అవీ ... ఇవీ అనబడు సాంబడి అనుమానాలు
వంశీ కలుగోట్ల // అవీ ... ఇవీ అనబడు సాంబడి అనుమానాలు // ****************************** ****************************** ************* 1. ఓహ్ వ్వావ్ అద్భుతం, ఆశ్చర్యం, పరమాద్భుతం - మీడియా అనగా అదేనండీ పచ్చమీడియా లేదా ఆ రెండు పత్రికలు గత కొద్దిరోజులుగా పాటించిన స్వీయ నియంత్రణ గురించి చెబుతున్నాను. ముద్రగడ కాపు రేజర్వేషన్స్ ఉద్యమం విషయంలో ఆ రెండు పత్రికలు పాటించిన స్వీయ నియంత్రణ అత్యంత ఆశ్చర్యకరమైన అద్భుతమైన పరమ వ్వావ్ అన్నమాట. ఇంతటి జ్ఞానమే కనుక వారికి ఎన్నికల ప్రచార సమయంలో కలిగి ఉంటే ఆ సమయంలో బాబు గారు నోటికి అదుపు లేకుండా, విలేఖరుల చేతులు నొప్పెట్టేలా రాసుకునేంతటి లిస్ట్ లో హామీలు గుప్పించిన సమయాన ఈ నియంత్రణ పాటించి ఉంటే అసలు అలాంటి హామీ అంటూ ఒకటి ఇచ్చాడని కాపు జనాలకు తెలిసేది కాదు కదా. ఓ అలా అయితే ఆయన అధికారంలోకి ఎలా వస్తాడనే భయం కాబోలు. 2. మేధావులు వచ్చారండీ - ముద్రగడకు కొన్ని ప్రశ్నలు అంటూ తెగ పోస్టుతున్నారు. అయ్యలూ అదేదో బాబు గారికి కూడా సంధించొచ్చుగా తవరి ప్రశ్నలు. అసలు ఇంతటికీ మూలకారణం ఆయనగారి హామీలే కదా. ఆ హామీల చిట్టా తీసి ప్రశ్నలు సాధించండి. ఊహూ అ...