక్తిగతంగా నేను కూడా దీనిని ప్రైవేట్ పాఠశాలలకు వర్తింపజేయటాన్ని వ్యతిరేకించాను, వ్యతిరేకిస్తున్నాను కూడా. కానీ, ఇక్కడ మనం గమనించవలసింది ఏమిటంటే జగన్ గారు ఇది ఎన్నికల్లో గెలిచిన తరువాత ఆలోచించి, ప్రకటించిన పథకం కాదు. ఎన్నికలకంటే దాదాపు రెండేళ్ళ ముందే సూత్రప్రాయంగా ప్రకటించారు. ఆ తరువాత పాదయాత్రలోనూ, ఎన్నికల ప్రచార సభల్లోనూ స్పష్టంగా ప్రకటించారు 'పిల్లలను బడులకు పంపే తల్లులకు సంవత్సరానికి 15000 రూపాయలు ఇస్తాను' అని. ముందుగా ఒక అంశం - ప్రత్యేకించి చెప్పకపోయినా, ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అర్హత తెల్ల రేషన్ కార్డు లేదా ఆరోగ్యశ్రీ వంటివాటికి తత్సంబంధిత కార్డు కాబట్టి ఇది తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్న తల్లులందరికీ వర్తిస్తుంది. ఇక నాకు తెలిసినంతవరకూ ఈ పథకం యొక్క ముఖ్య ఉ...

... బురదోపాఖ్యానం

వంశీ కలుగోట్ల // ... బురదోపాఖ్యానం //  ************************************ మనం బురదలో రాయి వేయాలి అన్నపుడు కొన్నిటికి సిద్ధంగా ఉండాలి అలానే కొన్ని విషయాలు తెలుసుకోవాలి  - బురద మన మీద పడగలదు అని అర్థం చేసుకోవాలి - ఎంత దూరంగా ఉండి రాయి వేస్తే బురద చిట్లి మనమీద పడదో అంచనా వేసుకోవాలి - ఎటువంటి రాయి వేస్తే ఎంతదూరం చిట్లుతుంది అన్నది అంచనా వేసుకోవాలి - బురద ఎటువంటిది - అంటే అది సహజంగా ఏర్పడినదా లేక ఎవరైనా బురదగుంటను కావాలనే  ఏర్పరచారా అన్నది తెలుసుకోవాలి  - నిజంగానే బురద ఉందా, లేక ఉన్నట్టుగా కనబడుతోందా అని నిర్ధారించుకోవాలి  - ఆ బురద వర్షపు నీటివల్ల ఏర్పడినదా లేక మురుగునీటితో ఏర్పడినదా అన్నది తెలుసుకోవాలి  - చివరగా, అసలు బురదలో రాయి వెయ్యాలా వద్దా అని మరోసారి సమీక్షించుకోవాలి ఇవేవీ చెయ్యకుండా - బురదలో రాయి వేసి బురద చిట్లింది అంటూ విచారించి లాభం లేదని బురదలో రాళ్ళేసే ఎదవలందరికి చెప్పమని మా శకుంతలాకియా సందేశం పంపింది. 

... పతనమా? వ్యూహమా?

వంశీ కలుగోట్ల // ... పతనమా? వ్యూహమా? // ****************************** **************             తెదేపా నుండి భాజపాలోకి లెక్కకు మిక్కిలిగా వలసలు జరగవచ్చు, తద్వారా రాష్ట్రంలో భాజపా బలమైన ప్రత్యామ్న్యాయంగా ఎదగటానికి ప్రయత్నిస్తోంది అని కథనాలు వస్తున్నవి (ఆ కథనాలకు గతంలో నేనూ ఒక సమిధను వేశాననుకోండి). ఆ విధంగా జరగటంలో గల సాధ్యాసాధ్యాలను ఒకసారి పరిశీలించి చూద్దాం. ఈ అంశాన్ని ఒక్క కోణంలోంచి విశ్లేషిస్తే న్యాయం జరగదు, ఎందుకంటే అక్కడ ఉన్నది అభినవ రాజకీయ చాణక్యుడిగా పేరొందిన వ్యక్తి, బూడిదనుండి కూడా పునరుజ్జీవనం పొందగలిగే ఫీనిక్స్ పక్షి లాంటివాడు అని అభిమానులు భావించే వ్యక్తి అయిన చంద్రబాబు నాయుడు గారు ఉరఫ్ బాబుగారు ఉరఫ్ దార్శనిక మేధావి కాబట్టి ఏదీ అంత వీజీ కాదు మరీ ముఖ్యంగా తెదేపా దుకాణం సర్దేయడం అన్నది అంత వీజీ అయిన పని కాదు. ముందుగా ఈ వలసల వల్ల ఏం జరగవచ్చు అనేది రెండు కోణాల్లోంచి పరిశీలించి చూద్దాం.  *            *            *       ...

... అనుభవం 2

వంశీ కలుగోట్ల // ...  అనుభవం  : 2// **********************************               నేనే సీనియర్ని, నాది నాలుగు దశాబ్దాలకు పైగా అనుభవం అంటూ ప్రతిసారీ ప్రస్తావించకండి బాబు గారు ... క్రింద పేర్కొన్న అతి కొన్ని అంశాలను పరిశీలించుకున్నపుడు అది అనుభవమా ఆక్కూర కట్టా అనుకోవాల్సిందే  -> 23 మంది ఎమ్మెల్యేలను, ముగ్గురు ఎంపీలను వేరే పార్టీ ద్వారా సంక్రమించిన వారి సభ్యత్వాలకు రాజీనామా చేయకుండానే మీ పార్టీలోకి తీసుకున్నపుడు; అందులో నలుగురికి మంత్రి పదవులిచ్చినపుడు  -> ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి రాయలసీమ రౌడీలు, పులివెందుల గూండాలు అంటూ ప్రాంతాలను కించపరిచేలా మాట్లాడినపుడు  -> దళితులుగా పుట్టాలని ఎవరూ కోరుకోరు అంటూ దళితుల మనోభావాలను కించపరిచేవిధంగా మాట్లాడినపుడు  -> వాస్తవాస్తవాలు తెలుసుకోకుండా ఘటన జరిగిన గంటలలోపే ప్రతిపక్షం వారి హత్యారాజకీయాలను సహించను అంటూ చిత్తూరు మేయర్ హత్య ఘటనలో మాట్లాడి, ఆ తరువాత హత్య చేసినది తెదేపా సభ్యుడు మరియి స్వయానా మేయర్ మేనల్లుడు అని తెలిసినపుడు స్పందించకుండా ఉన్నపుడు...