నేనింతేరా నాయనా ...
వంశీ కలుగోట్ల // నేనింతేరా నాయనా ... // **************************************** "సముద్రం ఒకడి కాళ్ళ దగ్గర కూర్చుని మొరగదు తుఫాను గొంతు చిత్తం అనడం ఎరగదు పర్వతం ఎవ్వడికి ఒంగి సలామ్ చెయ్యదు నేనింకా ఒక పిడికెడు మట్టే కావచ్చు కాని కలమెత్తితే ఒక దేశపు జండాకున్నంత పొగరుంది."- శేషంద్ర ఒక రచయితగా/కవిగా లేదా రచయితను/కవిని అనుకునేవాడిగా ఇప్పటికి ఆరు వందలకు పైగా కవితలు, ముప్ఫయికి పైగా రాజకీయ వ్యంగ్య కథలు/కథానికలు; వందకు పైగా విశ్లేషణాత్మక వ్యాసాలు, ఒక బుర్రకథ, పది ప్రచురిత పుస్తకాలు (వ్యక్తిత్వ వికాసం సంబంధిత అంశాలపై), పది మాసాల పాటు 'జాగృతి' మాస పత్రికలో అసోసియేట్ సబ్ ఎడిటర్ గిరీ, ఆరు మాసాలపాటు 'శ్రీ దత్త ఉపాసన' మాస పత్రికకు సబ్ ఎడిటర్ గిరీ వెలగబెట్టటం వంటివి చేశాను. (మధ్యలో దాదాపు పన్నెండు సంవత్సరాల అస్త్రసన్యాసంతో కలుపుకుని). నేను రాసిన వాటిలో ఎక్కువగా రాజకీయ వ్యంగ్య రచనలే అయినప్పటికీ దాదాపు అన్ని అంశాలను స్పృశించాను. ప్రేమ, స్నేహం, ఆధ్యాత్మికత, అణచివేతలు, శృంగారం,...