'సీక్రెట్ సూపర్ స్టార్' ఒక అద్భుతం
వంశీ కలుగోట్ల // 'సీక్రెట్ సూపర్ స్టార్' ఒక అద్భుతం // ****************************** ***************** కొన్నిసార్లు ఏదైనా 'ఎలా ఉంది' అని అడిగితే చెప్పటం చాలా కష్టం; ఎందుకంటే కొన్ని అద్భుతాలను, అనుభవాలను మాటల్లో వర్ణించడం వీలుకాదు, ఎవరికీ వారు స్వయంగా అనుభూతి చెందాల్సిందే. మన అదృష్టం కొద్దీ అప్పుడప్పుడూ అలాంటివి అనుభూతి చెందే అవకాశం లభిస్తుంటుంది. మన భారతీయ సినిమా రంగం అటువంటి అద్భుతాలను సృష్టించడం మానేసి దశాబ్దాలు అయినట్టుంది. ఎప్పుడో అప్పుడప్పుడు కొన్ని చమక్కులు తప్పించి. చక్కటి కథ అన్నా, అద్భుతం తినాలన్నా, హాలీవుడ్ స్థాయి అన్నా ఇపుడు అంతా గ్రాఫిక్స్ మాయాజాలం మాత్రమే అనే భ్రమలో కొట్టుకుపోతున్నారు 99% మంది. ఆ మిగిలిన 1% లో అధికులు అత్యంత ప్రతిభావంతులైన అనామకులు అనగా అంతగా పేరు, ప్రఖ్యాతులు లేనివారుగా ఉండటంతో వారి ప్రయత్నాలు కూడా ప్రాచుర్యం పొందవు, అటువంటి సినిమాలు వెలుగు చూడవేమో. కానీ, ఆ 1% లో కొద్దిమంది స్టార్స్ కూడా ఉంటారు అమీర్ ఖాన్, అక్షయ్ కుమార్ లాంటివాళ్ళు. ఎవరో వేరే వారు డబ్బు ప...