హేవిటో ...

వంశీ కలుగోట్ల // హేవిటో ... //
******************************
-> తిరుమలకు వచ్చిన తెలంగాణ ముఖ్యమంత్రికి సకల సదుపాయాలు కల్పించటంతో పాటు, ప్రత్యేకంగా చూసుకోవాలని మన ఆంధ్రపదేశ్ ముఖ్యమంత్రి శ్రీశ్రీశ్రీ చంద్రబాబుగారు ఆజ్ఞాపించినట్టు; తదుపరి వ్యవహారాలను తానే స్వయంగా చూసుకున్నట్టు వార్తలు వచ్చాయి. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి మీద ఎంత ప్రేమ, ఎంత ప్రేమ!? అవునూ, ఇంతకీ అది ప్రేమా లేక భయమా!?
-> అదేమిటో తమ్ముళ్ళందరూ శ్రీ కెసిఆర్ గారిని కలిసిన వైకాపా నాయకుల గురించి జోకులేసుకుంటున్నారు కానీ, కెసిఆర్ గారికి కావలసిన ఏర్పాట్లను భయభక్తులతో చూసుకున్న బాబుగారి గురించి మాత్రం (వార్తల ప్రకారం) పల్లెత్తు మాట అనటం లేదు. బహుశా, బాబుగారు ఏది చేసినా సమాజ సంక్షేమం కోసమే తప్పించి ఆయన స్వార్థం కోసం కాదు అనేమో ... ఎంతైనా సూక్తులందు పచ్చ సూక్తులు వేరయా. 
-> సిన్నన్నయ్య ఎవరినుద్దేశించి అన్నాడో తెలియదు కానీ వారసత్వాల గురించి కామెంటేసరికి జనాలు తనగురించి తానే కామెంటుకున్న సిన్నన్నయ్యను సూసి అచ్చెరువొందుతున్నారు.
-> ఎన్నికలు ఉన్న రాష్ట్రాలలో మాత్రమే రైతు ఋణమాఫీ, ప్రత్యేక నిధులు తదితర పదాలు గుర్తొస్తున్నాయి భాజపా వారికి. ఇంతకీ బీహార్ ఎన్నికలప్పుడు మన మోడీ గారు వేలంపాటలో పాడుకున్న నిధులు ఇచ్చారా, ఎవరికేనా సమాచారముందా?
-> ఏమయ్యిందో కానీ అటు ప్రధాని, ఇటు ముఖ్యమంత్రి విదేశీ పర్యటనలు తగ్గించుకునేసరికి విమానయాన సంస్థలు రాబడి తగ్గుతోందని దిగులుపడుతున్నాయని అభిజ్ఞవర్గాల భోగట్టా. ఇంతకీ మన రాజధాని ఏ దేశపు నగరంలా ఉండబోతోందో ఇప్పటికైనా ఒక అవిడియా వచ్చిందంటారా?
-> హోదా కోసం నిరంతర పోరాటం అన్న ప్రతిపక్షాలు, సిన్నన్నయ్య, విద్యార్థి/యువజన సమితులు ఏమయ్యాయో అర్థం కావటం లేదు. సిన్నన్నయ్య అంటే సినిమాలు సేసుకుంటన్నాడు; ప్రతిపక్షాలు రాజకీయం సేసుకుంటాన్నాయి మరి మిగతావారు!!!?

Comments

Popular posts from this blog

... మూడో కూటమి

... కరోనా కంటే ఎక్కువగా భయపెడుతున్న అంశం?

... 2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు - జనసేన